For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మక్కీ డోనర్ (సుమంత్ ‘నరుడా డోనరుడా’రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  2.5/5

  రీమేక్‌లు చేసేటప్పుడు ఇక్కడ నేటివిటీ కోసం పాకులాడుతూంటారు దర్శక, నిర్మాతలు. అయితే అదే సమయంలో అంత రేటు పెట్టి కొన్న సినిమాలో సీన్ మార్చాలన్నా బాధ వేస్తుంది. అంతేకాకుండా ఆ ఒక్క సీనే జనాలకు అక్కడ కనెక్టు అయ్యిందేమో మనం మార్చటమెందుకు అని కూడా అనిపిస్తుంది. అలా రీమేక్ సినిమాలు చాలా సార్లు కట్ అండ్ పేస్ట్ గా మారి మన ముందుకు వస్తాయి.

  ఇంతోటి దానికి డబ్బింగ్ చేస్తే సరిపోయేది కదా అని ఒరిజనల్ చూసిన వారికి అనిపించటం జరుగుతుంది. బాలీవుడ్‌లో మంచి హిట్ అయిన విక్కీ డోనర్ రీమేక్ గా ఈ రోజు రిలీజ్ అయిన ఈ 'నరుడా డోనరుడా' మీద కూడా అలాంటి ఆలోచనే కలుగుతుంది. అయితే ఓ మంచి సాహసోపేతమైన ప్రయత్నంగా మాత్రం దీన్ని మెచ్చుకోవాల్సిందే.

  వాస్తవానికి ఇది ఓ స్పెర్మ్‌ డోనర్‌ కథ . ఇలాంటి కాన్సెప్టు తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావటం గొప్ప విషయమే. అందుకే రిలీజ్ అయ్యి ఇంతకాలం అయ్యినా రీమేక్ అవకుండా ఆగిపోయింది. అయితే సుమంత్ మనసు పడి మరీ ఈ ప్రాజెక్టుని ముందుకు తెచ్చాడు. ఈ నేపధ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా.. అర్థమయ్యేలా ఈ సినిమాను తీసారా? సుమంత్‌ కెరీర్‌ కు ఈ సినిమా ఏమన్నా ఉపయోగపడుతుందా? ఇవన్నీ తెలుసుకోవాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

  ఇదీ కథా సెటప్

  ఇదీ కథా సెటప్

  క్రికెటర్ విక్కీ (సుమంత్‌) ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. తన అవసరాల కోసం ఏదైనా చివరకు తన ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లను కూడా అమ్మేసే టైపు. అతని తల్లి (శ్రీలక్ష్మి) బ్యూటీ పార్లర్ నడుపుతూంటుంది.. నాయనమ్మలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూంటాడు. పనిలో పనిగా ఓ బ్యాంకులో పనిచేసే ఆషిమా రాయ్‌ (పల్లవి సుభాష్‌) అనే బెంగాలీ అమ్మాయితో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. తాను కూడా కాదనటమెందుకు అని మెల్లమెల్లగా విక్కీతో ప్రేమలో పడిపోతుంది.

  నిజం దాస్తాడు

  నిజం దాస్తాడు

  అయితే తాను ఇది వరకే ఒకర్ని ప్రేమించి పెళ్లి చేసుకుని అతనితో విడాకులు తీసుకున్న విషయాన్ని విక్కీకి ముందే చెబుతుంది. విక్కీ మాత్రం ఆషిమా దగ్గర ఓ నిజం దాస్తాడు. కానీ ఆషిమా దగ్గర దాచిన విషయం వింటే ఆమె ఒప్పుకోదని అనుమానం.

  నిజం దాచి పెళ్లి

  నిజం దాచి పెళ్లి

  ఇంతకీ విక్కీ దాచిన నిజం ఏమిటీ అంటే.. తనో స్పెర్మ్‌ డోనర్‌. సంతాన సాఫల్య కేంద్ర నిర్వాహకుడు ఆంజనేయులు (తనికెళ్ల భరణి) బలవంతం చేయడంతో తన వీర్యాన్ని దానం చేయడానికి ఒప్పుకొంటాడు.ఈ నిజం దాచి అషిమాని పెళ్లి చేసుకొంటాడు.

  విక్కీ తాతల కాలం నుంచీ..

  విక్కీ తాతల కాలం నుంచీ..

  ఎవరూ దొరకనట్లు డాక్టర్ ఆంజనేయలు... విక్కీ వెనకే ఎందుకు పడతాడంటే.. సంతాన సాఫ‌ల్య కేంద్రం న‌డుపుతూ.. త‌న ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన క్లైంట్ల‌కు న్యాయం చేయ‌లేక‌, బోర్డు తిప్ప‌ేసే పరస్దితుల్లో ఉంటాడు. ఆయన ... ఓ మంచి వీర్య‌దాత కోసం వెదుకుతుంటాడు. త‌న చూపు విక్కీ పై ప‌డుతుంది. విక్కీ తాత ముత్తాత‌లు ఒకొక్క‌రూ డ‌జ‌ను మంది పిల్ల‌ల‌కు తండ్రుల‌వ్వ‌డ‌మే అందుకు కార‌ణం. ఆ బీజాలు త‌న ఆసుప‌త్రికి ప‌నిచేస్తాయ‌న్న ఉద్దేశంతో విక్కీ వెంట ప‌డ‌తాడు ఆంజ‌నేయులు

  అలా ఓకే అంటాడు

  అలా ఓకే అంటాడు

  మొదట స్పెర్మ్ డోన‌ర్ అనే ప‌దాన్ని ముందు చిరాగ్గా చూసిన విక్కీ.. ఆత‌ర‌వాత డబ్బులు కోసం, ఓకే అంటాడు . అలా.. ఆంజ‌నేయులు సంతాన సాఫ‌ల్య కేంద్రం మంచి పేరు తెచ్చుకుని డవలప్ అవుతుంది. విక్కీ కూడా రెండు చేతులా సంపాదించేస్తుంటాడు. అప్పటినుంచీ తన ఖర్చులకు.. అవసరాలకు సరిపడినంత డబ్బు వస్తుండడంతో దానికి అలవాటు పడతాడు.

  అప్పుడేం జరిగింది.

  అప్పుడేం జరిగింది.

  అయితే ఓ సిట్యువేషన్ లో విక్కీ స్పెర్మ్ డోనర్ అనే నిజం అషిమాకు తెలిసిపోతుంది. ఆమె అతన్ని విడిచి వెళ్లిపోతుంది. కథలో పెద్ద మలుపు వస్తుంది. తను చేస్తున్న వృత్తి తన ఫ్యామిలీ లైఫ్ కు ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అప్పుడు ఏం జరిగింది? వీళ్లిద్దరి కథ ఏ మలుపు తిరిగింది? వీళ్ల వైవాహిక జీవితం ఏమైంది? ఈ విషయాలన్నీ వెండితెర మీద చూసి తెలుసుకోవాల్సిందే.

  హీరోయిన్ వైపు నుంచి సమస్య

  హీరోయిన్ వైపు నుంచి సమస్య

  మరో ప్రక్క విక్కీని పెళ్లి చేసుకున్న ఆషిమా కు కొన్ని ఆరోగ్య‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల‌తో.. త‌న‌కు పిల్లలు పుట్ట‌ర‌ని అర్థ‌మ‌వుతుంది. ఈ నిజాలు తెలుసుకొన్న అషిమా ఇప్పుడేం నిర్ణయం తీసుకుంది? విక్కీని అర్థం చేసుకొందా, లేదా? అస‌లు వీళ్లిద్ద‌రికి పిల్లలు పుట్టారా, లేదా?

  తెలుగుకి వర్కవుట్ అవుతుందా

  తెలుగుకి వర్కవుట్ అవుతుందా

  కొన్ని కాన్సెప్టులు వినటానికి విచిత్రంగా ఉంటాయి. అరే ఇలాంటి కథలు కూడా సినిమాలు చేస్తారా అనే డౌట్ వస్తుంది. అయితే ఆ విచిత్రంగా అనుకున్న కథలే ఒక్కోసారి హై సక్సెస్ ని తెచ్చిపెడతాయి. అదే బాలీవుడ్ లో జరిగింది. తెలుగు కు వచ్చేసరికి మరి ఆ స్దాయి సక్సెస్ వస్తుందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేక్షకులు వేరు. వీరికి మరికాస్త సున్నితంగా చెప్పాల్సిన అవసరం ఉంది.

  కానీ చూసేసారే

  కానీ చూసేసారే

  వాస్తవానికి విక్కీ డోనర్ చిత్రం ఎక్కువగా ఆడింది మల్టిఫ్లెక్స్ లలో . ఓ స్దాయి ఆడియన్స్ కు అది నచ్చింది, హిట్ చేసి వదిలారు. అదే తెలుగుకు వచ్చేసరికి ఇక్కడ కూడా అదే స్దాయి ప్రేక్షకులకు అర్దం చేసుకునే కథ. అయితే ఇక్కడ మల్టిఫ్లెక్స్ లలో ఇలాంటి సినిమాలు చూసే ఆసక్తి ఉన్నవాళ్లు ఆల్రెడీ హిందీలో చూసేసారు.

  మరింత ప్రభావవంతంగా చెప్పాల్సింది

  మరింత ప్రభావవంతంగా చెప్పాల్సింది

  సినిమాలో కీలకమైన ఎమోషన్ హీరో హీరోయిన్లు విడిపోయే సీన్ లో వస్తుంది. అయితే దాన్ని ఇంకాస్త ఎఫెక్టీవ్‌గా చెప్పాల్సింది అనిపించటం ఖాయం. అప్పుడే సెకండాఫ్ లో పండే డ్రామాకి ఇంకాస్త బాగా కనెక్ట్ అయ్యేది. ఫస్టాఫ్ మొత్తం తొలిభాగం కేవ‌లం స్పెర్మ్ డొనేష‌న్‌పై.. సెకండాఫ్ మొత్తం భార్యా భ‌ర్త‌లు విడిపోవ‌డం, కలవటం పై సాగుతాయి. కాబ‌ట్టి చూసిన సీన్స్ రిపీట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది చాలా చోట్ల.

  కాపీ పేస్ట్ అంటారు

  కాపీ పేస్ట్ అంటారు

  బాలీవుడ్‌ చిత్రాన్నీ.. అందులో పాత్రల్నీ మక్కీకి మక్కీ దించే ప్రయత్నం జరిగటంతో... ‘విక్కీ డోనర్‌' చూసిన వాళ్లకు ఈ సినిమా కాపీ పేస్ట్‌లానే ఉంటుంది. అయితే హిందీలో చూడని తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఈ కథా నేపథ్యం కొత్తగా అనిపిస్తుంది.

  ఫన్నీ డైలాగ్స్

  ఫన్నీ డైలాగ్స్

  వీర్యదానం, విత్తనం.. లాంటి డైలాగులే ఫస్టాఫ్ అంతా వినిపించి నవ్వించాయి. అలాగే ఉన్నంత‌లో ఓవ‌ర్ డోస్ అనిపించ‌కుండా... ప‌రిధిలోనే ఉండ‌డానికి ర‌చ‌యిత‌లు క‌ష్ట‌ప‌డాల్సివ‌చ్చిందని అర్దమవుతూంటుంది.

  లెగ్త్ తగ్గిచ్చేమో

  లెగ్త్ తగ్గిచ్చేమో

  ఈ సినిమా చూస్తూంటే లెంగ్త్ ఎక్కువైందనిపిస్తుంది. మ‌రో 20 నిమిషాల్ని ట్రిమ్ చేస్తే...విషయం మరింత బాగా కనెక్టు అవుతుంది. అలాగే పెళ్లి చూపుల సీన్‌లో య‌మ‌హా న‌గ‌రి.. అంటూ హీరో పాట అందుకోవ‌డం.. వంటి కొన్ని స‌న్నివేశాలు మ‌రీ లెంగ్తీగా ఉండ‌డం విసుగు తెప్పిస్తాయి.

  తణికెళ్లనే టాప్

  తణికెళ్లనే టాప్

  పోలీక పెట్టకూడదు కానీ..రీమేక్ కాబట్టి వచ్చేస్తుంది.. వాస్తవానికి బాలీవుడ్ హీరో చేసిన రేంజ్ లో సుమంత్ అయితే చేయలేకపోయాడనే చెప్పాలి. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ అంతంత మాత్రంగానే ఉంది పెద్ద మాట్లాడుకోవటం అనవసరం. ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాత్ర ఏమైనా ఉందంటే అది తనికెళ్ళ భరణి. ఫెర్టిలిటీ డాక్టర్ గా తనదైన స్టయిల్ లో నటిస్తూ.... విత్తనం అంటూ ప్రేక్షకులను నవ్వించారు.

  డైరక్షన్, స్క్రీన్ ప్లే

  డైరక్షన్, స్క్రీన్ ప్లే

  దర్శకుడుగా మల్లికరామ్ పాసయ్యాడు కానీ డిస్టంక్షన్ తెచ్చుకోలేదనే చెప్పాలి. ఎందుకంటే పేలుతాయనుకున్న కామెడీ సీన్స్ ..చప్పగా ఉండిపోయాయి చాలా చోట్ల. అలాగే తెలుగు ప్రేక్షకుడుని దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసుకుంటూ స్క్రీన్ ప్లే చేయాల్సింది. ముఖ్యంగా పిల్లలు లేని తల్లుల ఆవేదనను పోట్రెయిట్ చేసి ఉంటే సినిమాకు డెప్త్ వచ్చేది. అయితే క్లైమాక్స్ సీన్స్ డీల్‌ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది.

  సాంకేతికంగా...

  సాంకేతికంగా...

  శ్రీ చరణ్ సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. . పాట‌లు గుర్తుంచుకొనేలా లేవు. పాటలు లేకుండా ఉండే బాగుండేది అని చాలా సార్లు అనిపిస్తుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫి సినిమా స్థాయికి నార్మల్ గా ఉన్నాయి.

  ఈ సినిమాకి పనిచేసిన టీమ్

  ఈ సినిమాకి పనిచేసిన టీమ్

  బ్యానర్: ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్
  నటీనటులు: సుమంత్, పల్లవి సుభాష్, తనికెళ్ల భరణి, సుమనశెట్టి, శ్రీలక్ష్మి, శేషు, భద్రమ్‌, తదితరులు
  సినిమాటోగ్ర‌ఫీ: షానియల్ డియో,
  మ్యూజిక్ః శ్రీర‌ణ్ పాకాల‌,
  ఎడిట‌ర్ః కార్తీక శ్రీనివాస్‌,
  ఆర్ట్ః రామ్ అర‌స‌వెల్లి,
  డైలాగ్స్ః కిట్టు విస్సాప్ర‌గ‌డ‌, సాగ‌ర్ రాచ‌కొండ‌,
  లైన్ ప్రొడ్యూస‌ర్ః డా. అనిల్ విశ్వ‌నాథ్‌,
  నిర్మాతలు: వై.సుప్రియ, జాన్‌ సుధీర్‌ పూదోట,
  దర్శకత్వం: మల్లిక్‌రామ్‌
  స‌మ‌ర్ప‌ణః అన్న‌పూర్ణ స్టూడియోస్‌,
  విడుదల: శుక్రవారం, నిడివి: 2 గంటల 5 నిమిషాలు

  ఫైనల్ గా హిందీలో విక్కీ డోనర్ ని ..ఆల్రెడీ చూసినవాళ్లకి ఈ సినిమా పెద్ద గొప్పగా అనిపించదు. మక్కీకి మక్కీ లేపేసారే అనే చిన్నచూపు కూడా వస్తుంది. ఇక తెలుగులో చూద్దామనుకునేవాళ్లు... వీర్యదానం అనే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకున్న వాళ్లైతే బాగా ఆస్వాదించే అవకాశం ఉంది. అదేదో చూడకూడనిది.. చేయకూడనిది అనుకొంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.

  English summary
  Sumanth’s Naruda Donaruda released today. Naruda Donoruda is the official remake of Bollywood hit film Vicky Donor starring Ayushman Khurana and Yami Gautham. The Telugu version has Sumanth and Pallavi Subash in the leads. Mallik Ram is the new comer who made his directional debut with the film. Sumanth turned producer for this film.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X