twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇలాంటి సమయంలోనూ అలా.. అదీ ఆయన సంస్కారం.. చిరంజీవిపై పరుచూరి కామెంట్స్

    |

    తెలుగు చిత్రసీమలో అజాత శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం పరుచూరి బ్రదర్స్ మాత్రమే. మెగా ఫ్యామిలీ, నందమూరి కుటుంబం ఇలా తేడాలేవీ లేకుండా అందరూ హీరోలు, వారి అభిమానులు కూడా పరుచూరి గోపాలరావు, పరుచూరి వెంకటేశ్వర రావును అభిమానిస్తుంటారు. ఎందుకంటే వారివురూ అందరూ హీరోలతో పనిచేశారు. అందరికీ ఇండస్ట్రీ హిట్‌లు ఇచ్చారు. పరుచూరి గోపాలకృష్ణ యూట్యూబ్‌లో పరుచూరి పలుకులు పేరిట సినీ పాఠాలను చెబుతుంటారు. అలా నాటి హీరోలతో ఉన్న బంధాన్ని అప్పుడప్పుడూ చెబుతుంటారు. తాజాగా చిరు గొప్పదనాన్ని చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో సారాంశం ఏంటో ఓ సారి చూద్దాం.

    యాభై ఏళ్ల వివాహా మహోత్సవం..

    యాభై ఏళ్ల వివాహా మహోత్సవం..


    ‘చిన్న చిరు జ్ఞాపకం నేను నా భార్య విజయలక్ష్మి దంపతులమై మే 29కి 50 సంవత్సరాలైంది. ఈ విషయాన్ని నేను సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నాను. ఎంతో మంది నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిష్ణంరాజు గారు అయితే మామిడిపళ్లు పంపించారు. అలాగే చాలామంది పళ్లు పంపించారు.

    చిరు కానుక..

    చిరు కానుక..


    కరోనా కాలం అని కనీసం గేట్ కూడా తీయకుండా ఇంట్లోనే ఉంటుండగా.. గేట్ దగ్గరకు వచ్చి కారు ఆగింది. ఎవరు బాబూ మీరు అని అడిగాను. చిరంజీవి గారి ఇంటి దగ్గర నుంచి అండి అని చెప్పి మామిడిపళ్లు బుట్టతో పాటు ఒక కవర్ ఇచ్చారు. నాకు ఆయనకు మధ్య 40 ఏళ్ళ అనుబంధంలో ఒక్కొక్కసారి ఒక్కో గిఫ్ట్‌ని నాకు ఇస్తుంటారు. అమెరికా వెళ్లినప్పుడు ఆయన నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ పెన్. ఆ పెన్‌ని నేను ఇప్పటికీ దాచుకున్నా'నని తెలిపారు.

    అలా కొనసాగుతూనే ఉంది..

    అలా కొనసాగుతూనే ఉంది..

    అలాగే విదేశాలకు వెళ్లిన ప్రతీసారి ఏదో ఒక బహుమతి ఇవ్వడం అలవాటని తెలిపారు. ‘ఇదంతా ఏంటంటే సత్కారం వేరు సంస్కారం వేరు.. ఒక మనిషిని ప్రేమ, అభిమానంతో గుర్తించుకోవడం లాంటిదే సంస్కారం అంటే. చిరంజీవిగారు నా పెళ్లి రోజున మామిడిపళ్లుతో పాటు ఒక కవర్ ఇచ్చారు.

    నా బిడ్డే నాకు పంపించినట్టు..

    నా బిడ్డే నాకు పంపించినట్టు..

    అదేరోజు ఫోన్ చేసి.. ‘నేను చిరంజీవి'ని అంటే నా భార్య ఫోన్ తీసింది. ‘అమ్మా సురేఖ మీ పెళ్లి రోజు కానుకగా చిరు కానుక పంపించింద'ని ఆయన నా భార్యతో మాట్లాడారు. ఆ తరువాత నేను మాట్లాడా.. 50 సంవత్సరాల మా పెళ్లి రోజుకి మీరు ఇచ్చిన కానుక.. మా ఇద్దరికీ పట్టు బట్టలు పంపించారు. నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యా.. నా బిడ్డే నాకు కానుకు పంపించినట్టు అనిపించింది. అదే మాట సురేఖతో చెప్పా.

    అదీ ఆయన సంస్కారం..

    అదీ ఆయన సంస్కారం..

    మా అనుబంధం గురించి ఎందుకు చెప్తున్నా అంటే సత్కారం వేరు.. సంస్కారం వేరు.. మనుషుల్ని ఎంతో మంది సత్కరిస్తారు.. కాని సంస్కారం అందరికీ దక్కదు. మా జీవితంలో ఎన్నో సలహాలు ఇచ్చారు చిరంజీవి. ఖైదీ, ఘరానా మొగుడు ఇలా 25 సినిమాలు రాస్తే.. 22 సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. అలాంటి అనుబంధం ఉంది కనుకనే.. ఈ కరోనా కాలంలో కూడా ఆయన నన్ను గుర్తుపెట్టుకుని 50 సంవత్సరాల పెళ్లి రోజు అని గుర్తుపెట్టుకుని సత్కారం చేయడం చిరంజీవి గారి సంస్కారం' అంటూ చిరుతో ఉన్న అనుబంధాన్ని మరోసారి అందరికీ చెప్పారు.

    English summary
    Chiranjeevi Gift To Paruchuri Gopala Krishna On His 50th Wedding Anniversary. Paruchuri Gopala Krishna Says About Megastar Chiranjeevi Through His YouTube Channel Paruchuri Palukulu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X