For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  24 క్యారెట్ బ్రిలియన్సి ...(సూర్య '24' రివ్యూ)

  By Srikanya
  |

  Rating:
  3.5/5

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల

  సైన్స్ ఫిక్షన్ సినిమాలు మనకు తెలుగులో ఇంకా చెప్పాలంటే సౌత్ లో బాగా తక్కువే. ముఖ్యంగా టైమ్ ట్రావిలింగ్ మీద మీద అయితే అప్పుడెప్పుడో బాలకృష్ణ హీరోగా వచ్చిన 'ఆదిత్యా 369' తప్ప మరొకటి లేదు. కానీ చాలా కాలం తర్వాత...'మనం' చిత్రంతో మనందరినీ అలరించిన దర్శకుడు విక్రమ్ కుమార్...టైమ్ ట్రావిలింగ్ తో మన ముందుకు వచ్చాడు.

  టైమ్ ట్రావిలింగ్ సబ్డెక్టు అనగానే .. హీరో కి టైమ్ మెషిన్ దొరకటం.. వేరే కాలాల్లోకి వెళ్లటం అక్కడ వింతలు చూడటం, ఆశ్చర్యపోవటం అనే కాన్సప్టే ఉంటుందేమో అనుకుంటాం. అయితే దర్శకుడు దాన్ని బ్రేక్ చేసాడు. ఓ ఫెరఫెక్ట్ స్క్రీన్ ప్లే తో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ని అందించాడు.

  ఖచ్చితంగా ఈ చిత్రం దర్శకుడు విక్రమ్ కుమార్ బ్రిలియన్సీ, హీరో సూర్య నటనకు సంభంధించిన విశ్వరూప ప్రదర్శనే. మూడు పాత్రలో సూర్య చూపించిన వేరియేషన్స్ అతనిలోని స్టార్ తో నటుడు పూర్తి స్దాయిలో పోటీపడుతూ డామినేట్ చేసిన విధానం మనకు ముచ్చటేస్తుంది

  ముఖ్యంగా చాలా కాంప్లికేటెడ్ అనిపించే ఈ స్టోరీ లైన్ ని తను ఎక్కడా కన్ఫూజ్ కాకుండా, చూసేవాళ్లకు అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లుగా విడమర్చి ఎంగేజ్ చేసిన దర్శకుడు కు హ్యాట్సాఫ్. చాలా చోట్ల మనం ఓ ట్విస్ట్ ఊహిస్తే దర్శకుడు మరో ట్విస్ట్ తో మనకు షాక్ ఇవ్వటం ఈ సినిమా ప్రత్యేకత. లవ్ ట్రాక్ డల్ గా ఉండటం, అది కథలో కలవకపోవటం, పదే పదే ఒకే సీన్ లేదా ఒకే డైలాగు రిపీట్ అవటం, వంటి కొన్ని మైనస్ లు ఉన్నా మెయిన్ ధ్రెడ్ అద్బుతంగా నడిపిన విధానం ముందు అవి తేలిపోతాయి.

  సైంటిస్టు శివకుమార్‌ (సూర్య) కష్టపడి.. కాలాన్ని నియంత్రణ చేయగల వాచిని కనిపెడతాడు. ఇలాంటి అన్ని కథల్లోలాగానే దాన్ని సొంతం చేసుకుని ప్రపంచాన్ని తన కాళ్ల దగ్గర కు తెచ్చుకోవాలని ఎంతకైనా తెగించే ఓ విలన్ దాని పై పడుతుంది . ఆ విలన్ మరెవరో కాదు..ఈ సైంటిస్టు అన్నయ్యే ఆత్రేయ (సూర్య) . ఆ విలన్ ...తన తమ్ముడని కూడా చూడకుండా శివకుమార్ ని అతని భార్య ప్రియ(నిత్యామీనన్) ని చంపేసి దాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తాడు.

  మరి సైంటిస్టు శివకుమార్ తెలివితక్కువవాడా....ఆ వాచి ఎట్టి పరిస్దితుల్లో విలన్ కు దక్కకూడదని, పసిగుడ్డు అయిన తన కొడుకు మణిశంకర్(సూర్య) ఒడిలో పెట్టి వేరేవారికి అప్పచెప్తాడు. 24 సంవత్సరాలు గడిచి, పెద్దయ్యాక మణి శంకర్ ..ఈ వాచి విషయం ఎలా తెలిసింది. తన తల్లిని, తండ్రిని చంపిన ఆత్రేయపై పగ తీర్చుకున్నాడా...ఏం చేసాడు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో సత్య (సమంత) తో లవ్ స్టోరీ ఎలా కలిపారు అనేది తెలుసుకోవాలన్నా సినిమా చూడాల్సిందే.

  ఎనాలిసిస్, హైలెట్స్, మైనస్ లు స్లైడ్ షోలో

  అప్పట్లోనే..

  అప్పట్లోనే..

  ఇదే కథని అప్పట్లో అంటే 2009 లో నే విక్రమ్, ఇలియానా కాంబినేషన్ లో ఎనౌన్స్ చేసారు. అయితే స్క్రిప్టు సరిగా రాలేదని దాన్ని ప్రక్కన పెట్టాడు దర్శకుడు. ఇన్నాళ్ళకు దాన్ని మెరుగులు దిద్ది, ఇదిగో ఇలా అందించాడు. ఓ రకంగా ఈ టైమ్ ట్రావెల్ స్క్రిప్టుకు టైమ్ తీసుకోవటమే మంచిదయ్యిందేమో అనిపిస్తుంది.

  స్క్రీన్ ప్లే తప్పితే..

  స్క్రీన్ ప్లే తప్పితే..

  ఎందుకంటే ఇది పూర్తి స్దాయి స్క్రీన్ ప్లే మూవి. ఎక్కడైనా ప్రేక్షకుడు చెప్పే విషయం అర్దం కాకపోయినా లేదా కథ ప్రకారం పదే పదే రిపీట్ అవుతున్న సీన్స్ ..రిపీట్ అని ప్రేక్షకుడు ఫీలైనా సినిమా ధడేల్ మంటుంది. ఆ విషయంలో దర్శకుడు ఎక్కడా స్క్రిప్టు పరంగా కాంప్రమైజ్ కాలేదు.

  ఇవి బోర్

  ఇవి బోర్

  లవ్ సీన్స్ మాత్రం బోర్ అనిపించాయి. అందుకు కారణం ..టైమ్ ట్రావిలింగ్ లాంటి హై కాన్సెప్ట్ లో కలిసే లవ్ సీన్స్ అదే స్దాయిలో లేకపోవటమే కావచ్చు.

  నిర్మాతగా కూడా..

  నిర్మాతగా కూడా..

  ఇలాంటి కథలు తెరకెక్కించాలంటే కేవలం దర్శకుడుకు తెలివి ఉంటే సరిపోదు.. దాన్ని కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతకు సైతం దమ్ము ఉండాలి. అది సూర్యలో ఉందని అర్దం అవుతుంది.

  రన్ టైమ్, సాంగ్స్

  రన్ టైమ్, సాంగ్స్

  ఇలాంటి సినిమాలకు సంగీతం హైలెట్ గా ఉండాలి. ఎందుకో ఎఆర్ రహమాన్ ఫెయిలయ్యారనిపిస్తుంది. సాంగ్స్ వస్తూంటే సినిమాలో బోర్ కొడుతుంది. అలాగే రన్ టైమ్ సైతం చాలా ఎక్కువ కావటం ఎంత టైట్ స్క్రీన్ ప్లే అయినా ఇబ్బంది పెడుతూనే ఉంటుంది.

  మూమూలు కధే

  మూమూలు కధే

  టైమ్ ట్రావెల్ అనే ఎలిమెంట్ చూస్తే ఈ సినిమా పరమ రెగ్యులర్ , రొటీన్ రివెంజ్ డ్రామా అనిపిస్దుంది. తన తల్లి తండ్రులని చంపిన వారిపై హీరో తీర్చుకునే పగ కథే ఇది.

  పాపం సమంత

  పాపం సమంత

  సమంత మంచి ఫెరఫార్మర్. ఆమెకు ఇలాంటి సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రో, లేక ఆమె ఫెరఫార్మెన్స్ చూపించే పాత్ర దొరుకుతుందనుకుంటే ఆమె అన్ని సినిమిల్లో లాగానే హీరోతో లవ్ స్టోరీ నడపటానికే సరిపోయింది.

  ఇంటర్వెల్ కేక, క్లైమాక్స్ యావరేజ్

  ఇంటర్వెల్ కేక, క్లైమాక్స్ యావరేజ్

  ఈ సినిమాలో మెయిన్ హైలెట్స్ లో ఒకటి ఇంటర్వెల్ అని చెప్పాలి. అసలు ఊహకందని ఇంటర్వెల్ ఇచ్చారు. ఖచ్చితంగా సెకండాఫ్ ఏమిటో చూడాలనిపించేలా డిజైన్ చేసాడు. క్లైమాక్స్ మాత్రం జస్ట్ యావరేజ్ అంటే రొటీన్ ముగింపు ఇచ్చారు.

  టెక్నికల్ గా

  టెక్నికల్ గా

  ఈ సినిమాకు దర్శకుడుతో సమానంగా కష్టపడింది టెక్నికల్ టీమ్ అని చెప్పాలి. బాలీవుడ్ బిజీ సినిమాటోగ్రాఫర్ తిరు కెమెరా వర్క్ సినిమాలో కీలకపాత్ర పోషించింది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా సీన్స్ కు ప్రాణం పోసాయి.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  ఈ సినిమాకు 75 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. అందులో నిజమెంతో కానీ సినిమా మాత్రం 150 కోట్ల సినిమాలా గ్రాండియర్ గా , రిచ్ గా ఉంది.

  నిత్యామీనన్

  నిత్యామీనన్

  సినిమాలో నిత్యామీనన్ ఉన్న సన్నివేశాలు చాలా తక్కువే. అయితే తన పరవ్ ఫుల్ ఫెర్మార్మెన్స్ తో అదరొకొట్టింది.

  ఆత్రేయగా అద్బుతం

  ఆత్రేయగా అద్బుతం

  సినిమాలో సూర్య మూడు పాత్రల్లో కనపిస్తాడు. మిగతా రెండు ప్రక్కన పెడితే..ఆత్రేయగా మాత్రం పవర్ ప్యాకెడ్ గా క్రూరత్వం పీక్స్ లో చూపాడు.

  షేక్ అవుతాం

  షేక్ అవుతాం

  సెకండాఫ్ లో వచ్చే ఓ కీలకమైన ట్విస్ట్ కు మనం షేక్ అవుతాం. దర్శకుడు మనం ఊహను కూడా ఊహించి, దానికి భిన్నంగా స్క్రీన్ ప్లే రాసి తీసాడనిపిస్తుంది.

  లింక్ ఏంటో

  లింక్ ఏంటో

  విక్రమ్ కుమార్ గత చిత్రాలు 13బి, మనం, ఇప్పటి 24లోనూ గడియారాలు, క్లాక్ టవర్స్, వర్తమానం, భవిష్యత్, గతం వీటి మధ్య కనెక్షన్ చూపటం మనం గమనించవచ్చు.

  ఎవరెవరు...

  ఎవరెవరు...

  బ్యానర్ : 2 డి ఎంటర్టైన్మెంట్స్
  చిత్రం పేరు: 24
  నటీనటులు: సూర్య,సమంత,నిత్యమేనన్‌,అజయ్‌,శరణ్య,చార్లీ,గిరీష్‌ కర్నాడ్‌ తదితరులు
  సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌,
  ఛాయాగ్రహణం: తిరు,
  ఎడిటింగ్: ప్రవీణ్‌ పూడి,
  పాటలు: చంద్రబోస్‌,
  నిర్మాత: సూర్య
  రచన.. దర్శకత్వం: విక్రమ్‌ కె.కుమార్‌.
  విడుదల: 06-05-2016

  ఫైనల్ గా...రెగ్యులర్ రొటీన్ మసాలా సినిమా చూడాలనుకునే ఈ సినిమాని ఎవాయిడ్ చేయటమే మంచిది. అలాగే కొన్ని లాగ్ లు, కొన్నిలాజిక్ లు మిస్సైనా మన దేశంలో ఇప్పటివరూ వచ్చిన అతి తక్కువ సైన్స్ ఫిక్షన్ ధ్రిల్లర్స్ లో బెస్ట్ ఇదే అనే చెప్పాలి.

  English summary
  24 might just be one of the best sci-fi thrillers ever made in our country. Yes, it has its flaws, but they are ignorable, making this Suriya-starrer a brilliant watch!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X