RC15 అమృత్‌సర్‌లో రాంచరణ్.. ఓ రేంజ్‌లో శంకర్ జోరు!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. సినిమా కంప్లీట్ కాగానే.. మరో సినిమాను పట్టాలెక్కిస్తూ అభిమానులను ఆకట్టుకొంటున్నాడు. RRR చిత్రంతో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన రాంచరణ్ క్రేజీ ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా ఆయన తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన ఆచార్య చిత్రం రిలీజ్‌కు సిద్దంగా ఉంది. అలాగే సెట్స్‌పై RC15 చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..
దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు రాసిన పోలిటికల్ డ్రామా కథను రాంచరణ్‌తో సంచలన దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి, జయరామ్, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

అయితే RC15 సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలైంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొంటున్నది. ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను ప్రస్తుతం అమృత్‌సర్‌లో చిత్రీకరిస్తున్నారు. తాజా షెడ్యూల్ ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ షెడ్యూల్‌లో కాలేజ్ సీన్లు, ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరిస్తారు. ఈ సినిమాకు తిరు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తుండగా.. షామీర్ మహ్మద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











