Thamma First Review: థమ్మా మూవీ ఫస్ట్ రివ్యూ.. రష్మిక మందన్న మూవీ ఎలా ఉందంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ మడోక్ ఫిలింస్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం థమ్మ. యువ దర్శకుడు ఆదిత్య సర్పోదార్ రూపొందించిన ఈ చిత్రంలో స్టార్ హీరో, హీరోయిన్లు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. వరుణ్ ధావన్, మలైకా ఆరోరా, నోరా ఫతేహి లాంటి తారలు అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ సభ్యులు వీక్షించారు. వారు ఈ సినిమాపై ఇచ్చి రివ్యూ, వారు ఇచ్చిన సర్టిఫికెట్ గురించిన వివరాల్లోకి వెళితే..

మడోక్ హారర్ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్దిఖీ, పరేశ్ రావెల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సౌరబ్ గోస్వామి సినిమాటోగ్రఫిని, హేమంత సర్కార్ ఎడిటింగ్, సచిన్, జిగర్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమాను ఇండియాలో పెన్ మరుదార్, ఓవర్సీస్‌లో యష్ ఫిలింస్ రిలీజ్ చేస్తున్నారు.

Thamma First Review

థమ్మా సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తోపాటు ఇతర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచింది. ఈ క్రేజ్ మధ్య ఈ సినిమాను సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. ఈ సినిమాను తెరకెక్కించిన విధానం, అందులో పాత్రలను చిత్రీకరించిన తీరుపై వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో వాటిని చిత్ర యూనిట్ సవరించినట్టు తెలిసింది.

థమ్మా (వరల్డ్ ఆఫ్ థమా)గా పేరును సెన్సార్ బోర్డు అధికారికంగా ధృవీకరించారు. ఈ చిత్రంలోని సున్నితమై శృంగారం, అలాగే హరర్ సన్నివేశాలు యూత్‌కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వర్క్ బాగున్నది. ఈ సినిమా అన్నివర్గాలను మెప్పిస్తే మంచి ఫలితాన్ని అందుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న తొలిసారి హారర్ మూవీలో నటించడంతో ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన సెన్సార్ రివ్యూపై అందరి దృష్టి పడింది. ఈ సినిమాను వీక్షించిన తర్వాత స్వల్ప మార్పులతో యూఏ (UA 13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అంటే ఈ సినిమాను 16 సంవత్సరాలు దాటిన పిల్లలు మాత్రమే చూడాలనే నిబంధన విధించారు. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారు తమ తల్లిదండ్రుల అంగీకారంతో చూడొచ్చనే నిబంధనను పొందు పరిచారు.

ఆయుష్మాన్ ఖురానా, రష్మిక తొలిసారి నటించిన ఈ హారర్ సినిమాను చాలా క్రీస్పీగా కట్ చేశారు. ఈ చిత్రంలోని ఫీల్ గుడ్ అంశాలను, హారర్ ఎలిమెంట్స్‌కు ఏ మాత్రం భంగం కలుగకుండా జాగ్రత్తలు తీసుకొని రన్‌టైమ్‌ను సెట్ చేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రన్ టైమ్ 148 నిమిషాలు అంటే.. 2 గంటల 28 నిమిషాల రన్ టైమ్‌ను ఫిక్స్ చేసినట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X