For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  టాలీవుడ్ ‘మగమహారాజు’ విజయబాపినీడు కన్నుమూత.. చిరంజీవిని మెగాస్టార్‌గా చేసిన..

  |

  తెలుగు చలన చిత్రసీమలో కుటుంబ కథా చిత్రాలకు పెద్ద పీట వేసిన ప్రముఖ దర్శకుడు విజయ బాపినీడు ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. విజయబాపినీడు 1936 సెప్టెంబర్ 22న ఏలూరుకు సమీపంలోని చాటపర్రులో సీతా రామాస్వామి, లీలావతి దంపతులకు జన్మించారు. ఏలూరు సీఆర్ఆర్ కాలేజీ నుంచి బీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత విజయ పత్రికకు ఎడిటర్‌గా పనిచేశారు. విజయ బాపినీడు మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు.

   గురువారం అంత్యక్రియలు

  గురువారం అంత్యక్రియలు

  విజయబాపినీడు అంతక్రియలు గురువారం హైదరాబాద్ మహా ప్రస్థానంలో నిర్వహిస్తారు.అమెరికాలో ఉన్న ఆయన పెద్దమ్మాయి రావడానికి సమయం పడుతున్న కారణంగా అంత క్రియలు గురువారం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విజయబాపినీడు పార్ధీవ దేహాన్ని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  విజయబాపినీడు జీవిత ప్రస్థానం

  విజయబాపినీడు జీవిత ప్రస్థానం

  తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రాకపూర్వం తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఆరోగ్యశాఖలో ఉద్యోగిగా పనిచేశారు. ఆ తర్వాత విజయబాపినీడు రచయితగా స్థిరపడ్డారు. ఆయన రాసిన కథ జగత్ జెట్టీలు అనే సినిమాగా వచ్చింది. ఆ తర్వాత మద్రాస్‌లో బొమ్మరిల్లు, విజయ మాస పత్రికలను ప్రారంభించి పాఠకలోకాన్ని ఊర్రూతలూగించారు.

   టాలీవుడ్ సినీ మగధీరుడి ప్రస్థానం

  టాలీవుడ్ సినీ మగధీరుడి ప్రస్థానం

  1976లో శ్యాంప్రసాద్ ఆర్ట్స్ సంస్థను ప్రారంభించి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. స్వర్గీయ దాసరి నారాయణరావు దర్శకత్వంలో యవ్వనం కాటేసింది అనే సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత డబ్బు, డబ్బు, డబ్బు, బొమ్మరిల్లు, ప్రేమపూజారి, విజయ, బొట్టుకాటుక అనే సినిమాలను తీశారు.

  చిరంజీవితో నిర్మించిన సినిమాలు ఇవే

  చిరంజీవితో నిర్మించిన సినిమాలు ఇవే

  డేరింగ్, డైనమిక్ హీరోగా పేరుతెచ్చుకొంటున్న చిరంజీవితో పట్నం వచ్చిన ప్రతివతలు సినిమాను రూపొందించారు. 1983లో రూపొందించిన మగమహారాజు సినిమా చిరంజీవికి బ్లాక్‌బస్టర్‌ను అందించింది. ఈ చిత్రం ద్వారానే ఆయన దర్శకుడిగా మారారు. ఆ తర్వాత చిరంజీవితో మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్‌బాస్ చిత్రాలను రూపొందించారు.

   మెగాస్టార్‌గా మారడానికి కృషి

  మెగాస్టార్‌గా మారడానికి కృషి

  చిరంజీవికి సూపర్ డూపర్‌ హిట్లు అందించి మెగాస్టార్‌గా, మాస్ హీరోగా నిలబెట్టడం వెనుక విజయ బాపినీడు కృషి ఎంతైనా ఉంది. మగమహారాజు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్ చిత్రాలు రికార్డులు తిరగరాశాయి. బిగ్‌బాస్ దారుణమైన పరాజయం పొందడంతో ఆ తర్వాత వారి కాంబినేషన్‌లో సినిమాలు రాలేదు. ఆ తర్వాత సినిమా పరిశ్రమలో చోటుచేసుకొన్న మార్పుల దృష్ట్యా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

   చిరంజీవి పేరుతో మ్యాగజైన్

  చిరంజీవి పేరుతో మ్యాగజైన్

  చిరంజీవితో విజయబాపినీడుకు అత్యంత అనుబంధం ఉంది. చిరంజీవిపై అభిమానంతో ఏకంగా చిరంజీవి అనే మాస పత్రికను నడిపారు. కేవలం చిరంజీవి గురించి, ఆయన సినిమాల గురించి మాత్రమే ప్రస్తావించే విధంగా చిరంజీవి మాస పత్రికను తీర్చిదిద్దారు.

   కృష్ణ, శోభన్‌బాబు లాంటి హీరోలతో

  కృష్ణ, శోభన్‌బాబు లాంటి హీరోలతో

  తెలుగు చలన చిత్ర సీమలో 22 చిత్రాలను నిర్మించారు. వాటిలో 12 చిత్రాలను ఇతర దర్శకులతో తీయగా, మిగితా సినిమాలను స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. శోభన్‌బాబు, కృష్ణ, రాజేంద్ర ప్రసాద్ లాంటి వారితో సినిమాలు రూపొందించారు. టాలీవుడ్‌లో చిరస్మరణీయంగా నిలిచిపోయే చిత్రాలను అందించారు.

   విజయబాపినీడు రూపొందించిన చిత్రాలు

  విజయబాపినీడు రూపొందించిన చిత్రాలు

  తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విజయ బాపినీడు రూపొందించిన చిత్రాలు ఇవే
  1. యవ్వనం కాటేసింది (1976)
  2. డబ్బు డబ్బు డబ్బు (1982)
  3. మగమహారాజు (1983)
  4. మహానగరంలో మాయగాడు )1984)
  5. హీరో (1984)
  6. భార్యమణి (1984)
  7. మహారాజు (1985)
  8. కృష్ణగారడి (1985)
  9. మగధీరుడు (1986)
  10. నాకు పెళ్లాం కావాలి (1987)
  11. ఖైదీ నంబర్ 786 (1988)
  12. దొంగకోళ్లు (1988)
  13. మహరాజశ్రీ మాయగాడు (1988)
  14. సుమంగళి (1989)
  15. జూ లకటక (1989)
  16. మహాజనానికి మరదలు పిల్ల (1989)
  17. గ్యాంగ్ లీడర్ (1990)
  18. వాలు జడ తోలు బెల్టు (1991)
  19. సీతాపతి చలో తిరుపతి (1992)
  20. బిగ్‌బాస్ (1995)
  21. ఫ్యామిలీ (1996)
  22. కొడుకులు (1998)

  English summary
  Gutta Bapineedu Chowdary also known as Vijaya Bapineedu, is no more. He was a magazine editor turned Indian film screenwriter and director, known for his works predominantly in Telugu Cinema.He has directed several block buster action films such as Maga Maharaju, Khaidi No.786, Gang Leader, and Magadheerudu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more