మంత్రి బైకెక్కిన యంగ్ హీరోయిన్.. రోడ్లపై షికారు చేస్తూ! ఇదీ మ్యాటర్..

Recommended Video

Eesha Rebba & Puvvada Ajay Kumar Bike Ride

తెలంగాణ రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బైక్‌పై యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా షికార్లు కొట్టింది. ఇద్దరూ కలిసి బైక్‌పై అలా వెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ మంత్రి బైక్ హీరోయిన్ ఈషా రెబ్బా ఎందుకు ఎక్కవలసి వచ్చింది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

రోడ్డు భద్రత వారోత్సవాలు

రోడ్డు భద్రత వారోత్సవాలు

రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాహనదారులు పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించేందుకు గాను రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ వారోత్సవాల్లో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బైక్‌ ఎక్కింది హీరోయిన్ ఈషా రెబ్బా.

ప్రత్యేక ఆకర్షణ హీరోయిన్ ఈషా రెబ్బా

ప్రత్యేక ఆకర్షణ హీరోయిన్ ఈషా రెబ్బా

జనవరి 27వ తేదీ నుండి ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఈ రోడ్డు భద్రత వారోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా సోమవారం హెచ్ఎమ్‌డీఏ మైదానంలో వారోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ ఈషా రెబ్బా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మంత్రి పువ్వాడ అజయ్.. వెనుక సీట్లో యంగ్ హీరోయిన్

మంత్రి పువ్వాడ అజయ్.. వెనుక సీట్లో యంగ్ హీరోయిన్

ఇక ఈ వారోత్సవాల్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు ఎలాంటి భద్రతా నియమాలను పాటించాలో వివరించారు. ఈ విషయమై అవగాహన కల్పించడంలో భాగంగా స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ హెల్మెట్ పెట్టుకుని బైక్ డ్రైవింగ్ చేశారు. ఆయన వెనుక సీట్లో హీరోయిన్ ఈషా రెబ్బా కూడా హెల్మెట్ ధరించి కూర్చుంది.

ఇలా చేస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం

ఇలా చేస్తేనే ప్రమాదాల నివారణ సాధ్యం

ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ''రోజు రోజుకూ సమాజంలో వాహనాల సంఖ్య పెరగడంతో పాటు రోడ్డు యాక్సిడెంట్‌‌లు పెరిగిపోతున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు భద్రత జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారు. ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్‌ను ధరించాలి. కారు లాంటి భారీ వాహనాలు నడిపేటప్పుడు సీట్‌ బెల్టు పెట్టుకోవాలి. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపకూడదు. అందరూ ట్రాఫ్డిక్ రూల్స్ పాటించాలి. అప్పుడే ప్రమాదాల నివారణ సాధ్యం'' అని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X