Don't Miss!
- News
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్.. హరీష్‌రావు ఆరోగ్యశాఖ ప్రగతి నివేదికపై వైఎస్ షర్మిల సెటైర్లు!!
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Balakrishna Veera Simha Reddy మెకింగ్ వీడియో.. సెట్ లో మోక్షజ్ఞ సందడి, ఫ్యాన్స్ కు ట్రీట్!
మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనే దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం వీర సింహా రెడ్డి. ఇటీవల బాలకృష్ణ అఖండ సినిమాతో, గోపిచంద్ మలినేని క్రాక్ మూవీతో మంచి జోష్ మీదున్నారు. అటు మాస్ హీరోగా బాలకృష్ణకు.. ఇటు మాస్ డైరెక్టర్ గా గోపిచంద్ మలినేనికి మంచి పేరు ఉంది. ఇక వీళ్లిద్దరి కలయికలో ఒక మాస్ ఎంటర్టైనర్ వస్తుందని ప్రకటన రాగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. దీనికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, పోస్టర్స్ చిత్రంపై హైప్ పెంచేశాయి. తాజాగా వీర సింహా రెడ్డి మూవీ మేకింగ్ వీడియోను విడుదల చేశారు.

పల్నాడు బ్యాక్ డ్రాప్ తో..
నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'అఖండ' తర్వాత రెట్టించిన ఉత్సాహంతో దూసుకుపోతోన్నారు. ఈ ఊపులోనే ఆయన కొత్త సినిమాలను వరుసగా లైన్‌లో పెట్టుకుంటోన్నారు. ఓ వైపు అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా అదరగొడుతూనే మరోవైపు సినిమాల్లో జోరు చూపిస్తున్నారు. ఇలా ఇప్పటికే టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహారెడ్డి' సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. పల్నాడు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని హై లెవెల్‌లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా బ్యూటిఫుల్ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రమోషన్స్ మొదలు..
బాలయ్య బాబు మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్న వీర సింహా రెడ్డి చిత్రంలో కోలీవుడ్ స్టార్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ మరో కీలక పాత్రల్లో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై యలమంచిలి రవి, నవీన్ యెర్నేని నిర్మిస్తున్నారు. అఖండ తర్వాత బాలకృష్ణ నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవర్‌ఫుల్ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్‌ను ఇప్పటికే మొదలు పెట్టింది.

సెట్ లో మోక్షజ్ఞ సందడి..
బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఇప్పటికే పోస్టర్స్, పాటలు విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. బాలకృష్ణ అభిమానుల కోసం న్యూ ఇయర్ కానుకగా ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఒక నిమిషం 45 సెకన్లపాటు సాగిన ఈ వీడియోలో యాక్షన్ సీన్స్, బాలకృష్ణ డైలాగ్ చూపించారు. అలాగే సీన్లు ఎలా వచ్చాయి.. యాక్షన్ సీక్వెన్స్ గురించి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మన్ తో డైరెక్టర్ గోపిచంద్ మాట్లాడటం చూడొచ్చు. ఇంతేకాకుండా సెట్ లో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ తేజ సందడి చేయడం చూపించారు. ఇక చివర్లో సిగర్ ను స్టైలిష్ గా బాలకృష్ణ వేసుకోవడంతో వీడియోను ఎండ్ చేశారు. ఈ వీడియో అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపేలా ఉందని చెప్పవచ్చు.