Don't Miss!
- News
మంత్రిపై కాల్పులు జరిపిన ఎస్ఐ- పాయింట్ బ్లాక్ రేంజ్లో
- Sports
ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుంది.. టీమిండియాపై మాజీ లెజెండ్ నమ్మకం
- Finance
Hindenburg: హిండెన్‌బర్గ్ స్థాపించింది ఎవరు..? అసలు ఈ కంపెనీ ఏం చేస్తుందంటే..
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
జానీ మాస్టర్ వల్లే .. ఆ విషయంలో చాలా కష్టపడ్డా.. అనసూయ కామెంట్స్
ప్రస్తుతం అనసూయ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. చావు కబురు చల్లగా అనే సినిమా కోసం అనసూయ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఇందులో అనసూయ వేసిన స్టెప్పులు కనబడిన తీరుకు నెటిజన్లు అవాక్కవుతున్నారు. పైన పటారం అంటూ అనసూయ వేసిన మాస్ డ్యాన్స్ ఇప్పుడు కుర్రాళ్ల చేత విజిల్స్ వేయిస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ ఈ స్పెషల్ సాంగ్ గురించి కొన్ని కామెంట్లు చేసింది.

ఐటెం సాంగ్స్..
అనసూయ ఐటం సాంగ్‌లో డ్యాన్సులు వేస్తే ఎలా ఉంటుందో ఇది వరకే చూశాం. విన్నర్ సినిమాలో సూయ సూయ అనసూయ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆ తరువాత కూడా ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ తాజాగా చావు కబురు చల్లగా సినిమాలోనిఐటం సాంగ్‌కే అనసూయ ఓటేసింది. దాని వెనుక పెద్ద కథే ఉందంట.

జానీ మాస్టర్ వల్లే..
పైన పటారం అనే పాట.. ఓ చక్కటి జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది. జేక్స్ తన రెగ్యులర్ మెలోడీలకు పూర్తి భిన్నంగా ఈ పాటని సిద్ధం చేశాడు. ఈ పాటకి నేను బాగుంటానని దర్శకుడికి చెప్పింది జానీ మాస్టరే అంటూ అసలు విషయాన్ని బయటపెట్టేసింది అనసూయ.

ఎంతో కష్టపడ్డాను..
అంతే కాకుండా అనసూయ ఈ పాటకు డ్యాన్సులు వేసేందుకు ఎంతగా కష్టపడిందో చెప్పుకొచ్చింది. మామూలుగానే కార్తికేయ డ్యాన్సులు ఇరగదీస్తుంటాడు. అలాంటి హీరోతో పోటీ పడి డ్యాన్స్ చేయడానికి కష్టపడ్డానంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఇప్పటి వరకు వచ్చిన మాస్ గీతాల్లో ఇది ప్రత్యేకంగా నిలుస్తుందని అనసూయ తెలిపింది.

పలు ఆఫర్లు..
అనసూయ ప్రస్తుతం తెలుగులో 'రంగమార్తాండ', 'ఖిలాడీ', 'థ్యాంక్యూ బ్రదర్' చిత్రాల్లో నటిస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. అలాగే తమిళ్‌లో ఓ సినిమా , మలయాళంలో మమ్ముట్టితో ఓ చిత్రం చేయ బోతున్నా. బాలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయంటూ అసలు విషయాలు చెప్పేసింది. రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నా అంటూ తన డైరీలో ఖాళీ అనేదే లేదన్నట్టుగా చెప్పేసింది.

భారీ రెమ్యూనరేషన్..
ఇక పైన పటారం పాటకు ఆడిపాడిన అనసూయకు భారీ మొత్తంలో దక్కినట్టు తెలుస్తోంది. హీరోయిన్‌గా చేసిన లావణ్యత్రిపాఠికి 60 లక్షలు వస్తే.. మూడు రోజులకే అనసూయకు దాదాపు 20 లక్షలు ముట్టాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.