హీరోయిన్‌తో ఎంజాయ్ చేస్తున్న మెగా హీరో...
సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాస్ నిర్మాతగా రూపొందుతున్న చిత్రం "ప్రతిరోజు పండగే". మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా టైటిల్ మాదిరిగానే షూటింగ్ కూడా ప్రతిరోజూ పండగే అనే విధంగా జరుగుతోందట.
తాజాగా సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రాశీ ఖన్నా సెట్లో ఎంజాయ్ చేస్తూ సెల్ఫీ తసుకున్న ఫోటోను చిత్ర బృందం షేర్ చేసింది. గతంలో వీరిద్దరు కలిసి నటించిన 'సుప్రీమ్' విజయం అందుకుంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. సెట్లో వీరు చేస్తున్న సందడి యూనిట్ సభ్యుల్లో మరింత ఉత్సాహం నింపుతోందట.

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ కొసం సిద్ధమవుతున్నారు.సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు
సాంకేతిక వర్గం
రచన, దర్శకత్వం - మారుతి దాసరి
సమర్పణ - అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ - బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ - ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ - తమన్ .ఎస్
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ - రవీందర్
ఎగ్జీక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు
డిఓపి - జైకుమార్ సంపత్
పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను


Click it and Unblock the Notifications











