twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కల్యాణ్ సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్ 'ఖుషి'.. పవర్‌స్టార్ బాక్సాఫీస్ ధమాకాకు 19ఏళ్ళు!

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో ఖుషి ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ ని అమాంతంగా ఆకాశానికి పెంచేసిన ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. భారీ యాక్షన్ సినిమాలు మాత్రమే ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేస్తాయని అప్పట్లో ఉన్న కొన్ని అపోహలకు ఖుషి చెక్ పెట్టింది. వన్ మ్యాన్ షోగా పవన్ కళ్యాణ్ భూమికతో నడిపించిన లవ్ ట్రాక్ ఆల్ టైమ్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు.

     ఖుషి 19ఇయర్స్..

    ఖుషి 19ఇయర్స్..

    బెస్ట్ క్లాసిక్ ఖుషి సినిమా వచ్చి నేటికీ 19 ఏళ్లవుతోంది. 2001 ఏప్రిల్ 27న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఒక సరికొత్త సెన్సేషన్. సినిమాను ఎన్నాళ్ళయినా అభిమానులు మర్చిపోలేరనే చెప్పాలి. అప్పటివరకు ఉన్న రొమాంటిక్ డ్రామాల స్టైల్ ని మార్చేసిన ఈ సినిమా అంటే నేటితరం సినీ తారలకు కూడా ఇష్టమైన సినిమా. పవన్ కళ్యాణ్ అభిమానుల సంఖ్య కూడా అప్పటినుంచే పెరగడం స్టార్ట్ అయ్యింది.

    ఇండస్ట్రీ హిట్..

    ఇండస్ట్రీ హిట్..

    ఖుషి మొదటిరోజే బాక్స్ ఆఫీస్ రికార్డులను నమోదు చేయడం స్టార్ట్ చేసింది. అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను ఈ చిత్రం తిరగరాసింది. అప్పట్లో 20కోట్లకు పైగా లబాల్ని అందించిన సినిమాగా ఈ మూవీ టాప్ లిస్ట్ లో చేరింది. ఇక 101 సెంటర్స్ లో 50రోజులు ఆడిన ఖుషి 79 సెంటర్స్ లలో 100రోజులు ప్రదర్శించారు. భూమిక కూడా ఇదే సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

    మ్యూజిక్ మర్చిపోగలమా?

    మ్యూజిక్ మర్చిపోగలమా?

    ఖుషి సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. ఈ సినిమా పాటలు వచ్చి 19 ఏళ్లయినా ఇంకా ఆల్ టైమ్ బెస్ట్ హిట్స్ లో ఒకటిగానే ఉన్నాయి. ప్రతి ఒక్క పాటను ఒక్కో ఆణిముత్యంలా మణిశర్మ స్వరపరిచిన విధానం అద్బుతమనే చెప్పాలి. సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు ఎంతగానో ఉపయోగపడింది. ఈ సినిమాకి మ్యూజిక్ అసిస్టెంట్ గా పనిచేసిన వారిలో థమన్ కూడా ఉన్నాడు.

    Recommended Video

    Johnny Movie Completes 17 Years | Most Craziest Movie Ever
     ఇక్కడే పెద్ద హిట్..

    ఇక్కడే పెద్ద హిట్..

    దర్శకుడు ఎస్.జె.సూర్య మొదట ఖుషి సినిమాను తమిళ్ లో తెరకెక్కించారు. విజయ్, జ్యోతిక నటించిన ఆ సినిమా బాగానే ఆడింది.. కానీ తెలుగు ఖుషి రేంజ్ లో సక్సెస్ కాలేదు. తెలుగులో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకోవడం సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఆ తరువాత హిందీ, కన్నడ భాషలలో కూడా ఖుషిని రీమేక్ చేయగా అక్కడ కూడా ఈ రేంజ్ లో సక్సెస్ కాలేకపోయింది.

    English summary
    The best classic Khushi movie is 19 years completed. Released on April 27, 2001, the film was a new sensation. Fans of the film can not forget. This is a movie that has changed the style of the romantic drama ever since. Pawan Kalyan's fan base has also started rising since then.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X