Don't Miss!
- Technology
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
- News
YS Jagan, Chandrababu : జగన్, చంద్రబాబుకూ సంక్షేమ సవాల్ ! లబ్దిదారుల డిమాండ్లు ఇవే..!
- Finance
Stock Market: ఒడిదొడుకుల్లో స్టాక్ మార్కెట్లు.. ఇక ఒక్కరోజే టైమ్.. జాగ్రత్త ట్రేడర్స్
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Automobiles
కుర్రకారుని ఉర్రూతలూగించే 'అల్ట్రావయోలెట్ F77 రీకాన్' రివ్యూ.. ఫుల్ డీటైల్స్
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
నువ్వే నా జీవితం.. అల్లు అర్జున్ ఎమోషనల్.. అదిరిపోయిన పిక్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రస్తుతం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. పుష్ప రాజ్‌ను పరిచయం చేస్తూ శాంపిల్‌గా వదిలిన చిన్న వీడియో ఇప్పుడు దేశం మొత్తం వైరల్ అవుతోంది. పుష్ప సినిమాను ప్యాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బన్నీ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా అభిమానులకు ఇప్పటి నుంచే ట్రీట్స్ ఇవ్వడం మొదలుపెట్టేశారు. ఈ క్రమంలో తాజాగా వదిలిన వీడియో దుమ్ములేపుతోంది.

ఓ వైపు అలా..
ప్రస్తుతం పుష్ప రాజ్ పరిచయం అంటూ వదిలిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇందులో బన్నీని పూర్తిగా చూపించలేదు కానీ ఆ విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఓ రేంజ్‌లో అదిరిపోయింది. టీజర్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

బన్నీ ఇలా..
పుష్ప రాజ్ అంటూ బన్నీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఇప్పుడు తన ఫ్యామిలీతో మాల్దీవుల్లో రచ్చ చేస్తున్నాడు. తన కుమారుడు అయాన్ బర్త్ డే సందర్భంగా బన్నీ ఫ్యామిలీ మాల్దీవులకు చెక్కేసింది. ఈ మేరకు బన్నీ షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.

మాల్దీవుల్లో రచ్చ...
బన్నీ ప్రస్తుతం అయాన్ బర్త్ డే కోసం భారీ ప్లాన్ వేశాడు. అయన్ కోసం షూటింగ్‌కు గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో కలిసి మాల్దీవులకు చెక్కేశాడు. అక్కడే బన్నీ తన కుమారుడు అయాన్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశాడు. ఈక్రమంలో అయాన్‌పై బన్నీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

నువ్వే నా జీవితం..
నా
స్వీటెస్ట్
బేబీ
బాబు
అయాన్‌కు
హ్యాపీ
బర్త్
డే..
నా
జీవితంలోని
ప్రేమకు
అర్థం
నువ్వే..
నువ్
ఇలానే
ప్రతీ
ఏడాది
సంతోషంగా
ఉండాలి..
లవ్యూ
నాన
అంటూ
బన్నీ
ఎమోషనల్
అయ్యాడు.
ఇక
ఈ
ఫోటోలో
అల్లు
అర్హ
ఆశగా
కేక్
వైపు
చూస్తోంది.
బన్నీ
కళ్లల్లో
ఆనందం
వెల్లివిరుస్తోన్నట్టుంది.

పుష్ప టీజర్..
బన్నీ బర్త్ డే సందర్బంగాపుష్ప టీజర్‌ను విడుదల చేయబోతోన్నారు. ఇందులో కేవలం బన్నీ హీరోయిజం మాత్రం ఉండబోతోంది. అన్ని భాషల్లో ఈ టీజర్ రిలీజ్ కాబోతోంది. ఏప్రిల్ 7న సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు టీజర్ రాబోతోందని ప్రకటించారు.