twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీడిన మిస్టరీ.. సురేష్ ప్రొడక్షన్స్ లోగో వెనుక ఇదీ అసలు కథ

    |

    సినిమా నిర్మాణ రంగంలో దగ్గుబాటి వారిది అందిన చేయి. ఎన్నో ఏళ్ల క్రిందటే నిర్మాణ సంస్థలు ప్రారంభించి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను రూపొందించిన ఘనత దగ్గుబాటి వారిది. ఇక దేశంలోని నిర్మాణ సంస్థల్లోకెల్లా దివంగత దగ్గుబాటి రామానాయుడు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్‌ ఎంతో ప్రత్యేకమైంది. ఈ బ్యానర్‌కి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. తన కొడుకు సురేష్ బాబు పేరు మీదుగా ఈ నిర్మాణ సంస్థ ప్రారంభించిన రామానాయుడు.. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు.

    ఈ బ్యానర్ లోగో నేటికీ అందరినీ ఆకట్టుకుంటుంటోంది. అయితే ఎస్ పీ అనే రెండక్షరాల ఈ లోగోపై ఉండే ఇద్దరు పిల్లలు బొమ్మలేనా? లేక మనుషులా? అయితే వారెవరు? అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఈ సక్సెస్ ఫుల్ లోగో గురించిన ఆసక్తికర విషయాలు చెబుతూ, ఆ ఇద్దరు పిల్లలు ఎవరనేది రివీల్ చేశారు దివంగత రామానాయుడు తనయుడు దగ్గుబాటి సురేష్ బాబు.

    Daggubati Suresh Babu gives clarity on Suresh Productions Logo

    సురేష్ బాబు మాట్లాడుతూ.. ''నేను తమ్ముడు వెంకటేష్ స్కూల్ కు వెళ్తున్న సమయంలో నాన్న గారు పిలిచారు. అప్పటికే అక్కడ ఎస్ మరియు పీ అనే రెండు అక్షరాలు సిద్ధం చేసి ఉన్నారు. చెరో అక్షరంపై ఎక్కమని ఆయన అన్నారు. ఆయన సూచన మేరకు వెంటనే నేను పీ అక్షరంపై తమ్ముడు వెంకటేష్ ఎస్ అక్షరంపై నిల్చున్నాము. ఆ వెంటనే కెమెరా క్లిక్ అనిపించింది. దానినే మా సురేష్ ప్రొడక్షన్స్ లోగోగా తయారు చేయించారు నాన్నగారు. అది యాదృశ్చికంగా జరిగినప్పటికీ 'ఎస్' అనే అక్షరం పై నిల్చున్న వెంకటేష్ స్టార్ హీరో అయ్యాడు.. 'పి' అనే అనే అక్షరంపై నిల్చున్న నేను ప్రొడ్యూసర్ అయ్యాను'' అని అన్నారు.

    నాన్న గారు సురేష్ ప్రొడక్షన్స్ లో రూపొందిన సినిమాల రోజూ వారి కలెక్షన్స్ ను నాకు ఇస్తే వాటిని నేను ఒక నోట్ బుల్ లో ఎక్కించాల్సి ఉండేది. అలా నా సినిమా ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇక నా కాలేజీ రోజుల్లోనే సినిమా ప్రొడక్షన్ వ్యవహారాల్లోకి మరింత లోతుగా దిగాను అని సురేష్ బాబు చెప్పారు.

    English summary
    In latest interview Suresh Productions head Daggubati Suresh Babu says about the Logo history of their Suresh Productions. In this logo the two childrens are
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X