twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెమ్యునరేషన్ కోత మొదలైంది.. మన హీరోలు తోక ముడవాల్సిందే!

    |

    సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్.. సినిమా సినిమాకు పెరుగుతూనే ఉన్నాయి. కమర్షియల్ హిట్టు కొడితే చాలు స్టార్ యాక్టర్స్ పారితోషికాలు అకాశాన్ని అందుకుంటున్నాయి. హీరోలతో పాటు హీరోయిన్స్ అలాగే దర్శకులు కూడా ఈ మధ్య కాలంలో అత్యధిక వేతనాలు అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది ఆ విషయంలో తోక ముడవాల్సిందే అనే టాక్ నడుస్తోంది.

    Recommended Video

    Star Heros Remunerations Must Cut Down Due to Coronavirus Impact
    కరోనా దెబ్బ..

    కరోనా దెబ్బ..

    కరోనా వైరస్ కారణంగా దేశంలో లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. లాక్ డౌన్ డోస్ మరీంత పెరగడంతో ఆకలి బాధలు ఎక్కువవుతున్నాయి. ఇక ముఖ్యంగా చిత్ర పరిశ్రమలకు ఇది పెద్ద దెబ్బె అని చెప్పాలి. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీంతో నిర్మాతలు ఆర్థికంగా చాలా నష్టపోయే అవకాశం ఉంది.

    సినిమాలు వచ్చినా..

    సినిమాలు వచ్చినా..

    షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. ఒకవేళ మొదలైనా కూడా రిలీజ్ కావడానికి సరైనా సమయం కోసం మరింత కాలం వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే థియేటర్స్ ఓపెన్ కావడానికి ఇంకొన్ని నెలలు సమయం పట్టవచ్చు. ఒకవేళ వాటిని తెరిచినా కూడా జనాలు అంత ఈజీగా బయటకు రారని చెప్పవచ్చు. అంతా కొలుకోవడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది.

    ఆ విషయంలో వారు తగ్గాల్సిందే..

    ఆ విషయంలో వారు తగ్గాల్సిందే..

    ప్రస్తుతం పెద్ద బడ్జెట్ సినిమాలు చాలా వరకు మధ్యలోనే ఆగిపోయాయి. ఆర్థికంగా నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి హీరోలు స్టార్ దర్శకులు అలాగే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే టెక్నీషియన్స్ కొంత తగ్గాల్సిందే అంటున్నారు సినీ నిర్మాతలు. వారు అందుకున్న రెమ్యునరేషన్ విషయంలో ఆలోచింది ఎంతో కొంత తగ్గించుకొని నిర్మాతకు సహాయపడాలని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత సురేష్ బాబుతో పాటు మరికొంత మంది నిర్మాతలు వారి అభిప్రాయాలను తెలిపారు.

    సినిమాలు ఆగిపోయినట్లే..

    సినిమాలు ఆగిపోయినట్లే..

    కరోనా వైరస్ కారణంగా జనాలు బయటకురావడానికి ఇష్ట పడటం లేదు. దీంతో ఆ ఆలోచన సినిమాలపై పెద్ద ప్రభావమే చూపనుంది. ముందుగానే గ్రహించిన కొంత మంది నిర్మాతలు మొదలుపెట్టిన ప్రాజెక్టులను కూడా ఆపేస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికి మరో ఏడాది పాటు ఇబ్బందులు తప్పవని షూటింగ్స్ మొత్తం వాయిదా వేసుకుంటున్నారు. ఇక మరికొందరైతే సినిమాలను ఆపేసి పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు షూటింగ్స్ జోలికి వెళ్లకూడదని అనుకుంటున్నారు.

    English summary
    Not only the working class, but the Coronavirus has deeply impacted even the star actors, directors and technicians. Senior producer Suresh Babu said in a latest interview that actors, actresses, directors and other top technicians must cut down their fat paychecks in future to lessen the losses and burden the producers are going through due to the lockdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X