»   » అంచనాలను అందుకోని చైతూ యుద్ధం... (‘యుద్ధం శరణం’ మూవీ రివ్యూ)

అంచనాలను అందుకోని చైతూ యుద్ధం... (‘యుద్ధం శరణం’ మూవీ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5

నాగ‌చైత‌న్య హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం బ్యాన‌ర్‌పై కృష్ణ ఆర్‌.వి.మారి ముత్తు ద‌ర్శ‌క‌త్వంలో ర‌జ‌ని కొర్ర‌పాటి నిర్మాత‌గా రూపొందిన చిత్రం యుద్ధం శ‌ర‌ణం. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించాడు.

నాగ చైతన్య హీరో కావడం, సాయి కొర్రపాటి బేనర్ నుండి వస్తున్న సినిమా కావడం, రాజమౌళి కొడుకు కార్తికేయ ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్‌గా చేయడంతో సినిమాలో ఏదో విషయం ఉంటుందనే ఆసక్తి ముందు నుండి అందరిలోనూ ఉంది. ట్రైలర్ కూడా అందరినీ ఇంప్రెస్ చేసింది.


దర్శకుడు మారిముత్తు తెలుగు వారికి అసలు పరిచయం లేక పోయినా.... నాగ చైతన్య కలిసి చదువుకున్న స్కూల్ మేట్ కావడంతో సినిమా స్టోరీ, కాన్సెప్ట్ విషయంలో ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుందని, తెరపై ఇప్పటి వరకు చూడని ఒక డిఫరెంట్ సినిమా చూడబోతున్నమనే అంచనాలు అందరిలోనూ ఏర్పడ్డాయి. మరి ఈ అంచనాలను 'యుద్ధం శరణం' ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం.


కథ విషయానికొస్తే...

కథ విషయానికొస్తే...

అర్జున్ (నాగ చైతన్య) హ్యాపీ గోయింగ్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. తల్లిదండ్రులు రావు రమేష్, రేవతి ఒక స్వచ్ఛంద సంస్థ రన్ చేస్తూ పేదలకు వైద్యం అందిస్తూ ఉంటారు. తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు, బావ... తాను ప్రేమించిన ప్రియురాలు (లావణ్య త్రిపాఠి)...... ఇలా ఎంతో సంతోషంగా సాగుతున్న అర్జున్ కుటుంబం హైదరాబాద్‌లోనే పెద్ద రౌడీ నాయక్ (శ్రీకాంత్) మూలంగా ప్రమాదం పడుతుంది.


రివేంజ్ డ్రామా

రివేంజ్ డ్రామా

నాయక్ వల్ల అర్జున్ తనతల్లిదండ్రులను కోల్పోతాడు. మిగతా ఫ్యామిలీని కూడా చంపేందుకు నాయక్ ప్రయత్నిస్తున్నాడనే విషయం తెలుసుకుని వారిని కాపాడుకునేందుకు యుద్ధం మొదలు పెడతాడు. మరోవైపు హైదరాబాద్‌లో బాంబ్ బ్లాస్ట్ జరిగి చాలా మంది చనిపోతారు. కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎన్ఐఏ ఆఫీసర్(మురళి శర్మ) అర్జున్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ బాంబు పేలుళ్లకు, అర్జున్‍‌కు సంబంధం ఏమిటి? నాయక్‌ నుండి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.


నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి

నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి

పెర్ఫార్మెన్స్ పరంగా నాగ చైతన్య... అర్జున్ పాత్రలో బాగా సూటయ్యాడు. తన ఫ్యామిలీని కాపాడుకునే క్రమంలో అతడు చేసిన పనులు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయి. నాగ చైతన్య, లావణ్య మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. అయితే సినిమా కథ ప్రకారం వీరి రొమాన్స్ పార్ట్ పరిమితం చేయాల్సి వచ్చింది. లావణ్య కనిపించేది కొన్ని సీన్లే అయినా ఉన్నంతలో ఇంప్రెస్ చేసింది.


ఇతర ముఖ్య పాత్రలు

ఇతర ముఖ్య పాత్రలు

అర్జున్ తండ్రి పాత్రలో రావు రమేష్ మరోసారి తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. తల్లి పాత్రలో నటి రేవితి సూపర్భ్. అర్జున్, రావు రమేష్, రేవతి మధ్య మచ్చే కొన్ని సీన్లు ప్రేక్షకులను ఎంటర్టెన్ చేస్తాయి. విలన్ నాయక్ పాత్రలో శ్రీకాంత్ మెప్పించాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్‌కు వరుస విలన్ ఆఫర్లు రావడం ఖాయం. కమెడియన్ ప్రియదర్శి కనిపించిన రెండు మూడు సీన్లలో తనదైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఇంతకు మించి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలేమీ లేవు.
టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాలు

నికేత్ బొమ్మి సినిమాటోట్రఫీ బావుంది. వివేక్ సాగర్ అందించిన సంగీతం ఫర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. అబ్బూరి రవి రాసిన డైలాగ్స్ ఒకే. డేవిడ్ ఆర్.నాథన్, అబ్బూరి రవి అందించిన స్క్రీన్ ప్లే ఆకట్టుకునే విధంగా ఉంది.


అదే పెద్ద మైనస్

అదే పెద్ద మైనస్

సినిమా కథలో కొత్తదనం లేదు. రోటీన్ రివేంజ్ డ్రామా. అయితే స్క్రీన్లే కాస్త ఫర్వాలేదు. రోటీన్ గా సాగే కథకు స్లో నేరేషన్ పెద్ద మైనస్‌గా మారింది. ఎలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు లేకుండా సినిమా మరీ ఇంత స్లోగా ఉంటే ప్రేక్షకులు భరించడం కష్టమే.


డ్రోన్ సీన్ హైలెట్

డ్రోన్ సీన్ హైలెట్

సినిమాలో ఓ సీన్లో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న గర్బవతి ప్రాణాలు కాపాడేందుకు డ్రోన్ ద్వారా రక్తం పంపించి ఆమెను కాపాడే సీన్ సినిమాలో బాగా హైలెట్ అయింది. ఆ సీన్ ప్రేక్షకులకు ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అవుతుంది.


 ప్లస్ పాయింట్స్

ప్లస్ పాయింట్స్

నాగ చైతన్య, రావు రమేష్, రేవతి, శ్రీకాంత్
ఫస్టాఫ్ ఫ్యామిలీ ఎమెషన్స్
డ్రోన్ సీన్


మైనస్ పాయింట్

మైనస్ పాయింట్

కథ రొటీన్ గా ఉండటం
సెకండాఫ్ మరీ సాగదీయడం.
ప్రేక్షకుడికి విసుగెత్తే స్లో నేరేషన్


ఫైనల్ వర్డ్

ఫైనల్ వర్డ్

ప్రేక్షకుల అంచనాలను అందుకునే స్థాయిలో చైతన్య ‘యుద్ధం' చేయలేదు.


యుద్ధం శరణం తెరవెనక

యుద్ధం శరణం తెరవెనక

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.


English summary
Check out Yuddham Sharanam movie review and rating. The movie stars Naga Chaitanya and Lavanya Tripathi in lead roles and has Srikanth playing a pivotal role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu