Dheera ప్రముఖ నిర్మాత కుమారుడు హీరోగా ధీర.. యువ కథానాయకుడు ఎవరంటే?
టాలీవుడ్ ప్రతిభావంతులైన యువ హీరోలకు ప్రేక్షకులు అనూహ్యంగా రెస్సాన్స్ ఇస్తున్నారు. మంచి కంటెంట్ వచ్చే సినిమాలను ఆదరిస్తున్నారు. బిచ్చగాడు లాంటి హిట్ సినిమాను అందించిన చదలవాడ ఫ్యామిలీ నుంచి యువ హీరో తెలుగు సినిమా పరిశ్రమలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే వలయం సినిమాతో ప్రశంసలు అందుకొన్న లక్ష్ చదలవాడ త్వరలోనే విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తన్నాడు. ఆయన నటించిబోతున్న ధీర సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్వగా.. చదలవాడ శ్రీనివాస రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ నెల 14వ తేదీ వరకు హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరగనుంది.

చదలవాడ లక్ష్ త్వరలోనే 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలోనే మరో ప్రాజెక్టు ఓకే చేసి ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. 'ధీర' అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను నేడు విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సరికొత్త కథాంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు.
శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 12గా ఈ సినిమా నిర్మిస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించిన సాయి కార్తీక్ ఈ సినిమాకు బాణీలు కడుతున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ హంగులతో ఈ సినిమా నిర్మాణం పూర్తి చేయనున్నారట మేకర్స్.
విలక్షణ కథలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న హీరో లక్ష ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయమని చిత్రయూనిట్ చెబుతోంది. నేటితరం కోరుకునే అన్ని అంశాలు జోడించి ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు.
సమర్పణ: చదలవాడ బ్రదర్స్
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్
నిర్మాత: పద్మావతి చదలవాడ
దర్శకుడు: విక్రాంత్ శ్రీనివాస్
సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: కన్నా పీసీ
డైలాగ్స్: విక్రాంత్ శ్రీనివాస్, శృతిక్
ఎడిటర్: మధు రెడ్డి
ఫైట్ మాస్టర్: జాషువా
పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు


Click it and Unblock the Notifications











