అరుదైన క్లబ్‌లోకి అల్లు అర్హ.. శ్రీదేవి రేంజ్‌లో అంటూ... గుణశేఖర్ టీమ్ సెన్సేషనల్ ట్వీట్

అల్లు నటవారసత్వాన్ని పుచ్చుకోబోతున్న అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హను చూస్తే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది. పిట్ట కొంచెం కూత ఘనం అనే సామెతలు గుర్తుకు వస్తాయి. ఇప్పటికే అర్హ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో అల్లు అర్హ బాలనటిగా తెరపైకి వస్తుండటంతో మెగా, అల్లు ఫ్యాన్స్, సినీ అభిమానుల్లో సంతోషం పెరిగిపోయింది. అయితే అల్లు అర్హ ఇంకా ఆరంగేట్రం చేయకముందే ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

శాకుంతలమ్ అనే ప్రతిష్టతాత్మకంగా

శాకుంతలమ్ అనే ప్రతిష్టతాత్మకంగా


బాల రామాయణం, రుద్రమదేవి లాంటి చారిత్రాత్మక చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రస్తుతం శాకుంతలం అనే మూవీని ప్రతిష్టాత్మకంగా తీర్చి దిద్దుతున్నారు. భరతుడు, శకుంతల కథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సమంత లీడ్ రోల్‌లో కనిపించబోతున్నారు. అనేక ప్రత్యేకతలతో సెట్స్‌పైన ఉన్న ఈ చిత్రానికి మరో అకర్షణ అల్లు అర్హ రూపంలో తోడైంది.

శాకుంతలమ్‌లో అల్లు అర్హ

శాకుంతలమ్‌లో అల్లు అర్హ

శాకుంతలం చిత్రంలో అల్లు అర్హ ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా ఏ పాత్రలో కనిపించబోతున్నారనే విషయంపై ఆసక్తిని కలిగించింది. అయితే అలాంటి సందేహాలకు చెక్ పెడుతూ గుణ టీమ్ వర్క్స్ ఓ క్లారిటీని ఇచ్చింది.

శ్రీదేవీ, రోజారమణి సరసన

శ్రీదేవీ, రోజారమణి సరసన

అద్భుతమైన నటి, దివంగత శ్రీదేవి యశోదకృష్ణ చిత్రంలో చిన్నికృష్ణుడి పాత్రతో బాలనటిగా రంగ ప్రవేశం చేసింది. అలాగే ప్రముఖ నటి రోజారమణి భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాదుడి పాత్రతో బాలనటిగా ప్రవేశించారు. ఇప్పుడు అలాంటి ఘనతనే అల్లు అర్హ సొంతం చేసుకొన్నది అని గుణ టీమ్ వర్క్స్ ట్వీట్‌లో తెలిపారు.

బాల భరతుడిగా అల్లు అర్హ

బాల భరతుడిగా అల్లు అర్హ


ఇక శాకుంతలం చిత్రంలో బాల భరతుడిగా అల్లు అర్హ కనిపించబోతున్నారు. బాలనటిగా చిన్నారిని సెట్స్‌పైకి ఆహ్వానిస్తున్నాం. శ్రీదేవి, రోజా రమణి లాంటి ప్రముఖులున్న బాలనటుల క్లబ్‌లో అర్హ చేరి ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు అని తమ ట్వీట్‌లో వెల్లడించారు.

శాకుంతలం సినిమా టీమ్ గురించి

శాకుంతలం సినిమా టీమ్ గురించి

ప్రముఖ కవి కాళిదాసు రచించిన శకుంతల గ్రంథం ఆధారంగా తెరకెక్కుతున్న శాకుంతలం చిత్రాన్ని దిల్ రాజు, నీలిమా గుణ నిర్మిస్తున్నారు. గుణ టీమ్ వర్క్స్‌, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత అక్కినేని, దేవ్ మోహన్, అదితి బాలన్ నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ వీ జోసెఫ్ సినిమాటోగ్రఫిని, ప్రవీణ్ పుడి ఎడిటింగ్, మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X