For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బిగ్ బాస్ లవర్స్‌కు శుభవార్త: సీజన్ 4పై స్టార్ మా సంచలన నిర్ణయం.. త్వరలో అధికారిక ప్రకటన.!

  By Manoj Kumar P
  |

  బిగ్ బాస్... ఉత్తరాది నుంచి పరిచయమైనప్పటికీ దక్షిణాదిలోనూ సక్సెస్‌ఫుల్ అయిన రియాలిటీ షో. కొందరు సెలెబ్రిటీలను ఓ ఇంటిలో పెట్టడం.. అక్కడ వాళ్ల వ్యవహారశైలిని బట్టి ఓటింగ్ జరపడం.. ప్రజాదరణ పొందిన వారు విన్నర్‌గా నిలవడం.. ఇదీ బిగ్ బాస్ టోటల్ కాన్సెప్ట్. ఇప్పటికే తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకుందీ ఈ రియాలిటీ షో. ఈ క్రమంలోనే నాలుగో సీజన్‌ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీజన్ 4 గురించి తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

  ఎంత హిట్ అయిందో.. అంతే వివాదమైంది

  ఎంత హిట్ అయిందో.. అంతే వివాదమైంది

  బిగ్ బాస్ షో ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఎంతగానో హిట్ అయింది. ఇక్కడి వాళ్లకు ఈ రియాలిటీ షో త్వరగానే అర్థమైపోయింది. దీంతో ఇది సూపర్ సక్సెస్ అయింది. అదే సమయంలో బిగ్ బాస్‌పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ షోను నిలిపి వేయాలని చాలా మంది కోర్టులను సైతం ఆశ్రయించడంతో పలుమార్లు వివాదాస్పమైంది.

  అందరిలోనూ అనుమానాలు.. చివరికిలా..

  అందరిలోనూ అనుమానాలు.. చివరికిలా..

  హిందీలో క్లిక్ అయినట్లు ఇక్కడ అవుతుందా..? తెలుగు వాళ్లు ఇలాంటి షోలను ఆదరిస్తారా..? సెలెబ్రిటీలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం నిజమేనా.? ఇది నిజంగా రియాలిటీ షోనేనా.? లేక డైరెక్షన్ చేస్తారా.? ప్రేక్షకులు ఓట్లు వేసిన వారినే నిజంగా విన్నర్ చేస్తారా.? ఎన్నో అనుమానాల నడుమ బిగ్ బాస్ తెలుగులో ప్రారంభం అయింది.

  బిగ్ బాస్ సక్సెస్ వెనుక ఆ ముగ్గురి పాత్ర

  బిగ్ బాస్ సక్సెస్ వెనుక ఆ ముగ్గురి పాత్ర

  బిగ్ బాస్ తెలుగులో ప్రేక్షకులకు చేరువై బాగా క్లిక్ అయిందంటే.. దానికి ప్రధాన కారణం ఆ షోను హోస్ట్ చేసిన స్టార్ హీరోలే అని చెప్పక తప్పదు. మరీ ముఖ్యంగా మొదటి సీజన్‌ను హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. బిగ్ బాస్ స్థాయిని పెంచాడు. ఆ తర్వాత నాని కూడా బాగానే మెప్పించాడు. ఇక, మూడో సీజన్‌ను నాగార్జున మరో లెవెల్‌కు తీసుకెళ్లాడు.

  నాలుగో సీజన్ హోస్ట్ ఆ స్టార్ హీరోనేనా.?

  నాలుగో సీజన్ హోస్ట్ ఆ స్టార్ హీరోనేనా.?

  మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది బిగ్ బాస్ రియాలిటీ షో. మొదటి మూడింటికి స్టార్ హీరోలే హోస్ట్ చేశారు. దీంతో నాలుగో సీజన్‌కు ఆ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్న దానిపై కొద్ది రోజులుగా ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, మహేశ్ బాబు పేర్లు తెరపైకి వస్తున్నాయి.

  సీజన్ 4పై స్టార్ మా సంచలన నిర్ణయం

  సీజన్ 4పై స్టార్ మా సంచలన నిర్ణయం

  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో సినిమా, టీవీ సీరియల్స్, షోల షూటింగులు ఆగిపోయాయి. అలాగే, థియేటర్లు సైతం మూత పడ్డాయి. అలాగే ప్రేక్షకులకు ఓటీటీ ఫ్లాట్‌ఫాంలతో పాటు టీవీలే దిక్కయ్యాయి. ఈ నేపథ్యంలో స్టార్ మా.. బిగ్ బాస్ నాలుగో సీజన్‌ను త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించుకుందని తాజా సమాచారం.

  Amala Paul Marriage With Mumbai Based Singer Bhavninder Singh
  బిగ్ బాస్ ప్రియులకు శుభవార్త.. త్వరలో ప్రకటన

  బిగ్ బాస్ ప్రియులకు శుభవార్త.. త్వరలో ప్రకటన

  ఈ నెల 31 వరకు షూటింగ్‌లు, సినిమా హాళ్లు బంద్ ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా నాలుగో సీజన్ ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వహకులు భావిస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. ఇందులో భాగంగానే హోస్ట్, కంటెస్టెంట్లను త్వరగా ఫైనలైజ్ చేయనున్నారని తెలిసింది. ఇవన్నీ వీలైనంత త్వరగా ముగించుకుని కొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన చేస్తారని సమాచారం.

  English summary
  The three seasons of Bigg Boss have been really successful for the makers as the show has now penetrated deep into the audience. The three hosts till now, NTR, Nani, and Nagarjuna have done a very good job and have set the bar high.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X