»   » ఇంకా చెక్కాలన్నా! ( ‘జక్కన్న’ రివ్యూ)

ఇంకా చెక్కాలన్నా! ( ‘జక్కన్న’ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
1.5/5

సునీల్..అప్పడెప్పుడో నేను మర్యాద రామన్న, అందాల రాముడు, పూలరంగడు అనే హిట్ సినిమాల్లో చేసాను అని చెప్పుకోవాల్సి వచ్చేటట్లు కనపడుతోంది. ఎందుకంటే వచ్చిన ప్రతీ సినిమా ప్లాఫ్ కూడా కాకుండా డిజాస్టర్ అయ్యిపోతోంది. ప్రేక్షకులు ఏం కోరుకుని తన సినిమాకు వస్తున్నారో, తను ఏమి అందించలేక వాళ్లను నిరాశపరుస్తున్నాడో ఇప్పటికీ సునీల్ తెలుసుకోలేదు.

కమిడియన్ పరిచయం అయిన సునీల్ నుంచి జనం కామెడీనే ఇప్పటికీ ఆశిస్తున్నారు. అంతేకానీ ఆయన డాన్స్ లు, పైట్స్ చూడటానికి జనం ధియోటర్స్ కు రావటం లేదు. ఇది అర్దం చేసుకోకో, లేక చేసుకున్నా...నాకు నచ్చిందే చేస్తాను అనుకున్నాడో కానీ మళ్లీ కామెడీలేని కామెడీ కథతో వచ్చాడు. ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టాడు.'కృష్ణాష్టమి' ఫ్లాఫ్ తర్వాత కూడా సునీల్ ఏమి మారలేదని అర్దమైంది.

గణేష్ (సునీల్) ఓ బడిపంతులు (నాగినీడు) కొడుకు. తన చిన్నప్పుడు తండ్రి క్లాసులో చెప్పిన ఓ పిట్ట కథని నమ్మి అందులో నీతి ని వంటబట్టించుకుని, వయస్సు పెరిగినా అదే నీతిని జీవితానికి ఆచరిస్తూ(మిగతా పనులన్నీ మానుకుని) ముందుకు వెళ్తూంటారు. ఇంతకీ ఆ నీతి ఏమిటయ్యా అంటే...తనకి సాయం చేసినవాళ్లని గుర్తు పెట్టుకొని మరీ తిరిగి సాయం చేయటం. ఆ సాయిం చేసే ప్రాసెస్ లో ఎదుటివాళ్లు నువ్వు వద్దు.. నీ సాయం వద్దురా బాబోయ్‌ అనే స్దాయిలో విసిగిస్తూంటాడు.

అలాంటి గణేష్ కు చిన్నప్పుడు ఓ రౌడీ (జీవీ) చేతిలో నుంచి తృటిలో తప్పించుకొని ప్రాణాలతో బయటపడతాడు‌. తను ప్రాణాలతో బయటపడ్డానికి కారణం మరో రౌడీ బైరాగి (కబీర్‌ఖాన్‌) అని తెలుసుకుంటాడు. అతనికి తను పెద్దయ్యాక ఎట్టి పరిస్దిత్లో అయినా సాయిం చెయ్యాలని బయిలుదేరి, అతను ఎక్కడున్నాడో వెతకటం మొదలెడతాడు. అదే సమయంలో బైరాగి చెల్లెలి సహస్ర (మన్నారా చోప్రా)ని చూసి ప్రేమలో పడతాడు. అప్పుడు ఏం జరిగింది. భైరాగి కు సాయిం చేసాడా.. వంటి విషయాలు తెలియాలంటే సినిమాని చూడాల్సిందే.

స్లైడ్ షోలో మిగతా రివ్యూ...

 తింగరోడా

తింగరోడా

చిన్నప్పుడు ఎప్పుడో విన్న నీతి కథను పెద్దయ్యాక కూడా అమలుచేస్తే తిరిగే హీరో కథ అంటే హీరో తింగరోడో లేక అమాయికుడైనా అయ్యి ఉండాలి. కానీ ఈ సినిమాలో సునీల్ ని చూస్తూంటే రెండూ కాదనిపిస్తుంది.

క్లారిటీ మిస్

క్లారిటీ మిస్

సునీల్ కు మనస్సులో మాస్ సినిమా చెయ్యాలని ఉన్నట్లుంది. కానీ కామెడీ చేస్తూంటాడు. దాంతో రెంటికి చెడ్డ రేవడిలా తయారౌతున్నాయి.

ఒకే విధంగా

ఒకే విధంగా

అందాల రాముడులో ఎలా కనిపించాడో, పూల రంగడులోనూ అదే ఎక్సప్రెషన్స్ తో కనిపించాడు. ఇప్పుడు జక్కన్నలోనూ అలాగే కామెడీ చేద్దామనుకున్నాడు.

టెక్నికల్

టెక్నికల్

ఎప్పుడో రక్ష అనే చిత్రం తో వచ్చిన దర్శకుడు వంశీకృష్ణ...ఎనిమిదేళ్ల గ్యాప్ తో ఈ సినిమా బయిటకు తెచ్చాడు. టెక్నికల్ గా సినిమా బాగున్నా డీల్ చేసిన విధానం పరమ రొటీన్ గా ఉంది.

ప్రెడిక్టబుల్, ఫ్లెక్లివేషన్స్

ప్రెడిక్టబుల్, ఫ్లెక్లివేషన్స్

ఈ కథలో ప్రధాన సమస్య హీరో క్యారక్టరైజేషన్ లో ప్లెక్సివేషన్స్. అతను ఫైట్స్ అప్పుడు సీరియస్ గా , ప్రేమిస్తున్నప్పుడు ఒకలా..కామెడీ చేసేటప్పుడు మరొకలా ఉండటం. దానికితోడు ప్రెడిక్టుబల్ కథనం కూడా సినిమాని నీరు కార్చింది.

 చెప్పి దెబ్బకొట్టాడు

చెప్పి దెబ్బకొట్టాడు

సునీల్ ఈజ్ బ్యాక్ టు ఎంటర్టైన్...అని టీజర్ లో పబ్లిసిటీ చేసారు. ఓహో..సునీల్ తిరిగి..తన పాత రోజుల్లోకి వెళ్లికామెడీ చెయ్యాలనుకుని నిర్ణయించుకుని వచ్చాడనుకుంటే...పూర్తి నిరాశపరుస్తాడు.

ఇదో కామెడీ

ఇదో కామెడీ

కామెడీ పండాలంటే పంచ్ లు,ప్రాసలు దండిగా ఉండాలని డైరక్టర్, హీరో ఫిక్సైనట్లున్నారు. అలాగే సినిమా మొత్తం నింపేసారు. అయితే ఆ ప్రాసలు, పంచ్ లు నవ్వించలేదు సరికదా విసిగించాయి.

ఇవే పేలాయి

ఇవే పేలాయి

ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన కామెడీ బాగుంది. సెకండాఫ్‌లో పోలీసాఫీసర్ కట్టప్ప పాత్రలో పృథ్వీ, నందమూరి నటసింహం బాలకృష్ణను ఇమిటేట్ చేస్తూ చెప్పిన డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి.

అయోమయం

అయోమయం

ఫస్టాఫ్ అంతా పోన్లే సెకండాఫ్ లో ఏదో అద్బుతం జరుగుతుందని భరిస్తే..అదీ మరీ దారుణం అయ్యిపోయింది. అయోమయంగా, కంగాళిగా మారిపోయింది.

టెక్నికల్ గా..

టెక్నికల్ గా..

ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ఎలిమంట్ ఏదైనా ఉందంటే... సినిమాటోగ్రాఫర్ సి. రాం ప్రసాద్ పనితనమే. ఇక సంగీత దర్శకుడు దినేష్ ఈ సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండూ ఆకట్టుకోలేదు లేవు. ఎడిటింగ్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

దర్శకుడు

దర్శకుడు

ఇక దర్శక, రచయిత ఆకెళ్ళ వంశీకృష్ణ చెప్పుకోలంటే...స్టోరీ లైన్ ..కామెడీగా ఉంది కానీ..ట్రీట్ మెంట్ మాత్రం ...సీరియస్ కథకు చేసినట్లు చేసారు. చిన్న పాయింట్ ని పెద్ద సినిమాగా మార్చటంలో ఫెయిలయ్యాడు. ఇంటర్వెల్ ని నమ్ముకుని సినిమా చేసినట్లున్నారు.

ఎవరెవరు...

ఎవరెవరు...


సంస్థ: ఆర్‌.పి.ఎ.క్రియేషన్స్‌
నటీనటులు: సునీల్, మన్నారా చోప్రా, నాగినీడు, కబీర్‌ఖాన్, సత్య ప్రకాష్, రాజా రవీందర్, పృథ్వీ, సూర్య, అదుర్స్‌ రఘు తదితరులు
చాయాగ్రహణం: సి.రాంప్రసాద్‌
సంగీతం: దినేష్‌
కూర్పు: ఎం.ఆర్‌.వర్మ
మాటలు: భవానిప్రసాద్‌
నిర్మాత: ఆర్‌.సుదర్శన్‌రెడ్డి
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ
విడుదల తేదీ : 29-07-2106

English summary
Jakkanna is a Comedy where Sunil and Mannara Chopra are playing the lead roles released today with divide talk.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu