Don't Miss!
- Sports
అందుకే మణికట్టు విరిగినా.. ఒంటి చేత్తో బ్యాటింగ్ చేశా: హనుమ విహారి
- News
తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ స్థానంలో వందే మెట్రో ..!!
- Lifestyle
February Personality Traits: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఎలాంటి వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు!
- Technology
వాట్సాప్ కొత్త అప్డేట్ లో రానున్న కొత్త ఫీచర్లు! ఎలా పనిచేస్తాయో తెలుసుకోండి!
- Finance
Adani: పార్లమెంటుకు అదానీ పంచాయితీ.. విపక్షాల పట్టు.. మోదీ కాపాడతారా..?
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సారా ఆలీ ఖాన్ కావాలా? సారా టెండూల్కర్ కావాలా? శుభమన్ గిల్‌ను ఆటపట్టించిన నెటిజన్లు
క్రికెటర్లకు సినీ తారలకు మధ్య సంబంధాలు కొత్తేమి కాదు. ఏన్నో ఏళ్లుగా వారి మధ్య అఫైర్లు, డేటింగ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అజారుద్దీన్, సంగీత బిజ్లానీ, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వరకు బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా కేఎల్ రాహుల్, అతియా శెట్టి మధ్య అఫైర్ వ్యవహారం పీక్స్‌లో ఉంది. ఈ క్రమంలో క్రికెట్ ప్రపంచంలో దూసుకువచ్చిన యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ అఫైర్ విషయంలోకి మీడియాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. శుభమన్ క్రికెటర్ ట్రయాంగిల్ లవ్ స్టోరి విషయంలోకి వెళితే..

సచిన్ రికార్డు బ్రేక్
న్యూజిలాండ్‌తో భారత్ క్రికెట్ సిరీస్ జోరుగా సాగుతున్నది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్ సెంచరీలు కొట్టి భారత్‌కు విజయం అందించారు. శుభమన్ గిల్ వన్డేలో 208 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. అంతేకాకుండా సచిన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

సారా సారా అంటూ టీజింగ్
దాంతో వన్డేలో అరుదైన ఫీట్ సాధించిన శుభమన్ గిల్‌ను నెటిజన్లు, క్రీడాభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. డబుల్ సెంచరీ సాధించిన శుభమన్ గిల్‌ను స్టేడియంలో అభిమానులు టీజ్ చేశారు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శుభమన్‌ను చూసి సారా.. సారా అని ఆటపట్టించారు. అయితే సారా అంటూ ఆటపట్టించినా.. ఆనందంతో శుభమన్ గిల్ చేతులు ఊపుతూ ఉత్సాహంగా కనించాడు.

సారాతో ఉన్న ఆఫైర్లే కారణం
ఉప్పల్ స్టేడియంలో సారా సారా అంటూ ఆటపట్టించడం వెనుక బాలీవుడ్ హీరోయిన్ సారా ఆలీ ఖాన్, అలాగే సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో ఉన్న ఆఫైర్లే కారణంగా నిలిచింది. శుభమన్ గిల్ పేరు ఈ ఇద్దరి భామలతో ముడిపెడుతూ భారీగా మీడియాలో కథనాలు వచ్చాయి. దాంతో శుభమన్‌ను సారా అంటూ ఆటపట్టించారు.

సారా ఆలీ ఖాన్‌తో డేటింగ్
శుభమన్ గిల్‌కు గతంలో సారా ఆలీ ఖాన్‌తో మంచి రిలేషన్ ఉందనేది కాదనలేని నిజం. వారిద్దరూ ముంబైలో పలు పార్టీలు, రెస్టారెంట్లలో చెట్టాపట్టాలేసుకొని కనిపించారు. దాంతో వారి మధ్య రసవత్తరంగా అఫైర్ సాగుతుందని ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. కొద్ది నెలల క్రితం సారా ఆలీ ఖాన్, శుభమన్ గిల్ అఫైర్ హాట్ టాపిక్‌గా మారింది.

సారా టెండూల్కర్‌తో అఫైర్
అయితే శుభమన్ గిల్ తన డేటింగ్, అఫైర్ వార్తలకు చెక్ పెడుతూ.. ఏకంగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో సన్నిహితంగా కనిపించడం మొదలుపెట్టాడు. సారా టెండూల్కర్, శుభమన్ గిల్ మధ్య రిలేషన్‌పై భారీగా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో డబుల్ సెంచరీ చేసిన శుభమన్ గిల్‌ను సారా సారా అని ఆటపట్టించారు.