For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Happy Birthday Trivikram: త్రివిక్రమ్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ఇప్పుడు వారి కంటే ఎక్కువగా?

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నేడు 49 వసంతంలోకి అడుగు పెడుతున్నారు. భీమవరం నుంచి వచ్చిన త్రివిక్రమ్ మొదటి నుంచి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో దర్శకుడిగా స్టార్ హోదాను అందుకుంటూ వస్తున్నారు. పక్కా కమర్షియల్ సినిమా అని కాకుండా ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ను హైలెట్ చేసుకుంటూ వస్తున్నాడు. కేవలం డైరెక్షన్ తోనే కాకుండా స్క్రీన్ప్లే మాటలతో కూడా సినిమా రిజల్ట్ ను మేనేజ్ చేయవచ్చు అని చాలా సార్లు రుజువు చేశాడు. అయితే ఆయన కెరీర్లో మొదట్లో ఏ స్థాయిలో పారితోషికం అందుకున్నాడో తెలిస్తే కొంత ఆశ్చర్య పోకుండా ఉండలేరు.

   చిన్నప్పటి నుంచే..

  చిన్నప్పటి నుంచే..

  1971 నవంబర్ 7 న జన్మించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చిన్నప్పటి నుంచి మంచి పుస్తకాలను చదువుకోవడం బాగా అలవాటు చేసుకున్నాడు. కొత్త పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి అంటే త్రివిక్రమ్ వాటిపై ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ ఉండేవాడు. అలాగే సినిమాలు కూడా అతనిపై ప్రభావం చూపాయి. దీంతో తప్పకుండా ఇండస్ట్రీలో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకోవాలని సునీల్ తో పాటు హైదరాబాద్ లో అడుగుపెట్టాడు.

   అందుకే మొదట్లో రైటర్ గా

  అందుకే మొదట్లో రైటర్ గా

  సినిమాల్లో అవకాశాలు అందుకోవాలి అని త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట్లో చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ ఎవరు కూడా అంతగా పట్టించుకోలేదు. అయితే దర్శకుడు అవ్వడం కంటే ముందు రచయితగా మంచి గుర్తింపు అందుకోగలిగితే సక్సెస్ కావచ్చు అని అనుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో దర్శకుడు అవ్వాలంటే పది పదిహేను ఏళ్ళ సమయం పట్టేది అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ డైరెక్టర్ వరకు జర్నీ చేయడం అంటే చాలా టైం పడుతుందని రైటర్ గా మారాడు.

  స్కూల్ టీచర్ గా

  స్కూల్ టీచర్ గా

  కొన్నేళ్ల పాటు ఒక స్కూల్లో టీచర్ గా కూడా పని చేశాడు.

  త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే ముందుగానే సునీల్ సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ మంచి అవకాశాలు అందుకుంటూ వచ్చాడు. నటుడు గౌతమ్ రాజు పిల్లలకు ట్యూషన్ చెప్తే డబ్బులు వస్తాయి అని చెప్పడంతో ఆ సపోర్ట్ లోనే ఇండస్ట్రీలో అవకాశల కోసం తిరగాలని అనుకున్నాడు. అయితే ఒకసారి గౌతంరాజు డైరెక్టర్ విజయ భాస్కర్ కు పరిచయం చేయడంతో అతని దశ తిరిగింది.

  అలా మొదటి రెమ్యునరేషన్

  అలా మొదటి రెమ్యునరేషన్

  మొదట కొన్ని సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు లేకుండానే పని చేయాల్సి వచ్చింది. ఒక హిట్ సినిమాకు త్రివిక్రమ్ క్లైమాక్స్ డైలాగ్స్ రాయడంతో అప్పట్లో ఈ కారణంగానే సినిమా హిట్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. ఆ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కేవలం రెండు వేలు మాత్రమే పారితోషికం తీసుకున్నాడట. అప్పటి నుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం చాలా మంది దర్శకులు చర్చలు జరిపారు. కానీ విజయ భాస్కర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను బయటకు వదలకుండా తన తో ఎక్కువగా ట్రావెల్ చేసే విధంగా డీల్ సెట్ చేసుకుంటూ వచ్చాడు.

  అలా దర్శకుడిగా..

  అలా దర్శకుడిగా..

  మొదటి సినిమా స్వయంవరం సక్సెస్ కావడంతో ఆ తర్వాత నిన్నే పెళ్ళాడతా, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, వాసు, సినిమాలకు మాటలు రాసే అవకాశం దక్కింది. సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు దర్శకుడిగా మారే అవకాశం మూడేళ్లకే వచ్చేసింది. 2002లో నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన త్రివిక్రమ్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు కేవలం మాటలు మాత్రమే కాకుండా సినిమాలు డైరెక్ట్ చేసుకుంటూ వచ్చాడు.

  Manu Charitra Trailer Preface Video | Shiva Kandukuri, Megha Akash
  ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే..

  ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే..

  కెరీర్లో అతడు, జల్సా, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి, అఆ అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా ఒక్క సినిమాకు 20 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాకు మాటలు అందిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ నెక్స్ట్ మహేష్ బాబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

  English summary
  Director Trivikram srinivas first remuneration as ghost writer
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X