twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కామెడీ తొట్టిగ్యాంగ్‌

    By Staff
    |

    Totti Gang
    -జలపతి
    చిత్రం: తొట్టిగ్యాంగ్‌
    నటీనటులు: నరేష్‌, ప్రభుదేవా, సునీల్‌, గజాలా, అనిత, బ్రహ్మనందం
    సంగీతం: దేవీశ్రీప్రసాద్‌
    కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఇవివి సత్యనారయణ

    దర్శకుడు ఇవివి సత్యనారయణ చాలా గ్యాప్‌ తర్వాత రూపొందించిన పూర్థిస్థాయి కామెడీ చిత్రం తొట్టిగ్యాంగ్‌. కామెడీ ప్రధాన వస్తువుగా తీసుకొని తీసినా, ఈ సినిమా పూర్తిగా నవ్వించడంలో మాత్రం విఫలమైంది. కానీ పూర్తిస్థాయి కామెడీ చిత్రాలు కరువైన ఈ రోజుల్లో కాసేపు నవ్వుకోవడానికి ఈ చిత్రం చూడవచ్చు. అప్పుల అప్పారావు వంటి మంచి కామెడీ చిత్రాలను ఇవివి గతంలోనే అందించిన ఇవివి ఈ సారి లేటేస్ట్‌ ట్రెండ్‌ ను అందుకోవడంలో కాస్తా వెనుకపడ్డారు.

    కథ బాగున్నా, క్లైమాక్స్‌ లో తొట్టిగ్యాంగ్‌ చేసే అల్లరికి అర్థం ఉండదు. అదే ఈ చిత్రంలో ప్రధానలోపం. పాటలు అర్థరహితంగా వచ్చి చికాకు పరుస్తాయి. ఈ చిత్రంలో గజాలా అందరికన్నా బాగా చేసింది. ఆ పాత్రే ఈ సినిమాకు ప్రాణం.

    నరేష్‌, ప్రభుదేవా, సునీల్‌ ఒక తొట్టిగ్యాంగ్‌. శవాలను తరలించడం, కుక్కలను పట్టుకోవడం వీరి పని. గజాలాను చూడగానే ప్రభుదేవా ప్రేమిస్తాడు. కానీ గజాలా ఛీ కొడుతుంది. నరేష్‌ మంచితనం చూసి ఆమె అతన్ని ప్రేమిస్తుంది. చిన్నప్పుడు తను ప్రేమించిన వెంకటలక్ష్మిని తప్ప ఎవర్నీ ప్రేమించలేనని నరేష్‌ చెప్పుతాడు. గజాలా వెంటనే ఓ కథ అల్లి, వెంకటలక్ష్మికి ఇప్పటికే పెళ్ళి అయిందని, ఇద్దరు పిల్లలు కూడా అని చెప్పుతుంది. దీంతో స్నేహితులిద్దరిని వదిలేసి గజాలాతో సింగుతుంటాడు.

    ఫ్రెండ్‌ ను దూరం చేసిన గజాలాపై కక్ష సాధించేందుకు ప్రభుదేవా, సునీల్‌ లు ప్లాన్‌ వేస్తారు. ఈలోపు వారికి వెంకటలక్ష్మి(అనిత) పరిచయమవుతుంది. సొంత బావ తనను 'పూజకు పనికి రాని పువ్వు'గా చేయడంతో వెంకటలక్ష్మి సన్యాసిగా మారాలని నిశ్చయించుకుంటుంది. కానీ ఈ పువ్వును నరేష్‌ చెవ్విలో పెడుతామని శపథం చేసి గజాలాను కిడ్నాప్‌ చేస్తారు. ఇక గజాలా వీరిని ఎలా ముప్పుతిప్పలు పెట్టి నరేష్‌ కు దగ్గరవుతుంది? అనితను నరేష్‌ పెళ్ళిచేసుకుంటాడా లేదా అనేది సెకండాఫ్‌.

    కామెడీ డైలాగ్‌ ల కన్నా సిట్యువేషనల్‌ కామెడీ ఈ చిత్రంలో ఎక్కువ. కరాటే మల్లీశ్వరిగా గజాలా బాగా చేసింది. ఆ తర్వాత చెప్పుకోదగ్గ వారిలో ప్రభుదేవా, సునీల్‌. సునీల్‌ ఈ చిత్రంలో డైలాగ్స్‌ చెప్పడమే కాదు 'యాక్టింగ్‌' కూడా చేశాడు. నరేష్‌ నటనలో లోపం ఏమిటో ఈ చిత్రంలో తెలిసిపోయింది. తొలిసారి అల్లరి చిత్రంలో నరేష్‌ చేసిన నటన బాగుంది అనిపించింది. కానీ మూడో చిత్రంలోనూ అదే నటన, అవే ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇచ్చాడు.

    ఆ అబ్బాయిది నటన కాదని, అతని విధానం అంతని తెలిసిపోయింది. బ్రహ్మనందం పాత్ర చెప్పుకోదగ్గ రీతిలో ఏమీ లేదు. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం బావుంది. అన్ని పాటలు బాగున్నాయి. కానీ రీరికార్డింగ్‌ లో కొంచెం గోల తగ్గిస్తే బాగుండేది. ఇవివి సత్యనారయణ కొంచెం పకడ్బందీ కామెడీ డైలాగ్‌ ల మీద దృష్టి పెడితే బాగుండేది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X