Don't Miss!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Sports
INDvsNZ : రెండో టీ20 పిచ్ రిపోర్ట్.. డేంజర్లో టీమిండియా రికార్డు!
- News
మా నాన్న జోలికి వస్తే సహించం - తమ్ముడంటే ప్రాణం: రాం చరణ్ వార్నింగ్..!!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
Bhola Shankar: జెట్ స్పీడ్ లో మరో షూటింగ్ స్టార్ట్ చేసిన మెగాస్టార్.. భారీ సెట్ లో కీలక షెడ్యూల్
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో గ్యాప్ లేకుండా సినిమాలను లైన్లోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ కాకముందే మరొక సినిమాను పూర్తి చేసే విధంగా చిరు జెట్ స్పీడ్ తో వెళుతున్నారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా థియేటర్లో విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అందుకుని మెగాస్టార్ కెరీర్ లోనే ఒక సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
మాస్ స్టైలిష్ దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై కూడా ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుంది అని దర్శకుడు కూడా ఇదివరకే ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా కోసం ఈ సినిమా షూటింగ్ కు మెగాస్టార్ చిరంజీవి కొత్త గ్యాప్ ఇచ్చాడు. ఇక మొత్తానికి వాల్తేరు వీరయ్య హడావిడి మొత్తం ఫినిష్ కావడంతో ఇప్పుడు భోళా శంకర్ కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు.
Continuing the Mega Blockbuster Festive Vibe with High Positive Energy😎#BholaaShankar New Schedule commences today in a Huge Kolkata set🔥
— BholāShankar (@BholaaShankar) January 17, 2023
Mega🌟@KChiruTweets @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @dudlyraj @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/6MHIhalliL
హైదరాబాదులోనే ఒక భారీ కోల్కతా సెట్ నిర్మించారు. ఇక ఈ సెట్ లో మెగాస్టార్ చిరంజీవితో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఇదే సెట్ లో కొన్ని డ్రామా సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక సెట్ లోని కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వేదాళం సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

దర్శకుడి మీద నమ్మకంతోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉండగా సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఇక మిగతా షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి సమ్మర్లో ఈ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు.