twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ కోసం బ్లాక్ లో 10 వేలు పెట్టి సినిమా టికెట్.. షాక్ అయ్యా: సీనియర్ డైరెక్టర్

    |

    మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినిమా చేసినా కూడా మొదటి షో మొదటి రోజు చూడాలి అని ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా మాస్ కమర్షియల్ సినిమాలకు ఉండే క్రేజ్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెగాస్టార్ కూడా ఫ్యాన్స్ కు తగ్గట్లుగానే ఎలివేషన్స్ ఉన్న సినిమాలు కూడా ఎక్కువగానే చేశారు. అయితే ఒక అభిమాని మాత్రం మెగాస్టార్ సినిమా చూడడం కోసం బ్లాక్ లో పది వేలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసినట్లు ఇటీవల దర్శకుడు బి.గోపాల్ తెలియజేశారు.

    థియేటర్ వద్ద క్యూలు..

    థియేటర్ వద్ద క్యూలు..

    మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి సినిమా చేసినా కూడా మొదటి రోజు మొదటి షో చూడాల్సిందేనని అర్ధరాత్రి నుంచి థియేటర్ వద్ద క్యూలు కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి మొదటిరోజు మొదటి షో టిక్కెట్లు దొరకాలి అంటే చాలా కష్టంగా ఉండేది.

    మెగా క్రేజ్ పై బి.గోపాల్ కామెంట్

    మెగా క్రేజ్ పై బి.గోపాల్ కామెంట్

    అభిమానులు చొక్కాలు చింపుకొని థియేటర్స్ వద్ద టికెట్ల కోసం పోరాడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇక రీసెంట్ గా దర్శకుడు బి.గోపాల్ కూడా మెగాస్టార్ క్రేజీ ఏ స్థాయిలో ఉంటుందో అనే విషయంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఒక సినిమా కోసం మొదటి రోజు మొదటి షో చూడాలి అనే ఒక అభిమాని బ్లాక్ లో టిక్కెట్లు కొన్న విధానానికి షాక్ అయినట్లు ఆయన ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు.

    ఇంద్ర బాక్సాఫీస్ సెన్సేషన్

    ఇంద్ర బాక్సాఫీస్ సెన్సేషన్


    మెగాస్టార్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్స్ గా ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఇక అలాంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ లో ఇంద్ర సినిమా కూడా టాప్ లిస్టులో ఉంటుందని చెప్పవచ్చు. సోనాలి బింద్రే ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదటి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన మూవీ ఇదే. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అప్పట్లో 30కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించింది.

    షూటింగ్ లో అలా..

    షూటింగ్ లో అలా..


    మెగాస్టార్ చిరంజీవి బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన ఇంద్ర సినిమా 2002 లో భారీ స్థాయిలో విడుదలైంది. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు బి.గోపాల్ ఆ రోజుల్లో జరిగిన సంచలనాలను అలాగే షూటింగ్ సందర్భాలు కూడా గుర్తుచేసుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ లో డైలాగ్స్ చెబుతూ ఉంటే కట్ చెప్పకుండా అలాగే ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు.

     ప్రత్యేక బందోబస్తు

    ప్రత్యేక బందోబస్తు


    మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.. అనే డైలాగ్ మెగాస్టార్ చెబుతూ ఉంటే షాకయ్యాను అని ముఖ్యంగా కాశీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన షెడ్యూల్ అయితే చాలా అద్భుతంగా సాగింది అని అన్నారు. ఆ రోజుల్లో మెగాస్టార్ సినిమా చూడడం కోసం ప్రేక్షకులు భారీ స్థాయిలో ధియేటర్ రావడంతో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చిందట.

    బ్లాక్ టికెట్స్.. పది వేల రూపాయలు..

    బ్లాక్ టికెట్స్.. పది వేల రూపాయలు..

    అయితే అప్పట్లో 50 రూపాయలు కూడా లేని బాల్కాని టికెట్ల కోసం 500 పెట్టినా కూడా చాలా ఎక్కువ. అయితే మదనపల్లి లోని ఒక అభిమాని మాత్రం మొదటి రోజు సినిమా చూడటం కోసం ఐదు టికెట్లకు ఏకంగా పది వేల రూపాయలు పెట్టి బ్లాక్ టికెట్లు కొన్నట్లు తెలిసిందని, ఆ విషయం తెలియగానే నేను షాక్ అయ్యాను అని బి.గోపాల్ గుర్తుచేసుకున్నారు.

    Recommended Video

    Kinnerasani Movie Theatrical Trailer | Filmibeat Telugu
    పోలీస్ అధికారులతో డిన్నర్

    పోలీస్ అధికారులతో డిన్నర్

    ఇక ఇంద్ర సినిమా విడుదల సక్సెస్ అనంతరం ఒక లేడీ ఐపీఎస్ అధికారం తమకు డిన్నర్ కూడా ఇచ్చారని అయితే సాధారణంగా అలాంటి సినిమా విడుదలైతే జనాలను కంట్రోల్ చేయడానికి ఎస్ఐ స్థాయి వరకు వెళ్తే సరిపోతుంది, కానీ సినిమా ప్రబంజనానికి ఎస్పీ స్థాయి వాళ్ళము వెళ్లాల్సి వచ్చినట్లు ఐపీఎస్ అధికారి తనతో చెప్పినట్లు బి.గోపాల్ తెలియజేశారు

    English summary
    Director b.gopal about indra movie golden days
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X