For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆపుకోలేని ఆవలింత... ('చక్కిలిగింత' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.0/5

  నావెల్టీ కాన్సెప్టు ఎత్తుకోవటం ఒక ఎత్తు...దాన్ని భారం అనిపించుకండా ప్రేక్షకులపై దించటం మరొక ఎత్తు. అందులోనూ సుకుమార్ క్యాంప్ నుంచి వస్తున్న దర్శకుడు అంటే స్క్రీన్ ప్లే తో మాయ చేసాడని భావిస్తారు. అయితే ఈ చిత్రంతో పరిచయమవుతున్న వేమారెడ్డి ఆ మ్యాజిక్ నే మిస్సయ్యారు. స్క్రీన్ ప్లే సరిగ్గా సమకూర్చుకోకపోవటంతో ప్లస్ అవుతాయనున్న సన్నివేశాలన్నీ కలిసి రాలేదు. ముఖ్యంగా వాస్తవ దూరంగా ఉన్న చిన్న స్టోరీ లైన్, దాన్ని ప్రెజెంట్ చేసిన ప్రెడిక్టుబుల్ స్క్రీన్ ప్లే మైనస్ గా మారి ఇబ్బంది పెట్టాయి. కొన్ని సీన్లలో దర్శకుడు మార్క్ కనిపించినా అదే సినిమాని నిలబెట్టలేదు కదా...సుమంత్ అశ్విన్ కు ఇలాంటి పాత్రలు రొటీన్ అవుతున్నాయి..అతని నటనలాగే. ట్రాక్ మార్చుకోకపోతే అతన్ని మర్చిపోవటం కష్టమేమీ కాదు.

  కాలీజేలో చదువుకుంటున్న ఆడి(సుమంత్ అశ్విన్) కు కొన్ని నమ్మకాలు ఉంటాయి. అమ్మాయిలు వెంటపడి ప్రేమిస్తున్నామంటూ తిరిగితే ఆడపిల్లల దగ్గర అలుసైపోతామని..దాన్ని తను నమ్మటమే కాకుండా తన తోటి వాళ్లందరిమీదా రుద్దుతాడు. అమ్మాయిలతో మాట్లాడకూడదు..చూడకూడదు... అప్పుడు మన విలువ వారికి అర్దమవుతుందని వారికి నూరి పోస్తాడు. దాంతో కుర్రాళ్లంతా దాన్నే ఫాలో అయిపోవటంతో..అమ్మాయిలకు బెంగ పట్టుకుంటుంది. ప్రపంచంలో కుర్రాళ్లే కరువయ్యారన్నట్లు వీళ్లు మనని చూడటం లేదే అని తెగ ఫీలైపోతూంటారు. అప్పుడు వేరే కాలేజీనుంచి మన హీరోయిన్ అవంతిక (రెహన) దిగుతుంది. ఈ ఇంటర్నేషన్ సమస్యని పరిష్కరించటానికి... కుర్రాళ్ళందరినీ ఏకబిగిన చెడకొట్టిన వాడ్ని ప్రేమలో పడేస్తే అంతా ఒక దెబ్బకు సెట్ అయిపోతుందని ఆమె ఆడిని ప్రేమలో దించటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఏం జరిగింది...ఆ కాలేజీ పరిస్ధితి ఏమైంది... హీరో మారాడా...చివరకి ఏమైంది వంటి మీకు తెలిసిన విషయాలే మరోసారి చూడాలంటే థియోటర్ కు వెళ్లాల్సిందే.

  విజువల్ గా,లాజికల్ గా బాగా ఉండేలా చూసుకున్న దర్శకుడు ఎందుకనో సినిమా ఆడాలంటే ఎమోషన్ కూడా మిక్స్ అవ్వాలనే విషయం మర్చిపోయాడు. ఎక్కడో చోట మన గుండెని తడమటమో, లేక మన జీవితంలో ఇలాగే జరిగిందో, లేక ఇలా జరిగితే బాగుండునో అనిపించకపోతే లవ్ స్టోరీకు నిండుతనం రాదు. రొమాంటి కామెడీలో సైతం విడిపోవటం, పొందటం అనే రెండు విభాగాలు చాలా ఎమోషనల్ గా తీర్చిదిద్దాలని చెప్తూంటారు. ఎందుకనో అనుభవమున్న స్క్రిప్టు రైటరైనా వేమారెడ్డి ఆ విషయం మర్చిపోయి...కేవలం స్టోరై లైన్ లో నావల్టీ మాత్రమే చూసుకున్నారు.

  స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

  పెద్ద మైనస్ ...

  పెద్ద మైనస్ ...

  ఎత్తుకున్న పాయింట్ చిన్న దవటంతో దాన్ని చివరి వరకూ సాగ తీసే ప్రాసెస్ లో ప్రక్క దోవలు పట్టిచటం, ఎంటర్ట్న్మెంట్ మిస్ అవటం ఈ సినిమాకు ప్రధాన మైనస్ లాగ మారాయి.

  ఓకేనే కానీ..

  ఓకేనే కానీ..

  ఈ చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన వేమారెడ్డి దర్శకుడు అంటే కేవలం మేకింగ్ పరంగా అద్బుతం కాకపోయినా బాగానే చేసాడని చెప్పాలి. మంచి స్క్రిప్టు దొరికితే ప్రూవ్ చేసుకుంటాడనిపించింది.

  అదుర్స్..

  అదుర్స్..

  ఈ సినిమాలో కెమెరా వర్క్ విషయం ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. లొకేషన్స్ ని చూపించిన విధానం, కలర్ స్కీమ్ లు చాలా జాగ్రత్తగా వాడుకుంటూ కలర్ ఫుల్ గా తెరని నింపేసాడు.

  అబ్బా ...ఇక్కడే అదే సమస్య

  అబ్బా ...ఇక్కడే అదే సమస్య

  ఈ మద్య చాలా సినిమాల్లో ఎడిటింగ్ ఇంకా బాగా చేసి ఉంటే బాగుంగును అనే ఫీల్ వస్తోంది. దర్శకుడు దగ్గరుండి చేయించుకునేదే అయినా ఎడిటర్ కూడా తన క్రియేటివిటీ ని చూపి, ప్రేక్షకుడుకి ఇబ్బంది కలిగించకుండా సీన్స్ ని కట్ చేస్తే బాగుండేది.

  ఈ విభాగం కూడా బాగుంది

  ఈ విభాగం కూడా బాగుంది

  సంగీతం మిక్కీజే మేయిర్ బాగానే అందించారు. అయితే దాన్ని సపోర్ట్ చేసే సీన్స్ సినిమాలో పెద్దగా లేవు. దాంతో హైలెట్ కాలేదు. డైలాగులూ నీరసమే.

  కామెడీ

  కామెడీ

  యూత్ సినిమాల్లో హైలెట్ గా ఉండాల్సిన కామెడినీ వైవా హర్ష, జబర్ధస్త్ చందూ భుజాన ఎత్తుకున్నారు. ఇక తాగుబోతు రమేష్ ఈ సారి కాస్త రొటీన్ కు భిన్నంగా ...తాగుడు కాకుండా సెంటిమెంట్ తో సీన్స్ పండించాడు.

  ఫస్టాప్..సెకండాఫ్

  ఫస్టాప్..సెకండాఫ్

  ప్రారంభమైన మొదటి ఇరవై నిముషాలనుంచి సినిమా స్లో అవటం మొదలైంది. మరి ఇదేమన్నా కొత్త తరహా స్క్రీన్ ప్లే నో ఏమో. డైరక్టర్ ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఆ స్లోని పెంచుకుంటూ ముందుకు వెళ్లిపోయారు. దానికి తగినట్లు రన్ టైమ్ కూడా బాగా ఎక్కువ ఉంది.

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  బ్యానర్ :మహి ఎంటర్‌టైన్‌మెంట్

  నటీనటులు : సుమంత్‌ అశ్విన్‌, రెహానా, చైతన్యకృష్ణ, తాగుబోతు రమేష్‌, సప్త గిరి, జోష్‌రవి, వివా హర్ష, వేణు, సురేఖవాణి, శివన్నారాయణ, అంబ టి వ్రీను, నవీన్‌ తదితరులు

  సంగీతం: మిక్కీ జె.మేయర్‌,

  సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్‌,

  ఎడిటింగ్‌: కార్తీక్‌ శ్రీనివాస్‌,

  పాటలు: వన మాలి, అనంతశ్రీరామ్‌, శ్రీమణి,

  ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌,

  డాన్స్‌: ప్రేమ్‌రక్షి త్‌, రఘు,

  ఫైట్స్‌: వెంకట్‌,

  నిర్మాతలు: సి.హెచ్‌.నరసింహాచారి, నరసిం హారెడ్డి ఇలవల,

  రచన, దర్శకత్వం: వేమారెడ్డి టి.

  విడుదల తేదీ: డిసెంబర్ 5, 2014.

  ఫైనల్ గా... సుమంత్ అశ్విన్ గత చిత్రం లవర్స్ లాంటి ఎత్తుగడను గుర్తు చేసే ఈ చిత్రం...ఆ చిత్రం విజయానికి సప్తిగిరి చేసిన అల్లరి కామెడీనే ప్రధాన కారమనే విషయం మర్చిపోయినట్లున్నారు. దాంతో ఈ చక్కలిగింత మనకు ఏ మాత్రం కొంచెం కూడా గిలిగింతలు పెట్టలేదు. టార్గెట్ చేసిన యూత్ కు కూడా కనెక్టు అవటం కష్టమే అనిపిస్తోంది.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Sumanth Ashwin's latest Chakkiligintha ready to release today with divide talk. Tipped to be romantic entertainer, the film is being directed by Vema Reddy who worked as an associate director and screen writer for Sukumar earlier.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X