Don't Miss!
- News
ఢీ అంటే ఢీ అంటున్న రెండు పవర్ సెంటర్లు?
- Finance
Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? కొత్త టాక్స్ సిష్టం బెటరా..? పాతదే మేలా..?
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
జాతిరత్నాలు వెరైటీ ప్రమోషన్స్.. డైరెక్టర్ క్రేజ్ మామూలుగా లేదు!
జాతిరత్నాలు సినిమాకు ఏ రేంజ్‌లో ప్రమోషన్స్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. నవీన్ పొలిశెట్టి, ఫరియా, డైరెక్టర్ అనుదీప్ కలిసి బుల్లితెరపై పలు షోల్లో గెస్టులుగా వచ్చి సినిమాకు సంబంధించి బాగా కష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా డైరెక్టర్ అనుదీప్ గత వారం క్యాష్ షోలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆయన అక్కడ చేసిన అల్లరి, వేసిన పంచ్‌లు, సుమను ఆడుకున్న విధానం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
అసలు సిసలైన జాతి రత్నం అంటే డైరెక్టర్ అనుదీప్ అని అందరికీ అర్థమైంది. అలా అనుదీప్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యాడు. నేటి సాయంత్రం వరంగల్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. దీన్ని కూడా వెరైటీగా ప్రమోట్ చేస్తోంది చిత్రయూనిట్. అనుదీప్ పేరుతో జోగిపేట జాతిరత్నం అంటూ క్యాష్ షోలో చేసిన సందడిని గుర్తుకు చేస్తూ ఓ పేపర్ కట్టింగ్‌ను వదిలారు.

అనుదీప్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేశారు.. వరంగల్‌లో ఈవెంట్ ఉందని చెబుతూ ఓ ప్రెస్ నోట్‌ను వదిలారు. ప్రభాస్ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండను తీసుకొచ్చి మరింత హైప్‌ను తీసుకురాబోతోన్నారు. మార్చి 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ మూవీ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరిగినట్టు తెలుస్తోంది.