For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సస్పెన్స్‌కు తెరలేపిన శ్రీముఖి: తొలిసారి అలా కనిపించబోతుందా.. సెన్సేషన్‌గా హాట్ యాంకర్ ట్వీట్

  |

  శ్రీముఖి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. దాదాపు పదేళ్లుగా బుల్లితెరపై తన హవాను చూపిస్తోన్న ఈ బ్యూటీ.. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో షోలను హోస్ట్ చేసింది. అంతేకాదు, గ్లామర్ క్వీన్‌గా కితాబందుకుంది. తద్వారా ఎంతో మంది అభిమానులను.. ఎన్నో ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది. దీంతో బుల్లితెరతో పాటు వెండితెరపై ఫుల్ బిజీగా గడపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యాంకర్ శ్రీముఖి తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్ సస్పెన్స్‌గా మారింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

  Anchor Sreemukhi Confirms Her Relationship
  అదుర్స్ అనిపించుకున్న యాంకర్ శ్రీముఖి

  అదుర్స్ అనిపించుకున్న యాంకర్ శ్రీముఖి

  హీరోయిన్ అవ్వాలన్న లక్ష్యంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీముఖి. అయితే, వెండితెరపై అంతగా కలిసి రాకపోయినా.. బుల్లితెరపై మాత్రం యాంకర్‌గా సత్తా చాటుతోంది. ‘అదుర్స్' అనే షోతో హోస్టుగా పరిచయం అయిన ఈ బ్యూటీ.. సుదీర్ఘ కాలంలో ‘అదుర్స్ 2', ‘మనీ మనీ', ‘పటాస్', ‘సూపర్ సింగర్', ‘జోలకటక', ‘కామెడీ నైట్స్', ‘బొమ్మ అదిరింది' సహా ఎన్నో షోలు చేసింది.

  అందులోనూ సత్తా... నటిగా... హీరోయిన్‌గా

  అందులోనూ సత్తా... నటిగా... హీరోయిన్‌గా

  తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా వెలుగొందుతోన్న శ్రీముఖి.. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో నటించింది. ఇందులో సహాయ నటి పాత్రలతో పాటు హీరోయిన్‌ రోల్స్ కూడా ఉన్నాయి. ఇన్నేళ్ల ప్రయాణంలో ఈ హాట్ బ్యూటీకి ‘జులాయి', ‘నేను శైలజ', ‘జెంటిల్‌మన్', ‘బాబు బాగా బిజీ' సహా ఎన్నో చిత్రాలు పేరు తెచ్చి పెట్టాయి. అయితే, ఇప్పుడు పెద్దగా సినిమాల్లో నటించడం లేదు.

  శ్రీముఖి కెరీర్‌లో పెద్ద నిరాశ రియాలిటీ షోనే

  శ్రీముఖి కెరీర్‌లో పెద్ద నిరాశ రియాలిటీ షోనే

  శ్రీముఖి.. తన కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను చేరుకుంది. కానీ, బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ మాత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. రెండేళ్ల క్రితం ప్రసారం అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ -3కి ఒక కంటెస్టెంట్‌గా వెళ్లిందామె. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఈ అమ్మడు.. అద్భుతమైన ఆటతీరుతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. కానీ, ఊహించని విధంగా ఆమె రన్నర్‌తో సరిపెట్టుకుంది.

  ఇప్పుడు అదొక్కటే.. కొత్త బిజినెస్ ప్రారంభం

  ఇప్పుడు అదొక్కటే.. కొత్త బిజినెస్ ప్రారంభం

  చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోంది శ్రీముఖి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ‘క్రేజీ అంకుల్స్' అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. భరణి, సింగర్ మనో, రాజా రవీంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమాను ఇ. సత్తిబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌కు విపరీతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉండగా, ఇటీవలే శ్రీముఖి ‘లూవీ' అనే పేరుతో బిజినెస్ ప్రారంభించింది.

  ట్వీట్ ద్వారా సస్పెన్స్‌కు తెరలేపిన శ్రీముఖి

  ట్వీట్ ద్వారా సస్పెన్స్‌కు తెరలేపిన శ్రీముఖి

  వరుస షోలు.. సినిమాలు.. ఈవెంట్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది శ్రీముఖి. ఇలాంటి సమయంలో యాంకర్ శ్రీముఖి మరో అదిరిపోయే ఆఫర్ పట్టేసినట్లు తెలుస్తోంది. దీనికి కారణం తాజాగా యంగ్ హీరో నితిన్ 30వ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడింది. ఇందులో శ్రీముఖి పేరునూ ట్యాగ్ చేశారు. ఆ తర్వాత దీన్ని రీట్వీట్ చేసిన ఆమె.. ఇందులో చేరడం హ్యాపీగా ఉందని పేర్కొంది.

  యాంకర్ తొలిసారి అలా కనిపించబోతుందా?

  యాంకర్ తొలిసారి అలా కనిపించబోతుందా?

  నితిన్ హీరో బాలీవుడ్ మూవీ ‘అంధాధున్' రీమేక్ చేస్తున్నాడు మేర్లపాక గాంధీ. ఈ సినిమాలో ఈ యంగ్ హీరో అంధుడిగా కనిపించబోతున్నాడు. ఇందులో నభా నటేష్.. రాధిక ఆప్టే పాత్రను, తమన్నా.. టబు రోల్‌ను చేస్తున్నారు. అలాగే, శ్రీముఖి కూడా ఓ పాత్రను చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇందులో కనిపించబోతుందట ఈ హాట్ యాంకర్.

  English summary
  Sreemukhi is an Indian actress and television presenter who works in Telugu films. Sreemukhi started her career as a supporting actor in the 2012 film Julai. She made her debut as a lead actress in Prema Ishq Kaadhal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X