»   » బోరింగ్ ... ('భీమవరం) బుల్లోడు' రివ్యూ

బోరింగ్ ... ('భీమవరం) బుల్లోడు' రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

---సూర్య ప్రకాష్ జోశ్యుల

హైదరాబాద్: బాగా తెలిసిన కథ అయితే జనాలకు కన్ఫూజన్ లేకుండా అర్దమవుతుందనుకున్నారో ఏమో...సురేష్ ప్రొడక్షన్స్..ఇప్పటికే ఎన్నో సార్లు తెరపైకి ఎక్కిన పరమ రొటీన్ కథను పెద్దగా మార్పులు చేర్పులు లేకుండా భీమవరం బుల్లోడు గా దింపింది. పోనీ పాత కథే అయినా కథనంతో నిలబెడదామనుకునే ధైర్యంతో చేసారనుకుందామనుకున్నా అలాంటి అద్బుతాలు,మెరుపులు ఎక్కడా కనపడకుండా జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. ఫస్టాఫ్ ఓకే అనిపించుకున్నా...సెకండాఫ్ ..ముఖ్యంగా క్లైమాక్స్ మరీ బోరింగ్ గా తయారైంది. సునీల్ లో మెల్లిమెల్లిగా కామెడీ పంచ్ మిస్సవుతున్నట్లనిపిస్తుంది. ఒకప్పుడు అతన్ని చూస్తేనే నవ్వు వచ్చే సిట్యువేషన్ కాస్తా జోక్ వేసినా ఆలోచించి జోక్ వేసాడు కాబట్టి నవ్వాలనే స్ధితికి వచ్చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన బ్యానర్ నుంచి ఇలాంటి సినిమా ఎక్సపెక్ట్ చేయం.

భీమవరంలో ఉండే రాంబాబు(సునీల్) ఒక ఆరోగ్య సమస్యతో రాంబాబు హాస్పిటల్‌కు వెళ్తే అతనికి బ్రెయిన్ ట్యూమర్ ఉందనీ, పది రోజుల కంటే ఎక్కువ బతకడనీ డాక్టరు(ఆహుతి ప్రసాద్) చెబుతారు. దాంతో బతికే కొద్ది రోజులైనా ఏదైనా మంచి పని చేసి చనిపోవాలని నిర్ణయించుకుంటాడు రాంబాబు. ఊళ్లో ఉంటే సానుభూతి తట్టుకోలేమని సిటీకి వస్తాడు. అక్కడవారికి మంచి చేసే ప్రాసెస్ లో ... ఎవడైతే నాకేంటి అంటూ గూండాలను ఏరేస్తాడు. ఈ లోగా అతనికి బ్రెయిన్ ట్యూమర్ లేదనే నిజం తెలుస్తుంది. అక్కడ నుంచి ప్రాణ భయం పట్టుకుంటుంది. ఈలోగా అతని చేతిలో దెబ్బ తిన్న గూండాలు వెనకపడతారు. అప్పుడేం జరిగింది అనేది మిగతా కథ. అలాగే చిత్రంలో హీరోయిన్ పాత్ర ఏమిటి...ఆ లవ్ స్టోరీ ఏమిటీ తెలుసుకోవాలన్నా సినిమా చూడాల్సిందే.

"సినిమా క్లైమాక్స్ ముందే తెలిస్తే ఎంత బోరింగ్ గా ఉంటుందో" అంటూ ఈ చిత్రంలో ఓ డైలాగు ఉంటుంది. ఆ డైలాగుని అనుసరిస్తున్నట్లుగా ఈ చిత్రం కథ కూడా సినిమా ప్రారంభమైన పది నిముషాలకే పూర్తిగా సాధారణ ప్రేక్షకుడికి అణువణువు అర్దమయ్యే స్క్రీన్ ప్లే తో తయారు చేసారు. దాంతో ఏ ఒక్క సీన్ లోనూ తర్వాతేం జరుగుతుందనే ఆసక్తి ఉండకుండా పోయింది. అలాగని దర్శక,నిర్మాతలు నమ్ముకున్న కామెడీనీ పేలలేదు. అక్కడికీ మెయిన్ ప్లాట్ Short Time (1990) నుంచీ, Good Luck Chuck (2007)నుంచి హీరోయిన్ ట్రాక్ ఎత్తుకొచ్చారు. రకరకాల సినిమాల నుంచి మిగతా కామెడీ సీన్స్ లేపి కథలో కలిపారు.

కానీ అసలు కథలో విషయం లేకపోవటంతో తేలిపోయింది. కొంత కాలం క్రితం సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమాభిషేకం ...వీడికి కాన్సర్ లేదు(వేణు మాధవ్ హీరో) చిత్రం కూడా ఇదే ప్లాట్. అలాగే గతంలో బాబూ మోహన్ సైతం ఓ చిత్రం కథని పేరడీగా చేసేసారు. ఇలా ఎన్నో సార్లు ప్రేక్షకుడుకి తెలిసిన ఈ స్టోరీ లైన్ ని లో కొత్త ట్విస్ట్ లు ఏమన్నా కలిపితే చూడటానికి బాగుండేది. అలాంటిదేమీ లేకుండా ఈ మాత్రం చాలు అన్నట్లుగా సురేష్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్ ప్రేక్షకుడు మీదకు వదిలింది.

మిగతా రివ్యూ స్లైడ్ షో లో...

హీరోగా...

హీరోగా...

సునీల్...కమిడియన్ గా ఉన్నప్పుడే బాగా నవ్వించేవాడు. హీరో అయిన తర్వాత అతనిలో ఆ కామెడీ మిస్సై పోయింది. కామెడీ సీన్స్ లో సునీల్ ఉన్నాడు కానీ.. సునీల్ కామెడీని పేల్చటం లేదు..

హీరోయిన్ గ్లామర్...

హీరోయిన్ గ్లామర్...

హీరోయిన్ ఎస్తేర్ కి ఇది రెండో సినిమా అయినా నటనా పరంగా ఎక్కడా పెద్ద మార్కులు పడవు. ఏదో అలా అలా సీన్స్ లో కనపడుతూ పోయింది.

సిట్యువేషన్ కామెడీ

సిట్యువేషన్ కామెడీ

సినిమా నిజానికి సిట్యువేషన్ కామెడీ మీద నడవాల్సి ఉంది. అయితే కామెడీ పండే సిట్యువేషన్స్ సెకండాఫ్ లో రావాల్సి ఉండగా అవి పెద్దగా లేవు. ఫస్టాఫ్ లో వేసిన లాక్స్ కి సెకండాఫ్ లో విడదీసే ప్రాసెస్ లో కామెడీ పండాలి....కానీ అది జరగలేదు.

ఫైట్స్...లవ్ స్టోరీ

ఫైట్స్...లవ్ స్టోరీ

సినిమాలో ఫైట్స్ చాలా డ్రాగ్ గా ఉన్నాయి. అలాగే కాస్ట్యూమ్స్ కూడా సరిగ్గా లేవు. అలాగే సినిమాలో లవ్ స్టోరీ సైతం ఇప్రెసివ్ గాలేదు.

దర్శకుడుగా...

దర్శకుడుగా...

కలిసుందాం రా వంటి సూపర్ హిట్ కొట్టిన ఉదయ్ శంకర్ దర్శకుడుగా వచ్చిన చిత్రం అంటే ఈ చిత్రం నమ్మబుద్ది కాదు. దర్శకుడుగా ఆయన మెరుపులు ఎక్కడా కనపడవు. చాలా చోట్ల సినిమా డ్రాప్ అయిపోతూ ఉంటుంది.

ఎడిటింగ్...కెమెరా, డైలాగులు

ఎడిటింగ్...కెమెరా, డైలాగులు

మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ చేసిన ఈ చిత్రం మరింత క్రిస్ప్ గా చేసి ఉండాల్సింది. చాలా చోట్ల బోర్ కలిగిన ఫీల్ కలిగింది. అయితే సినిటోగ్రఫీ నీట్ గా ఉంది. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి.

పాటలు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్

పాటలు,బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నితిన్ చిత్రాలుకు వరసగా హిట్ సాంగ్స్ ఇస్తున్న అనూప్ రూబిన్స్ ఎందుకనో దీనికి సరైన రీతిలో ఆడియో ఇవ్వలేకపోయారు. టైటిల్ సాంగ్ తప్ప మరేమీ గొప్పగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

నిర్మాణ విలువలు

నిర్మాణ విలువలు

నిర్మాణ రంగంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుంచి వచ్చే చిత్రం అంటే ఓ విధమైన అంచనాలు ఉంటాయి. అయితే ఈ చిత్రం నిర్మాణ విలవలు చాలా పూర్ గా ఉన్నాయి. ఏదో చుట్టేసిన ఫీలింగ్ వస్తుంది.

సహ నటీనటులు

సహ నటీనటులు

చిత్రంలో కామెడీ ప్యాడింగ్ బాగానే పెట్టుకున్నారు కానీ పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. రఘుబాబు రౌడీ కామెడీ, శ్రీనివాస రెడ్డి ఈల కామెడీ అనుకున్నంత నవ్వులు పండించలేకపోయాయి. తెలంగాణ శకుంతల ఓకే. పోసాని కృష్ణ మురళి అయితే విసిగించాడు. తాగుబోతు రమేష్ వచ్చినప్పుడు మాత్రమే థియోటర్ లో విజిల్స్ పడ్డాయి.

తెర వెనక...ముందు

తెర వెనక...ముందు

బ్యానర్:సురేశ్ ప్రొడక్షన్స్
నటీనటులు: సునీల్, ఎస్తేర్ తనికెళ్ల భరణి, ఎస్తేర్, జయప్రకాష్‌రెడ్డి, షాయాజీ షిండే, రఘుబాబు, పోసాని కృష్ణమురళి, అదుర్స్ రఘు, సత్యం రాజేష్, గౌతమ్‌రాజు, శ్రీనివాసరెడ్డి, తా.రమేష్, సమ్రాట్, తెలంగాణ శకుంతల, సన, శివపార్వతి, బెంగుళూరు పద్మ, విష్ణుప్రియ తదితరులు
సంగీతం:అనూప్ రూబెన్స్,
కథ:కవి కాళిదాస్,
మాటలు:శ్రీధర్ శీపన,
కెమెరా:సంతోష్‌రాయ్,
ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:డి.సురేష్‌బాబు,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఉదయ్ శంకర్.
విడుదల తేదీ: 27,పిభ్రవరి 2014.

పైనల్ గా... సునీల్ ఉన్నాడు కదా...హాస్య చిత్రం అని ప్రమోట్ చేస్తున్నారు కదా అని అని ఎక్కువ ఊహించుకుని వెళితే పూర్తిగా నిరాస పడే అవకాసం ఉంది. అలా కాకుండా ఏదో టైం పాస్ కి సునిల్ కొత్త సినిమా వచ్చింది అనుకుని ఫిక్స్ అయితే ఫరవాలేదనిపిస్తుంది.

English summary
Comedian-turned-actor Sunil has made grand comeback with Bheemavaram Bullodu, which has hit the marquee today (February 27) with divide talk. The movie has been directed by Uday Shankar and produced by Suresh Babu under the banner of Suresh Productions. Actress Esther Naronha, who made her acting debut with 1000 Abadhalu, is seen as Sunil's heroine in it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu