twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోస్తరు..వీడే!

    By Staff
    |

    Veede
    -జలపతి గూడెల్లి
    చిత్రం: వీడే
    నటీనటులు: రవితేజ, ఆర్తి అగర్వాల్‌, రీమాసేన్‌, సాయాజీ షిండే, తెలంగాణ శకుంతల, నళిని
    సంగీతం: చక్రి
    నిర్మాతలు: శింగనమల రమేష్‌ బాబు, కె.ఎస్‌.రామారావు
    స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి

    తమిళ హీరో విక్రమ్‌ కు తమిళనాడులో ఎంత ఇమేజ్‌ ఉందో రవితేజ నటించిన 'వీడే' చిత్రం మరోసారి నిరూపించింది. విక్రమ్‌ తమిళంలో చేసిన 'జెమిని', దిల్‌(తెలుగులో శ్రీరామ్‌) చిత్రాలు సూపర్‌ హిట్టయ్యాయి. వాటి రీమేక్‌ లు మాత్రం తెలుగు వారిని ఆకట్టుకోలేకపోయాయి. విక్రమ్‌ నటన, ఆయన ఏర్పరచుకున్న ఇమేజ్‌ బలం వల్లే ఆ సినిమాలు అక్కడ నడిచాయని ఇంతకుముందు రూఢీగా 'వీడే' మరోసారి ఆ వాదనను బలపరిచినట్లైంది.

    తమిళంలో సూపర్‌ హిట్టైన 'ధూళ్‌' చిత్రం ఆధారంగా తీసిన ఈ చిత్రంలో కొత్తదనం మనకు ఏమీ కనిపించదు. పక్కా కమర్షియల్‌ చిత్రం ఇది. ఒక సింగిల్‌ పాయింట్‌ ను పట్టుకొని సినిమా మొత్తం సాగతీయడం తప్ప గొప్పగా చెప్పుకోదగ్గ అంశమేదీ లేదు. గతంలోనూ తెలుగులో ఇలాంటి చిత్రాలు వచ్చాయి.

    రవితేజకు మాస్‌ ఇమేజ్‌ ఉన్నా, 'వీడే' మాత్రం హీరో ఇమేజ్‌ మీద నడిచే చిత్రం కాదు. ప్రథమార్థంలో కొన్ని జోకులు (అవీ కూడా డబుల్‌ మీనింగ్స్‌), ద్వితీయార్థంలో షకీలా కామెడీ మాత్రం కాస్తా రిలీఫ్‌. క్లైమాక్స్‌ ఏమిటో సినిమా ఇంటర్వెల్‌ కు ముందే తెలుస్తుంది. అక్కడి నుంచి అంతా సాగతీత. చాలా సీన్లు హీరోను ఎలివేట్‌ చేసే ప్రయత్నంలో 'అతి'గా సిల్లీగా అన్పిస్తాయి. మరీ సాధారణ మాస్‌ చిత్రం ఇది.

    బొబ్బర్లంక అనే ఊరిలో ఒక ప్రైవేట్‌ ఫ్యాక్టరీ వెదజల్లే నీటి కాలుష్యం వల్ల ఆ ఊరి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ఆ ఊరికే చెందిన రాష్ట్ర మంత్రికి సమస్యను విన్నవించేందుకు ఆ ఊరి హీరో ఏడుకొండలు (రవితేజ), ఇంటర్‌ పాసయిన మంగతాయారు (ఆర్తి అగర్వాల్‌), ఆమె బామ్మ (తెలంగాణ శకుంతల) కలిసి హైదరాబాద్‌ వెళుతారు. సదరు మంత్రి (సాయాజీ షిండే) అనుచరగణం (నళిని తదితరులు)తో హీరో అనుకోకుండా ఢీకొనాల్సి వస్తుంది. చివరికి హీరో మంత్రిపై ప్రతీకారం తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది. ఊరికి నీటి కాలుష్యం తప్పుతుంది.

    రవితేజ నటనలో పెద్దగా మార్పులేదు. ఆర్తి ఓకే. రీమాసేన్‌ గ్లామర్‌ పాత్రలో బాగానే సూటయింది. సాయాజీ షిండే నటన ప్లస్‌ పాయింట్‌. చక్రి పాటలు మోస్తారుగా ఉన్నాయి. రీరికార్డింగ్‌ మాత్రం చెవులు బద్దలయ్యేలా చేశాడు. 'ఊరికే ఏది చేయను, ఊరికోసం ఏదైనా చేస్తాను' వంటి డైలాగ్‌ లతో కోన వెంకట్‌ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. కానీ డబులుమీనింగ్‌ డైలాగ్స్‌ శ్రుతిమించాయి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X