»   » వెళ్లిపోమాకే రివ్యూ: ఓ మంచి ప్రయత్నం..

వెళ్లిపోమాకే రివ్యూ: ఓ మంచి ప్రయత్నం..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ లో ఇప్పుడు చిన్న చిత్రాలదే హవా. పెళ్లి చూపులు సృష్టించిన బజ్.. ఇప్పుడు అర్జున్ రెడ్డితో పీక్స్ కు చేరింది. తక్కువ ఖర్చుతో.. కొత్తదనాన్ని చూపించగలిగితే చాలు. మంచి హిట్ డెఫినెట్ గా సొంతం చేసుకోవచ్చు. ఆ కోవలో.. అలాంటి ప్రయత్నంతో వచ్చిందే.. వెళ్లిపోమాకే. పేరుకు ఇదో ప్రేమక థే అయినా.. సొసైటీలో రెగ్యులర్ గా జరుగుతున్న పాయింట్ ను పట్టుకుని తీశాడు దర్శకుడు అలీ మహమ్మద్.. ఆ పాయింటే.. సినిమాకు కీలకంగా మారింది. జనాన్ని కనెక్ట్ అయ్యేలా చేస్తోంది.

 కథ ఏంటంటే..

కథ ఏంటంటే..

వెళ్లిపోమాకే. టైటిల్ వింటుంటే.. ఇది ప్రేమకథ అని అర్థమైపోతోంది. అలాగే డైరెక్టర్ డిజైన్ చేశాడు కూడా. యానిమేషన్ లో మాంచి టాలెంట్ ఉన్న ఓ ఉద్యోగి.. తనను ఎవరైనా ప్రేమిస్తే బాగుంటుందని అనుకుంటాడు. తన ఆఫీస్ లోనే చేరిన ఓ అమ్మాయిపై మనసు పడతాడు. కానీ.. ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి డీలా పడతాడు. అతడికి ఫేస్ బుక్ లో ఓ అమ్మాయి పరిచయం అవుతుంది. కానీ.. తననుంచి అనుకోని పరిస్థితుల్లో విడిపోవాల్సి వస్తుంది. అలా ఎందుకైంది? ఆ ఫేస్ బుక్ అమ్మాయిది తప్పా? లేదంటే హీరోది తప్పా? అనే విషయాన్ని తెర మీద చూడాల్సిందే..


ముగింపు బాగా కుదిరి ఉంటే

ముగింపు బాగా కుదిరి ఉంటే

సోషల్ మీడియాతో ముడిపడిన కథ. ఫస్ట్ హాఫ్ లో హీరో లవర్ బాయ్ గా ఉంటాడు. సెకండ్ హాఫ్ లో లవ్ ఫెయిల్యూర్ ఎలా ఉంటాడో.. అలాగే బిహేవ్ చేస్తాడు. ఈ రెండింటికీ.. తగిన ముగింపు పలకడంలో.. దర్శకుడు అలీ మహ్మద్ కాస్త కష్టపడ్డాడేమో అనిపించింది. బాగానే హాండిల్ చేస్తున్నాడు.. అనుకునే సమయంలోనే.. కథ కాస్త పక్కదారి పట్టడంతో.. అప్పుడప్పుడూ.. ప్చ్.. అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి లోపాలు సవరించుకుని ఉంటే.. వెళ్లిపోమాకే.. మరింత మంచి సినిమాగా పేరు తెచ్చుకుని ఉండేది.


ఫ్రెష్ లుక్ తో.. ఓకే అనిపించేశారు

ఫ్రెష్ లుక్ తో.. ఓకే అనిపించేశారు

కొత్త సినిమా.. కొత్త నటులు.. కొత్త సాంకేతిక వర్గం. అంతా కొత్తదే. మరి సినిమా ఎలా ఉంటుందో అని ఒకటే డౌట్. కానీ.. అందరి అనుమానాలు తీరుస్తూ.. హీరో విశ్వక్ సేన్.. లోకం గురించి సరిగా అర్థం చేసుకోలేని కేరెక్టర్ లో పర్వాలేదు అనిపించాడు. అలాగే.. హీరోయిన్లుగా.. సుప్రజ, శ్వేత.. తమ పరిధి మేరకు బాగానే నటించి.. అందరి దృష్టినీ అట్రాక్ట్ చేశారు. సినిమాకు మంచి లుక్ తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు.


దర్శకుడు అలీ మహమ్మద్ గురించి..

దర్శకుడు అలీ మహమ్మద్ గురించి..

అత్యంత సున్నితమైన అంశంతో వెళ్లిపోమాకే చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకులను మెప్పించడంలో సఫలమయ్యాడు దర్శకుడు అలీ మహమ్మద్. తొలి ప్రయత్నంలో పలు అంశాలలో తడబాటుకు గురైనా.. ఈ చిత్రాన్ని ఆకట్టుకునే విధంగా రూపొందించే ప్రయత్నం చేయడం అభినందనీయం. సినీ నిర్మాణంలో పలు విభాగాలపై పట్టు ఉండటం ఆయన ప్రతిభకు అద్దం పట్టింది,


సాంకేతిక వర్గం పనితీరు..

సాంకేతిక వర్గం పనితీరు..

వెళ్లిపోమాకే సినిమాకు సాంకేతిక వర్గమే బలంగా పని చేసింది. సినిమా డీలా పడుతున్న సమయంలో.. తన సంగీతంతో ప్రశాంత్ విహారి.. కాస్త రిలాక్స్ అయ్యే ఫీల్ కలిగించాడు. అయితే.. దర్శకుడికి ఉన్న కాస్త అయోమయమే.. సినిమాలో అప్పుడప్పుడూ గందరగోళానికి కారణమైనట్టు అనిపించింది. కెమెరామెన్ కూడా.. సరిగా సమన్వయం లేక.. లైటింగ్ ను సరిగా ఫోకస్ చేయలేదేమో అనిపిస్తుంది. క్లోజ్ షాట్స్ తీసుకున్నా.. కేరెక్టర్ ను ఎలివేట్ చేయలేకపోవడం సులువుగా తెలిసిపోతోంది.


దిల్ రాజు హాండ్ పడడంతో..

దిల్ రాజు హాండ్ పడడంతో..

దిల్ రాజు అంటే.. టాలీవుడ్ లో అదో ట్రేడ్ మార్క్. ఆయన ప్రొడ్యూసర్ గా కావొచ్చు.. డిస్ట్రిబ్యూటర్ గా కావొచ్చు.. చేయి వేశాడంటే.. అందులో ఏందో ఉండే ఉంటుంది అన్న నమ్మకం.. ప్రేక్షకుల్లో ఆటోమేటిగ్గా కలుగుతుంది. అంతటి సినిమాటిక్ టేస్ట్ ఉన్న దిల్ రాజు.. ఈ సినిమాను రిలీజ్ చేశాడు. దీంతో.. ప్రేక్షకులు నమ్మకంగా సినిమా థియేటర్లకు వెళ్తున్నారు. ఓ మంచి ఫీల్ తో.. థియేటర్ల నుంచి బయటికి వస్తున్నారు.


బడ్జెట్ అంత తక్కువా?

బడ్జెట్ అంత తక్కువా?

వెళ్లిపోమాకే సినిమా యూనిట్.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ ప్రయోగం చేసింది. కేవలం 20 లక్షల రూపాయల్లోనే సినిమా మేకింగ్ ను అన్ని ఖర్చులతో సహా పూర్తి చేసి.. శభాష్ అనిపించుకుంది. మంచి విషయాన్ని.. తక్కువ ఖర్చుతో తెరకెక్కిస్తే.. ఇంకెంతటి మంచి ఫలితం ఉంటుందో.. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసిందీ.. వెళ్లిపోమాకే చిత్ర యూనిట్. టాలీవుడ్ చరిత్రలోనే.. ఇదో కొత్త విజయవంతమైన ప్రయోగంగా కొందరు చెబుతున్నారు. యూనిట్ ను అభినందిస్తున్నారు.


పెద్ద సినిమాల మధ్యలో..

పెద్ద సినిమాల మధ్యలో..

నాని సినిమా నిన్ను కోరి నుంచి టాలీవుడ్ లో వరుసగా సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. పెద్ద సినిమాల హడావుడి తగ్గడంతో.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు జనాదరణ పొందుతున్నాయి. అర్జున్ రెడ్డి లాంటి టాప్ క్లాస్ హిట్ ఇండస్ట్రీని ఊపేస్తోంది. బాలయ్య పైసా వసూల్ వచ్చినా కూడా.. అందులో విషయం తేడా.. సినిమాలో సబ్జెక్ట్ థోడా అని జనాలు తేల్చేయడంతో వచ్చిన గ్యాప్ కాస్తా.. వెళ్లిపోమాకే లాంటి చిన్న సినిమాలకు ప్లస్ అవుతోంది. కొత్త దనాన్ని ఆశించే సినిమా ప్రేమికులకు వెళ్లిపోమాకే ఓ చక్కటి అనుభూతి కలుగుతుంది.English summary
Vellipomakey starring Vishwak Sen, Nithya Reddy and Supraja is a ongoing saga in the youth nowadays with connecting each other on social media and becoming friends in the real life. Director Yakub has created the effectiveness of the role played by Vishwak Sen.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu