»   » ట్యూబ్‌లైట్ మూవీ రివ్యూ: ఆర్ట్ సినిమాను తలదన్నేలా...

ట్యూబ్‌లైట్ మూవీ రివ్యూ: ఆర్ట్ సినిమాను తలదన్నేలా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

భజ్‌రంగీ భాయ్‌జాన్, ప్రేమ రతన్ ధన్ పాయో, సుల్తాన్ లాంటి బ్లాక్‌బస్టర్ విజయాలతో దూసుకెళ్తున్న బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా ట్యూబ్‌లైట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన ఇమేజ్‌కు భిన్నంగా కథను, పాత్రను ఎన్నుకొని ప్రయోగమే చేశారనే చెప్పవచ్చు. భారత, చైనా మధ్య యుద్ధ నేపథ్యాన్ని కథాంశంగా ఎన్నుకొన్నారు. సూపర్ స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి సల్మాన్ మందబుద్ది గల యువకుడిగా కనిపించారు. మాస్ హీరోగా కాకుండా నటనకు అద్దం పట్టే పాత్రను ఎంచుకొని ట్యూబ్‌లైట్ రూపంలో చేసిన ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

ట్యూబ్‌లైట్ కథ ఇది..

ట్యూబ్‌లైట్ కథ ఇది..

భారత, చైనా సరిహద్దు ప్రాంతం కుమాన్‌లోని జగత్‌పూర్ అనే చిన్నపట్టణంలో భరత్ సింగ్ బిస్త్ (సోహైల్ ఖాన్), లక్ష్మణ్ సింగ్ బిస్త్ (సల్మాన్) ఇద్దరు సోదరులు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో వారు అనాధలుగా మారుతారు. ఓ స్వచ్ఛంద సంస్థను నడిపే బన్నే చాచా (ఓం పురి) వారిని చేరదీస్తాడు. లక్ష్మన్ మందబుద్ది వ్యక్తి కావడంతో ఎప్పుడు తన సోదరుడికి భరత్ రక్షణగా ఉంటాడు. తన తమ్ముడిని ట్యూబ్‌లైట్ అని ఆటపట్టిస్తే వారిని తాట తీసే వరకు వదిలిపెట్టరు. అలాగే లక్ష్మణ్‌కు అన్నయ్యనే సర్వస్వం.

చైనా, భారత యుద్ధ నేపథ్యం..

చైనా, భారత యుద్ధ నేపథ్యం..

ఇలాంటి పరిస్థితుల్లో భారత, చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. దేశం తరఫున యుద్ధంలో పాల్గొనే ఆసక్తి ఉంటే సైన్యంలో చేరాలని ఆర్మీ ప్రకటన ఇస్తుంది. సైన్యంలో ఉద్యోగం వస్తే భవిష్యత్ బాగుంటుందనే చాచా సలహాతో భరత్ సైన్యంలో చేరుతాడు. సైన్యంలో చేరే సమయంలో తనకు ఇష్టమైన సోదరుడికి దూరం కావాల్సి వస్తుంది. సోదరుడు సైన్యంలో చేరిన తర్వాత యుద్ధ వాతావరణం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో జగత్ పూర్‌కు లీ లింగ్ (జూ జూ) అనే చైనాకు చెందిన ఓ మహిళ తన కుమారుడు గువో (మార్టిన్ రే తంగు) అక్కడకు వస్తుంది. వారిపై ఆ గ్రామస్థులు ద్వేషాన్ని పెంచుకొంటారు. చైనావాసులపై దాడికి దిగుతారు. వారికి లక్ష్మణ్ అండగా ఉండి దాడి చేయవద్దంటాడు.

యుద్ధంలో ఏం జరిగింది..

యుద్ధంలో ఏం జరిగింది..

ఈ పరిస్థితుల్లో తన సోదరుడు భరత్ చైనా సైన్యం చేతిలో మరణించాడనే వార్త అందుతుంది. దాంతో భారత్ మరణించాడనే వార్తతో లక్ష్మణ్ తల్లడిల్లుతాడు. కానీ క్లైమాక్స్‌లో అనూహ్యమైన ట్విస్ట్‌తో కథ ముగుస్తుంది. యుద్ధంలో భరత్‌కు ఏం జరిగింది? ఒంటరి వాడైన లక్ష్మణ్ ఏం చేశాడు? భారత, చైనాల మధ్య యుద్ధంలో ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే ట్యూబ్‌లైట్ చిత్ర కథ.

ఫస్టాఫ్ సాగదీత..

ఫస్టాఫ్ సాగదీత..

ట్యూబ్ లైట్ చిత్రానికి అమెరికా యుద్ద నేపథ్యంగా తెరకెక్కిన లిటిల్ బాయ్ చిత్రం ఆధారం. లిటిల్ బాయ్ చిత్రాన్ని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దర్శకుడు మార్పులు చేసుకొన్నారు. ఆ చిత్రానికి క్రెడిట్ కూడా ఇచ్చారు. కానీ కమర్షియల్, మాస్ ఇమేజ్ ఉన్న సల్మాన్ ఖాన్‌కు తగినట్టుగా లక్ష్మణ్ పాత్రను రూపొందించడంలో విఫలమయ్యాడు. లక్ష్మణ్ పాత్రను చాలా పేలవంగా డిజైన్ చేశాడు. కోట్ల రూపాయల కలెక్షన్ వరద పారించే హీరో పక్కన పెట్టుకొని ఆర్ట్ సినిమా కథను తెరకెక్కించే ప్రయత్నం చేయడం ఘోర తప్పిందం. ఫస్టాఫ్‌లో అన్నదమ్ముల మధ్య బంధాలు, అనుబంధాలు చూపించడంతో కథ ప్రారంభమవుతుంది. యుద్దంలో చేరే సన్నివేశాలు, అనంతరం తదనంతరం సోదరుడు దూరం కావడంతో సల్మాన్ పడిన ఆవేదన, చిన్న చితక సన్నివేశాలతో కథను ఇంటర్వెల్ వరకు దర్శకుడు సాగదీశాడు.

సెకండాఫ్ మరీ దారుణం..

సెకండాఫ్ మరీ దారుణం..

అలా ఆర్ట్ సినిమాను మించిన ఎమోషన్స్‌తో సాగదీసి సాగదీసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన దర్శకుడు కబీర్ ఖాన్ రెండో భాగంలోనైనా యుద్ధ సన్నివేశాల్లో భావోద్వేగాన్ని పంచుతాడనే నమ్మకాన్ని ఘోరంగా వమ్ము చేశాడు. చెత్త సీన్లతో ప్రేక్షకులను గందరగోళానికి గురిచేశాడు. సినిమాలో పస లేదని ప్రేక్షకుడు డిసైడ్ అయిన తర్వాత ఏదో గొప్ప ట్విస్ట్‌తో క్లైమాక్స్‌ను ముగించే ప్రయత్నం చేశాడు. అప్పటికే చేతులు కాలిన ప్రేక్షకులకు ఆకులు పట్టించే ప్రయత్నం చేశాడు. వెరసిగా చెత్త సినిమాను కబీర్ ఖాన్ ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యాడు.

ఇమేజ్‌ను పణంగా పెట్టిన సల్మాన్

ఇమేజ్‌ను పణంగా పెట్టిన సల్మాన్

దబాంగ్, సుల్తాన్, భజరంగీ భాయ్‌జాన్ చిత్రాలతో అటు స్టార్‌గా.. ఇటు యాక్టర్‌గాను సల్మాన్ ఖాన్ మంచి మార్కులే కొట్టేశాడు. కానీ ఓ ఆర్ట్ సినిమా స్థాయిలో లేని కథను ఎంచుకొని తన ఇమేజ్‌ను పణంగా పెట్టాడు. ట్యూబ్‌లైట్ చిత్రాన్ని తన కెరీర్‌లోనే అత్యంత దారుణమైన ఫ్లాప్‌గా మూటగట్టుకునే సాహసాన్ని చేశాడు. తనకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్న కమర్షియల్ ఫార్మాట్‌ను వదిలేసి రూట్ మార్చి పెద్ద తప్పిదమే చేశాడనిపిస్తుంది. సల్మాన్‌ను ఆశించి వచ్చే ఫ్యాన్స్, సినీ ప్రేక్షకులకు ఓ చేదు అనుభవాన్ని మిగిల్చాడు.

షారుక్ ఎంట్రీ మహా దారుణం..

షారుక్ ఎంట్రీ మహా దారుణం..

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ స్పెషల్ అప్పీయరెన్స్ అంటూ సినిమాను హైప్ చేసే ప్రయత్నం చేశారు. ట్యూబ్‌లైట్‌లో షారుక్ పాత్ర చాలా దారుణంగా ఉంది. మానసికంగా బలహీనుడైన సల్మాన్‌కు మనోధైర్యాన్ని నింపే ఓ ప్రత్యేకమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాలో షారుక్ చేసిన పాషా రోల్ నాసిరకంగా ఉంది. సల్మాన్‌కు షారుక్ నేర్పే ట్రిక్కు చాలా నవ్వు పుట్టించేలా.. సెటైర్లు వేసేలా ఉంది. షారుక్ ఇచ్చిన మనోధైర్యంతో పర్వతాలను ప్రకంపనాలకు గురిచేసే సీన్ చాలా పేలవంగా, నాసిరకంగా ఉంది. సల్మాన్ లాంటి హీరో చేత కబీర్ ఖాన్ లాంటి దర్శకుడు అలాంటి సీన్ చేయించడం నమ్మశక్యంగా లేదు.

రెండున్నర గంటలు భరించడం కష్టమే..

రెండున్నర గంటలు భరించడం కష్టమే..

సల్మాన్ ఖాన్‌కు సరిపోయే కమర్షియల్ హంగులు ఎక్కడ కనిపించవు. మూడు గంటల నిడివి ఉన్న సినిమాలను ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు రెండున్నర నిడివిని కూడా ప్రేక్షకులు భరించలేకపోయారంటే ట్యూబ్‌లైట్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. యుద్ధం, ఎమోషన్స్, మనసును కట్టిపడేసే సన్నివేశాలు మచ్చుకు కూడా కనిపించవు. నాసిరకమైన సినిమా ప్రేక్షకుడిని మరో రకంగా కంటతడి పెట్టించింది.

తెర మీద ఆకట్టుకోలేని సంగీతం..

తెర మీద ఆకట్టుకోలేని సంగీతం..

ప్రీతమ్ అందించిన మ్యూజిక్ ఆడియో పరంగా ఆకట్టుకొన్నది. యూట్యూబ్‌లో పాటలు భావోద్వేగానికి గురిచేశాయి. సజన్ రేడియో, టింకా టింకా దిల్ మేరా, మై అఘర్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. తీరా సినిమాలోకి వెళితే సన్నివేశాలతోపాటు పాటలను కూడా చుట్టేశారని అనిపిస్తుంది.

నామమాత్రంగా ఇతర పాత్రలు

నామమాత్రంగా ఇతర పాత్రలు

సీనియర్ నటుడు ఓంపురికి ఇది చివరి చిత్రం. చాచాగా ఆయన పాత్ర ప్రేక్షకులు గుర్తుంచుకొనేలా కాకుండా నామమాత్రంగానే ఉంది. ఇక ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాలంటే గువో పాత్రలో నటించిన బాలనటుడు మాటిన్ రే తంగు ఆకట్టుకొన్నాడు. అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు.

అంతిమ తీర్పు..

అంతిమ తీర్పు..

ఏకథా టైగర్, భజ్‌రంగీ భాయ్‌జాన్ లాంటి హిట్లతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న సల్మాన్, కబీర్ కాంబినేషన్ ప్రేక్షకులకు ట్యూబ్‌లైట్ వెలుతురును అందించడంలో చాలా దారుణంగా విఫలమయ్యారు. కెరీర్‌లోనే అత్యంత దారుణమైన చిత్రాన్ని అందించారనే అపవాదును మూటగట్టుకొన్నారు.

English summary
After Ek Tha Tiger, Bajrangi Bhaijaan movies, Bollywood Super star Salman Khan, Director Kabir Khan came up with Tubelight. Audience have greater expectation on the movie. This film is fails to leave an impact. This successful duo delivered worst movie in their career.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu