Just In
- 24 min ago
RRR నుంచి అదిరిపోయే అప్డేట్: గుడ్ న్యూస్ చెప్పిన ఎన్టీఆర్, చరణ్.. వాళ్లిచ్చే సర్ప్రైజ్ అదే!
- 2 hrs ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 2 hrs ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 3 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
Don't Miss!
- News
ఇంగితజ్ఞానం ఉన్నవాళ్లు ఆ పనిచేయరు... దమ్ముంటే కేసీఆర్ దానిపై ప్రకటన చేయాలి : సంజయ్ సవాల్
- Finance
Gold prices today: రూ.49,000 స్థాయికి బంగారం ధరలు, వెండి స్వల్పంగా అప్
- Sports
మెల్బోర్న్ సెంచరీ చాలా స్పెషల్.. అందుకే సిడ్నీలో మైదానం వీడలేదు: అజింక్యా రహానే
- Automobiles
కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- Lifestyle
జుట్టు పెరగడానికి నూనె మాత్రమే సరిపోదు, ఇక్కడ మోకాలి పొడవు జుట్టు యొక్క రహస్యం ఉంది
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్లాప్ లో ఉన్న ఒకప్పటి స్టార్ దర్శకులకు గోల్డెన్ ఛాన్సులు.. ఇప్పుడైనా హిట్ కొడతారా?
ఒక సినిమా సక్సెస్ అయితే ఎక్కువగా ఆ క్రెడిట్ హీరోలతో పాటు దర్శకులకే దక్కుతుంది. అదే విధంగా ప్లాప్ అయితే మాత్రం దర్శకుడిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరుసగా డిజాస్టర్స్ ఎదురైతే మళ్ళీ సెట్టవ్వడం అనేది చాలా కష్టమైన పని. అయితే ఇటీవల కాలంలో ఒక ముగ్గురు దర్శకులు మాత్రం మంచి అవకాశాలు అందుకున్నారు. అలాంటి వారిపై ఒక లుక్కేస్తే..

ఎన్టీఆర్ నమ్మినప్పట్టికి..
మొదట ఆంధ్రవాలా సినిమాను రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న మెహర్ రమేష్ టాలెంట్ కు ఎన్టీఆర్ అప్పట్లో ఫిదా అయ్యాడు. ఆ తరువాత ఒక్కడు కూడా కన్నడలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇక ఎన్టీఆర్ అయితే ప్లాప్ సినిమాను రీమేక్ చేసి సక్సెస్ కొట్టడు అని ఎంతో నమ్మకంతో కంత్రి సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమా హిట్టవ్వలేదు. బిల్లా చేసిన తరువాత శక్తి కూడా డిజాస్టర్ అయ్యింది.

ఈ సారి మెగాస్టార్ నమ్మాడు
ఇక దర్శకుడి పనైపోయిందని అనుకున్న తరుణంలో షాడో తీశాడు. ఆ సినిమా కూడా బెడిసికొట్టింది. ఇక కోలుకోవడం కష్టం అనుకోగా అనుకోకుండా మెగాస్టార్ తో తమిళ్ వేదళం రీమేక్ ను తెరకెక్కించే అవకాశం అందుకున్నాడు. ఈ సినిమా ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మరి మెహర్ రమేష్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

శ్రీను వైట్ల డీ.. డబుల్ డోస్
వెంకీ, డీ, దుబాయ్ శీను, దూకుడు వంటి సినిమాలతో మంచి హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల ఆ తరువాత ఆగడు నుంచి వరుస అపజయలతో డీలా పడ్డాడు. సెంటిమెంట్ గా రవితేజతో మరోసారి చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా కూడా పెద్దగా హిట్టవ్వలేదు. ఇక ఇప్పుడు విష్ణుతో డీ సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

బొమ్మరిల్లు భాస్కర్.. ఆశలన్నీ అఖిల్ పైనే..
ఇక మరొక ముఖ్యమైన దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. బొమ్మరిల్లు సినిమా తరువాత పరుగు సినిమాతో మంచి దర్శకుడిగా క్రేజ్ అందుకున్న భాస్కర్ ఆ తరువాత చేసిన ఆరెంజ్ సినిమాతో ఒక్కసారిగా డీలా పడ్డాడు. ఒంగోలు గిత్త అయితే దారుణమైన రిజల్ట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.