twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడూ రొటీనే (విక్రమ్ 'వీడింతే' రివ్యూ)

    By Srikanya
    |

    డబ్బింగ్ తమిళ సినిమా కూడా డైరక్ట్ తెలుగు సినిమాలాగ ఉంటే ఇంక దాన్ని చూడటమెందుకు..ఇదే ప్రశ్నను లేవనెత్తుతుంది వీడింతే చిత్రం. తమిళ సినిమాలు తెలుగులో అంతలా ఆడేసి పోటీ ఇచ్చేయటానికి కారణం అన్ని విషయాల్లో వారు తీసుకునే వైవిధ్యమే. అయితే వీడింతే లో వైవిధ్యం ఏమిటీ అంటే..విక్రమ్ ఇలాంటి రెగ్యులర్ మాస్ మసాలా చిత్రంలో నటించటమే అనిపిస్తుంది. దాంతో ఇలాంటి సినిమాలు తెలుగులోనూ కావల్సినన్ని దొరుకుతాయి కదా..ఇంతోటి దానికి పరభాషా చిత్రాలు దాకా వెళ్లటమెందుకు అనిపిస్తుంది. ఇలాంటి చిత్రాల రాకతో అస్సలు ఎలాంటి తమిళ సినిమాలను మనం ఆదరిస్తున్నామో,తెలుగు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు ఇష్టపడతారో అర్దమయ్యే అవకాశముంది.

    ఫైర్ శంకర్ (విక్రమ్)సినిమాల్లో పెద్ద విలన్ అవ్వాలని జీవితాశయం. ప్రస్తుతం విలన్ వెనకాల ఉండే గ్యాంగుల్లో పనిచేస్తూండే అతనికి దక్షిణామూర్తి(కె విశ్వనాధ్)పరిచయం మలుపు తిప్పుతుంది. ఆయన స్ధాపించిన అనాధ శరణాలయ్యాన్ని ఆయన స్వంత కొడుకే పగటి చుక్క పార్టి అధ్యక్షురాలు రంగనాయికి(సన)కు ఎమ్మల్యే సీటు కోసం తాకట్టు పెడతాడు. అయితే దానికి ఫైర్ శంకర్ ఎదురెళ్లి ఆమెకు సవాల్ విసిరి ఆ అనాధ శరణాలయ్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు.అక్కడనుంచి ఆమె తన పవర్ తో ఏం చేసింది..శంకర్ ఎలా తను అనుకున్నది సాధించాడనేది మిగతా కథ.

    రొటీన్ కథకు, అంతే రొటీన్ గా కధనం అల్లుకున్న ఈ చిత్రంలో విశ్లేషించటానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. అలాగే విక్రమ్ రకరకాల గెటప్స్ లో కనపడతాడు. అయితే అదీ దండగే ..ఎందుకంటే కథకు ఆ గెటప్స్ కూ ఏమీ సంభధం ఉండదు. నిజానికి ఈ చిత్రంలో విలన్ రంగ నాయికి గా కనపడ్డా... దక్షిణామూర్తి కొడుకే విలన్. అతనికి బుద్ది చెప్పి తండ్రికి అప్పచెప్పటమే కథనంగా ఎవరైనా భావిస్తారు. అయితే ఇక్కడ ఆ సమస్యను వదిలేసి కథనం ..ఆమెకూ,విక్రమ్ కూ మధ్య నడుస్తుంది. అలాగే భీమలి కబడ్డి జట్టు మూలం తమిళ చిత్రం,నా పేరు శివ వంటి వైవిధ్యం ఉన్న చిత్రాలు తీసిన దర్శకుడు ఇలాంటి చిత్రాలు తీస్తాడని ఊహించము. అయితే తన మార్కుని అక్కడక్కడా మాత్రం ప్రదర్సించాడు. అయితే అది కొద్ధి క్షణాలే. ఇక హీరోయిన్ దీక్షాసేధ్ విషయానికి వస్తే ఆమె ఈ చిత్రంలో డమ్మీ. కేవలం పాటలు పాడేసి వెళ్లిపోతుంది. సన,కె విశ్వానాద్ మాత్రం తమ రొటీన్ నెస్ నుంచి తప్పుకుని కొత్తగా నటించే ప్రయత్నం చేసారు. యవన్ శంకర్ రాజా పాటలు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. మిగతా విభాగాలు అన్నీ సమర్ధవంతంగానే పనిచేసాయి..కానీ అస్సలు కీలకమైన కథ,కథనమే నీరసంగా,మూసగా ఉండటమే సినిమాని దెబ్బ కొట్టింది.

    ఏదైమైనా సంవత్సరం చివరలో వచ్చిన ఈ చిత్రం విక్రమ్ నుంచి వైవిధ్య భరిత చిత్రాలు ఆశించే అభిమానులను నిరాశపరుస్తుంది. అయితే రెగ్యులర్ రొటీన్ చిత్రాలు ఎన్నో చూసాము..ఇదో లెక్కా అంటారా...అయితే మీకు నచ్చేసే అవకాశం ఉంది..పదండి.

    English summary
    Vikram's Veedinthe film released with divide talk.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X