Don't Miss!
- News
తారకరత్న వద్ద జూ ఎన్టీఆర్ - శివన్న- బ్రాహ్మణి: ఎమోషనల్ - విషమంగా..!!
- Finance
Stock Market: వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయ్..? ట్రేడర్స్ గుర్తించాల్సిన విషయాలు..
- Lifestyle
Chanakya Niti: చాణక్యుడు చెప్పినట్లు ఇలా చేస్తే విజయం దాసోహం అంటుంది
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Sports
INDvsNZ : ఓపెనింగ్.. ఫినిషింగ్.. రెండూ టీమిండియాకు సమస్యలే!
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఖాకి డ్రెస్సులో కేక పెట్టిస్తున్న విజయ్ దేవరకొండ.. షాకింగ్ లుక్.. వైరల్ అవుతున్న పిక్స్!
Recommended Video

విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. డెబ్యూ దర్శకుడు భరత్ కమ్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తాడని సమాచారం. గీత గోవిందం, టాక్సీవాలా లాంటి చిత్ర విజయాలతో డియర్ కామ్రేడ్ చిత్రంపై అంచనాలు బాగా పెరిగాయి. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ కొత్త గూడెంలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లని అలరిస్తున్నాయి.

కొత్తగూడెంలో షూటింగ్
ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్ర షూటింగ్ కొత్త గూడెంలోని కార్మిక ప్రాంతాల్లో జరుగుతోంది. విద్యార్థి నాయకుడిగా ఉన్న విజయ్ దేవరకొండ కార్మికుల తరుపున ఎందుకు పోరాటం చేశాడనేది ఈ చిత్రంలో ఆసక్తికర అంశం. ఓ పాఠశాల ప్రాంతంలో డియర్ కామ్రేడ్ చిత్ర షూటింగ్ జరుగుతుండగా విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున విజయ్ ని చూసేందుకు ఎగబడ్డారు. మరికొన్ని రోజుల పాటు ఈ ప్రాంతంలో షూటింగ్ జరగనుంది. పోలీసులు అవసరమైన భద్రతని షూటింగ్ కొరకు ఏర్పాటు చేశారు.

షాకింగ్ లుక్
షూటింగ్ ప్రదేశం నుంచి బయటకు వచ్చిన విజయ్ దేవరకొండ ఫోటోలు ఆసక్తికరంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ స్టైలిష్ లుక్ తో, కాస్త మీసంతో కనిపిస్తున్నాడు. విజయ్ దేవరకొండ గత చిత్రాలకంటే ఈ చిత్రంలో అతడి లుక్, హెయిర్ స్టైల్ డిఫెరెంట్ గా ఉంది. విజయ్ దేవరకొండ ఖాకీ డ్రెస్సులో కనిపిస్తున్న ఓ ఫోటో మాత్రం అభిమానులు విపరీతంగా ఆకర్షిస్తోంది. ఖాకి డ్రెస్సులో విజయ్ దేవరకొండ కార్మికుడిగా కనిపిస్తున్నాడు.

రష్మిక హీరోయిన్
కన్నడ బ్యూటీ రష్మిక రెండవసారి విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా ఈ చిత్రంలో నటిస్తోంది. రష్మిక మందన మహిళ క్రికెటర్ పాత్రలో ఈ చిత్రంలో కనిపిస్తుందట. ఇప్పటికే గీత గోవిందం చిత్రంలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

కథకే ప్రాధాన్యత
విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా దూసుకుపోతున్నాడు. విజయ్ దేవరకొండతో సినిమా చేసేందుకు స్టార్ డైరెక్టర్స్ సైతం ఆసక్తి చూపుతున్నారు. కానీ విజయ్ మాత్రం కథకే ప్రాధాన్యత ఇస్తున్నాడు. డియర్ కామ్రేడ్ తర్వాత విజయ్ దేవరకొండ క్రాంతి మాధవ్ దర్శత్వంలో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.