Akhanda 50 days బాహుబలి తర్వాత అరుదైన రికార్డు.. 103 సెంటర్లలో ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

దేశంలో సినిమా పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో అఖండ చిత్రం అద్బుతమైన విజయాన్ని అందుకొన్నది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం రికార్డు కలెక్షన్లతోపాటు అరుదైన విజయాన్ని అందుకొన్నది. ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ఈ సినిమా సరికొత్త రికార్డు దిశగా అడుగులేస్తున్నది. ఈ చిత్రం సాధించిన రేర్ రికార్డు ఏమిటంటే..

Recommended Video

Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్
బాలకృష్ణ అఖండ విజయం..

బాలకృష్ణ అఖండ విజయం..

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్, ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న సమయంలో అఖండ చిత్రం థియేటర్లలో రిలీజైంది. ఏపీలో టికెట్ రేట్ల వివాదాన్ని లెక్క చేయకుండా బాలకృష్ణ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతేకాకుండా అఖండ తర్వాత పలు సినిమాలు రిలీజయ్యాయి. కానీ ప్రేక్షకులు అఖండ మూవీకే పట్టం కట్టారు. దాంతో ఏడో వారంలో కూడా అఖండ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతున్నది.

నందమూరి బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్

నందమూరి బాలకృష్ణ, బోయపాటి హ్యాట్రిక్

అఖండ చిత్రానికి ముందు ఎన్నో సవాళ్లు నిలిచాయి. అప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ చిత్రాలు భారీ విజయాలను అందుకొన్నాయి. ఇక హ్యాట్రిక్ విజయం కోసం సిద్ధమైన అఖండపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకొన్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా అఖండమైన అనుభూతిని ప్రేక్షకులకు పంచిపెట్టింది. దాంతో అఖండ విజయం అత్యంత సులభంగా మారింది.

బాలకృష్ణ అఘోరా పాత్రలో

బాలకృష్ణ అఘోరా పాత్రలో

అఖండ విజయంలో నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభ ప్రత్యేక ఆకర్షణగా మారింది. బాలకృష్ణ అఘోరా పాత్రలో ఆలరించగా, జగపతి బాబు, శ్రీకాంత్ నటన అందర్ని మెప్పించింది. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ యూత్‌కు గిలిగింతలు పెట్టింది. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రాంప్రసాద్ సినిమాటోగ్రఫి, ద్వారక క్రియేషన్ బ్యానర్ నిర్మాణ విలువలు ఈ సినిమా రేంజ్‌ను పెంచాయి.

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు

ప్రపంచవ్యాప్తంగా పలు సినిమాలు కలెక్షన్లు రాబట్టడానికి ప్రయత్నిస్తే.. అఖండ మాత్రం అలవోకగా రికార్డు బ్రేక్ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికా, యూకే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో భారీ కలెక్షన్లను రాబట్టింది. అమెరికాలో ఈ చిత్రం ఒక మిలియన్ అమెరికన్ డాలర్లను వసూలు చేసింది. ఇటీవల కాలంలో ఓ మీడియం బడ్జెట్ చిత్రం ఈ రేంజ్ లాభాలను సొంతం చేసుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

103 కేంద్రాల్లో 50 రోజులు.. 200 కోట్ల కలెక్షన్లు

103 కేంద్రాల్లో 50 రోజులు.. 200 కోట్ల కలెక్షన్లు

అఖండ చిత్రం జనవరి 20 తేదీ నాటికి 50 రోజులు పూర్తి చేసుకొన్నది. గత పదేళ్లలో 50 రోజు పోస్టర్ పడిన దాఖలాలు చాలా తక్కువ. బాహుబలి తర్వాత అర్ధశతదినోత్సవం జరుపుకొన్న ఏకైక చిత్రం అఖండి. ఈ చిత్రం 103 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకొన్నది. థియేట్రికల్ గ్రాస్, నాన్ థియేట్రికల్ రెవెన్యూ పరంగా అఖండ చిత్రం 200 కోట్లు వసూలు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X