»   » ‘బేబీ’కి పుట్టిన మరో సినిమా ‘నామ్ షబానా‘ (నామ్ షబానా రివ్యూ)

‘బేబీ’కి పుట్టిన మరో సినిమా ‘నామ్ షబానా‘ (నామ్ షబానా రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ వెడ్నెస్ డే, స్పెషల్ 26, బేబీ, ఎంఎస్ ధోని చిత్రాలతో విలక్షణమైన దర్శకుడిగా పేరుతెచ్చుకొన్నారు డైరెక్టర్ నీరజ్ పాండే. అక్షయ్ కుమార్ హీరోగా, తాప్సీ, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన స్పై డ్రామా చిత్ర బేబీ అనూహ్యమైన విజయం సాధించింది. బేబీ చిత్రంలో నరాలు తెగే విధంగా ఉన్న క్లైమాక్స్, చిత్ర స్క్రీన్ ప్లే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాయి. అలాంటి తరహాలోనే నామ్ షాబానా రూపొందింది.

బేబికి పుట్టిన కథ..

బేబికి పుట్టిన కథ..

థ్రిల్లర్ సినిమాగా రూపొందిన బేబీ చిత్ర కథను పుట్టిన ( స్పీన్ ఆఫ్) సినిమానే నామ్ షబానా. బేబీ చిత్రంలో షాబానాగా కనిపించిన తాప్సీ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించారు. విడుదలకు ముందే ట్రైలర్లు, ఫస్ట్‌లుక్ పోస్టర్లతో విశేషంగా ఆకట్టుకొన్న ఈ చిత్రం మార్చి 31 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి టాక్‌ను సంపాదించుకొన్నదో అనే విషయాన్ని తెలుసుకొనే ముందు కథలోకి వెళ్దాం.

షాబానా ఎందుకు జైలు కెళ్తుంది..

షాబానా ఎందుకు జైలు కెళ్తుంది..

సొంత తండ్రిని చంపిన నేరానికి టీనేజ్‌లోనే షాబానా (తాప్సీ) జైలు జీవితాన్ని గడుపుతుంది. జైలు నుంచి విడుదలైన చదువుకొంటూ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతుంటుంది. ఈ క్రమంలో తన స్నేహితుడితో ప్రేమలో పడుతుంది షాబానా. ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తీకరించుకొనే సమయంలోనే షాబానాకు మరో ఊహించని ఎదురుదెబ్బ తగులుతుంది. ఓ ఘటనలో తన కళ్ల ముందే ప్రియుడు దారుణంగా హత్యకు గురవుతాడు.

 సీక్రెట్ ఏజెన్సీతో జతకట్టి..

సీక్రెట్ ఏజెన్సీతో జతకట్టి..

ఇలాంటి విషాదకరమైన పరిస్థితుల్లో ఓ రోజు నేషనల్ సెక్యూరిటీకి చెందిన సీక్రెట్ ఏజెన్సీ నుంచి ఫోన్ వస్తుంది. ప్రియుడి హత్యకు గురైన వారిని మట్టుబెట్టాలనుకొంటున్నావా అనేది ఆ ఫోన్ సంభాషణ సారాంశం. కానీ ప్రియుడి ప్రాణాలు తీసిన వారిని చంపిన తర్వాత తమకు కోసం పనిచేయాల్సి ఉంటుందనే షరతు విధిస్తాడు ఆఫీసర్ రణ్‌వీర్ (మనోజ్ బాజ్‌పేయ్). తన ప్రియుడి ప్రాణాలు తీసిన నలుగురు హంతుకులపై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తున్న షాబానాకు అదో మంచి అవకాశంగా కనిపిస్తుంది.

పగ, ప్రతీకారం..

పగ, ప్రతీకారం..

ఏజెన్సీ సహకారంతో తన ప్రియుడిని హతమార్చిన గ్రూప్‌లో ఒకరిని చంపి తన ప్రతీకారం తీర్చుకొంటుంది. ఆ తర్వాత ఏజెన్సీ ఆమెకు ఓ పనిని అప్పగిస్తారు. ఆ పనిని అక్షయ్ కుమార్‌తో కలిసి తాప్సీ ఎలా ముగించింది. ఏజెన్సీ అప్పగించిన పని ఏంటీ? తన సొంత తండ్రిని ఎందుకు చంపాల్సి వచ్చింది? తన ప్రియుడు ఎందుకు దారుణ హత్యకు గురయ్యాడు? మళయాల సూపర్ స్టార్ పృథ్వీ సుకుమారన్ పాత్ర ఏంటీ అనే ప్రశ్నలకు సమాధానమే నామ్ షబానా చిత్రం.

స్పిన్ ఆఫ్ కొత్త ప్రయోగం..

స్పిన్ ఆఫ్ కొత్త ప్రయోగం..

ఓ సినిమాలో పాత్ర కథ గురించి చెప్పడానికి ఓ సినిమాను రూపొందించడం (స్పిన్ ఆఫ్) అనేది బాలీవుడ్‌లో కొత్త ప్రయోగం. అయితే కథ పరంగా సరైన జాగ్రత్తలు తీసుకోలేదని అభిప్రాయం కలుగుతుంది. వెడ్నెస్ డే, బేబీ, స్పెషల్ 26, ధోని లాంటి పలు చిత్రాలకు పక్కా స్క్రిన్ ప్లే అందించిన నీరజ్ పాండే నామ్ షాబానాపై సరైన దృష్టిపెట్టలేదనే చెప్పవచ్చు.

యాక్షన్, ఎమోషన్స్ భేష్

యాక్షన్, ఎమోషన్స్ భేష్

కానీ యాక్షన్, ఎమోషన్ పలికించడంలో నీరజ్ పూర్తి న్యాయం చేకూర్చాడు. బేబీలో దుమ్మురేపిన అక్షయ్ లాంటి పాత్ర సినిమాలో ప్రవేశించిన తర్వాత కూడా వేగం పుంజుకోకపోవడం ప్రధాన లోపం. అక్షయ్ ఎంట్రీ కూడా చాలా పేలవంగా కనిపిస్తుంది. కేవలం తాప్సీ పాత్రపై దృష్టి పెట్టి మిగితా పాత్రలను పట్టించుకోకుండా చుట్టేశారా ప్రేక్షకులకు అనిపించకతప్పదు.

బేబితో పోల్చుకుంటే బలహీనంగా

బేబితో పోల్చుకుంటే బలహీనంగా

బేబీ సినిమా పోల్చుకుంటే స్క్రిప్ట్ చాలా బలహీనంగా కనిపిస్తుంది. కానీ తాప్సీ అద్భుతమైన నటన, పవర్ ప్యాక్ యాక్షన్, పలికించిన ఎమోషన్స్ నామ్ షాబానాకు బలంగా మారాయి. సొంతంగా ఈ సినిమా భారాన్ని తాప్సీ ఒంటి చేత్తో మోసిందంటే అతిశయోక్తి కాదేమో. పింక్ తర్వాత ఫెర్ఫార్మెన్స్ ప్రాధాన్యం ఉన్న పాత్ర తాప్సీకి లభించడం గొప్ప అవకాశం. బాలీవుడ్‌లో కేవలం మూడు నాలుగు సినిమాల అనుభవం ఉన్న తాప్సీ షాబానా పాత్రను చాలెంజ్‌గా తీసుకొని అద్భుతమైన నటిగా ప్రూవ్ చేసుకొన్నది. యాక్షన్ సీన్లలోనూ బాలీవుడ్ హీరోల కంటే తాను తక్కువేమీ కాదనే భావనను ప్రేక్షకులకు కలిగించింది.

సత్తా చాటిన అక్షయ్..

సత్తా చాటిన అక్షయ్..

అతిథి పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్ కీలక సన్నివేశాల్లో తన సత్తాను చాటాడు. అలాగే మనోజ్ బాజ్‌పేయ్ సీరియస్ లుక్స్‌తోపాటు తన డైలాగ్స్‌తో ఆకట్టుకొన్నాడు. నటించడానికి పెద్దగా అవకాశం లేకపోయినా తనకు లభించిన పాత్రను ప్రభావవంతంగా పోషించడంలో సఫలమయ్యాడు. అనుపమ్ (శుక్లా), డానీ పాత్రల నిడివి చాలా తక్కువే అయినప్పటికీ పర్వాలేదనిపించారు.

శివం నాయర్ తడబాటు..

శివం నాయర్ తడబాటు..

ఈ సినిమాకు నీరజ్ పాండే దర్శకుడిగా కాకపోవడం ప్రధాన లోపంగా కనిపిస్తుంది. నీరజ్ అందించిన స్క్రీన్ ప్లేను పక్కాగా తెరకెక్కించడంలో దర్శకుడు శివమ్ నాయర్ తడబాటుకు గురయ్యాడనిపిస్తుంది. ఫస్టాఫ్ చాలా నీరసంగా సాగడంతో మరో మైనస్ పాయింట్. యాక్షన్ సినిమాల్లో ఉండే వేగం ఈ సినిమాలో కనిపించదు.

అవకాశాన్ని చేజార్చుకొన్న..

అవకాశాన్ని చేజార్చుకొన్న..

పేరున్న నటీనటులు, మంచి స్క్రీప్ట్‌ను సరైన రీతిలో ఎగ్జిక్యూట్ చేసి ఉంటే నామ్ షాబానా చిత్రం బేబీ, ఏ వెడ్నెస్ డే చిత్రాల జాబితాలో చేరేది. దర్శకుడు శివం నాయర్ చేతికి అందించిన గోల్డెన్ అవకాశాన్ని చేజార్చుకున్నారని నామ్ షబానా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది.

యాక్షన్ సినిమాకు కేరాఫ్

యాక్షన్ సినిమాకు కేరాఫ్

యాక్షన్, ఎమోషన్స్, ఫైట్స్ చూడాలనుకొనే వారికి ఈ సినిమా ఓ కేరాఫ్ అడ్రస్. అతిగా ఆశించకుండా ఉంటే నామ్ షబానాను ఎంజాయ్ చేయవచ్చు. ఇటీవల వచ్చిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నామ్ షబానా ఓ ప్రత్యేకమైన సినిమా. నా పేరు షబాన అనే పేరుతో ఏప్రిల్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

బలం, బలహీనతలు

బలం, బలహీనతలు

పాజిటివ్ పాయింట్స్
తాప్సీ అద్భుతమైన నటన
అక్షయ్ కుమార్ యాక్షన్
కథ, కథనంలో ఎమోషన్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్

నెగిటివ్ పాయింట్స్
సినిమా నిడివి
కథనంలో వేగం లేకపోవడం
డాక్యుమెంటరీ టచ్
స్లో నేరేషన్

తెర ముందు.. తెర వెనుక

తెర ముందు.. తెర వెనుక

నటీనటులు: తాప్సీ పన్ను, అక్షయ్ కుమార్, పృథ్వీరాజ్ సుకుమారన్, మనోజ్ బాజ్‌పేయ్, అనుపమ్ ఖేర్, డానీ డెన్‌జోంగ్పా తదితరులు
దర్శకత్వం: శివమ్ నాయర్
నిర్మాత: నీరజ్ పాండే, శీతల్ భాటియా
కథ, స్క్రీన్ ప్లే: నీరజ్ పాండే
సంగీతం: రోచక్ కోహ్లీ
సినిమాటోగ్రఫీ: సుధీర్ పల్సానే
ఎడిటింగ్: దీపక్ సేజూ
రిలీజ్ డేట్స్:
మార్చి 31 2017 (హిందీలో)
ఏప్రిల్ 7 2017 (తెలుగులో)
బడ్జెట్: 15 కోట్లు

English summary
Naam Shabana movie packs a punch with its action. Actor Taapsee Pannu does a fabulous job at handling emotion as well as action. A weak script pulls this film down. It’s not as engaging as Baby.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu