twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఠాగూర్‌..బాగుంది

    By Staff
    |

    Tagore
    చిత్రం: ఠాగూర్‌
    నటీనటులు: చిరంజీవి, జ్యోతిక, శ్రియా, సాయాజీ షిండే, ప్రకాష్‌ రాజ్‌, తదితరులు
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: మధు
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌

    స్క్రీన్‌ ప్లే, పాటలు, మాస్‌ సినిమాలకు కావాల్సిన ఇతరత్రా సరుకులు అన్ని చక్కగా కుదిరాయి ఈ చిత్రంలో. ఉద్రేక పర్చే దృశ్యాలు అధికంగా ఉన్నాయి. వాటిని చక్కగా ఉపయోగించుకొని దర్శకుడు వి.వి.వినాయక్‌ తనదైన కెమెరా జిమ్మిక్కులను జోడించి సినిమాను ఆకట్టుకునేలా రూపొందించాడు. సినిమా పరిభాషలో చెప్పాలంటే ఇది 'లినియర్‌ ఫిల్మ్‌'. అంటే చెప్పదల్చుకున్న పాయింట్‌ ను తొలి నుంచి చివరి వరకు ఎటువంటి అనవసరమైన మలుపులు, ట్విస్ట్‌ లు లేకుండా చెప్పే పద్దతి. ఇలాంటి చిత్రాలకు ప్రేక్షకులను కట్టిపడేసేవి ఉద్రేకపర్చే దృశ్యాలు. చిరంజీవి ఇమేజ్‌ ను సరిగా వాడుకుంటూ రూపొందించారు.

    లంచగొండి తనానికి వ్యతిరేకంగా ఒక వ్యక్తి ఉద్యమించడం ఇదివరలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో 'ఒకే ఒక్కడు' దక్షిణభారతదేశంలో బలమైన ముద్ర వేసింది. సో..ఆ నేపథ్యంతో సినిమా తీయాలంటే..అందుకు అవసరమైన ముడిసరుకు బలంగా ఉండాలి. కథారచయిత మురుగుదాస్‌ (ఒరిజినల్‌ తమిళ చిత్ర దర్శకుడు) సమాజంలో ప్రధానమైన వర్గాలన్నింటిని - ప్రభుత్వాధికారులు, వైద్యులు, పోలీసులు, తీసుకొని వాటిని హైలెట్‌ చేస్తూ స్క్రీన్‌ ప్లే రూపొందించాడు.

    దీన్ని చిరంజీవి తనదైన స్టైల్‌ లో కథను నడిపించాడు. ఫస్ట్‌ హాఫ్‌ చాలా ఇంట్రెస్ట్‌ గా సాగినా, సెకండాఫ్‌ లో అంత థ్రిల్లు లేదు. సంగీతం, చిరంజీవి స్టెప్‌ లు సరేసరి. ఈ సినిమాలో చిరంజీవి ఆద్యంతం నీట్‌ గా అందంగా ఉండడం విశేషం. అందమైన డ్రెస్‌ తో కేవలం హావాభావాలతోనే నటించడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, కథగా చెప్పుకోవాలంటే ఎన్నో లోపాలు. నిజజీవితంలో అలా జరిగే అవకాశం ఏ మాత్రం లేదు. కేవలం కమర్షియల్‌ ఫార్మాట్‌ లో ఆలోచిస్తే..బాగా తీసిన సినిమా అని చెప్పాలి. జ్యోతిక, ష్రియాల పాత్ర తక్కువే.

    కథ: 15 మంది ఎమ్మార్వోలను కిడ్నాప్‌ ను చేయడంతో సినిమా ప్రారంభమవుతుంది. అందులో అధికంగా లంచం తీసుకొన్న ఎమ్మార్వోను ఎసిఎఫ్‌ (యాంటీ కరెఫ్సన్‌ ఫోర్స్‌) చంపేస్తుంది. దాంతో రాష్ట్రంలో సంచలనం. ఎవరీ ఎసిఎఫ్‌ అని పోలీసు శాఖలో కదలిక. ఠాగూర్‌ (చిరంజీవి) ఒక ప్రోఫెషర్‌. ఆయనే ఈ ఎసిఎఫ్‌ వెనుక సూత్రధారి. సమాజంలో ఉన్న అవినీతిపరులను కిడ్నాప్‌ చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తుంటాడు.

    కానీ అతను ఎవరో తెలియదు. ఒకసారి ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలోని అవినీతిని బయటపెడుతాడు. దీంతో ఆ ఆసుపత్రి యజమాని కుమారుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ యజమాని (సాయాజీ షిండే) ఆరా తీస్తే..దీని వెనుక ఠాగూర్‌ ఉన్నట్లు

    బయటపడుతుంది. సాయాజీ అక్రమంగా నిర్మించిన భవంతులు కూలిపోయిన దుర్ఘటనలో ఠాగూర్‌ భార్యా(జ్యోతిక)పిల్లలు చనిపోతారు. అప్పుడు విద్యార్థుల సాయంతో ఈ ఫోర్స్‌ ను తయారు చేసి అవినీతి ఉద్యమం చేపడుతాడు. చివరికి ప్రభుత్వానికి లొంగిపోతాడు. అతనికి శిక్ష పడుతుందా లేదా అనేది క్లైమాక్స్‌.

    చిరంజీవి నటన కన్నా ఆయన చేపట్టే ఉద్యమంపైనే అధికంగా దృష్టి సారించారు. జ్యోతిక, శ్రియాల పాత్రలు స్వల్పం. చిరంజీవి అందంగా కన్పించాడు. డాన్స్‌ కూడా బాగుంది. 'ఈ దేశంలో నాయకులు ప్రజలనే మోసం చేశారు. కానీ ప్రజలు నాయకులను ఎప్పుడూ మోసం చేయలేద'ని చక్కటి డైలాగ్‌ లు రాసిన పరుచూరి బ్రదర్స్‌ 'చూపులతోనే సీమంతం అయిపోతుంద'నే అర్ధరహితమైనవీ రాశారు. వి.వి.వినాయక్‌ సినిమా మీద పట్టు చూపించాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X