twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy birthday Gopichand: 8 ఏళ్లకే తండ్రి మరణం, అన్నయ్య యాక్సిడెంట్.. ఒంటరిగానే గెలిచిన గోపిచంద్..

    |

    అదృష్టాన్ని కాకుండా కష్టాన్ని నమ్ముకుంటే ఎంతటి వారైనా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చాలా తక్కువ మంది జీవితాలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. అందులో హీరో గోపిచంద్ జీవితం కూడా ఒకటి. పైకి నవ్వుతూ చాలా సింపుల్ గా కనిపించే గోపిచంద్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. అతని నవ్వు వెనక ఎన్నో విషాద ఘటనలు కూడా ఉన్నాయి. నేడు ఈ స్టార్ హీరో 41వ పుట్టినరోజు.. ఒకసారి అతని కెరీర్ పై ఒక లుక్కేస్తే..

    మంచి హీరో..

    మంచి హీరో..

    టాలీవుడ్ మాస్ హీరోగా తనకంటూ ఒక క్రేజ్ అందుకున్న గోపిచంద్ అంటే అందరికి ఇష్టమైన హీరో. కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పని తాను చెలుకుంటు వెళతాడు. ఇక ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో అయినా గోపిచంద్ ని చాలా బాగా ఇష్టపడతారు. ముఖ్యంగా ప్రభాస్ అతనికి ప్రాణ స్నేహితుడు అని ప్రతి ఒక్కరికి తెలుసు. గోపిచంద్ హీరోగా ఎదగడానికి చాలానే కష్టపడ్డాడు. మొదట విలన్ గా చేసి ఆ తరువాత హీరోగా సక్సెస్ అయ్యాడు.

    ఆ రెండు మరణాలు..

    ఆ రెండు మరణాలు..

    గోపిచంద్ హీరో కాకముందు 8 ఏళ్లకే మరణం విలువ తెలుసుకున్నాడు. నేటి భారతం, ప్రతి ఘటన వంటి విప్లవాత్మక చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు టి.కృష్ణ అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే గోపిచంద్ చిన్నప్పుడే ఆయన మరణించాడు. అనంతరం గోపిచంద్ సోదరుడు ప్రేమ్ చంద్ దర్శకుడు కావాలని మొదటి సినిమాను స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే యాక్సిడెంట్ లో మరణించాడు.

    అన్నయ్య మరణం..

    అన్నయ్య మరణం..

    అప్పుడు గోపి రష్యాలో ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వీసా సమస్య వల్ల కనీసం అన్నయ్య అంత్యక్రియలకు కూడా రాలేకపోయాడు. గోపిచంద్ కి ఒక సోదరి కూడా ఉంది. ప్రస్తుతం ఆమె డేంటిస్ట్ గా వర్క్ చేస్తోంది. ఆ విధంగా గోపిచంద్ తన అన్నయ్య, తండ్రి మరణాలతో చాలా కృంగిపోయాడు. దీంతో కుటుంబం బాధ్యత తీసుకోవాలని అలాగే హీరోగా ట్రై చేయాలని అనుకున్నాడు.

    మొదటి డిజాస్టర్..

    మొదటి డిజాస్టర్..

    ఇండస్ట్రీలో తండ్రి మంచితనం వల్ల గోపిచంద్ కి మొదటి సినిమా అవకాశం తొందరగానే వచ్చింది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తొలివలవు సినిమా చేశాడు. కానీ ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. మళ్ళీ బిజినెస్ వైపు లేదా జాబ్ చేయాలని అనుకున్నాడు. ఈటీవీలో న్యూస్ రీడర్ గా కూడా కొన్ని రోజులు వర్క్ చేశాడు. అనంతరం మళ్ళీ సినిమాల వైపు వెళ్లాలని ఈ సారి విలన్ గా ట్రై చేశాడు.

     నటుడిగా క్లిక్కవ్వడంతో..

    నటుడిగా క్లిక్కవ్వడంతో..

    జయం సినిమాలో విలన్ గా నటించి మంచి క్రేజ్ అందుకున్న గోపిచంద్ నటుడిగా క్లిక్కవ్వడంతో ఆ తరువాత నిజం, వర్షం సినిమాల్లో కూడా విలన్ గా చేసి క్రేజ్ పెంచుకున్నాడు. ఇక 2004లో యజ్ఞం సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి మాస్ హీరోగా ఎదిగాడు. అప్పటి నుంచి జయాపజయాలను లెక్క చేయకుండా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు గోపిచంద్.

    Recommended Video

    Netra Movie Audio Launch || Aishwarya || Satyanand ||
    మళ్ళీ తిరిగొచ్చిన అన్నయ్య, నాన్న..

    మళ్ళీ తిరిగొచ్చిన అన్నయ్య, నాన్న..

    గోపిచంద్ 2013లో హీరో శ్రీకాంత్ దగ్గరి బంధువైన రేష్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా జన్మించారు. మళ్ళీ తన అన్నయ్య, నాన్న తిరిగి వచ్చారని గోపిచంద్ చాలా సంతోషంగా చెప్పుకుంటాడు. ఏదేమైనా గోపిచంద్ తన జీవితంలో ఎన్నో బాధలను చూసి ఒంటరిగా గెలిచిన తీరు అందరికి ఒక ఆదర్శమనే చెప్పాలి.

    English summary
    Gopichand is a favorite hero of Tollywood fans. He goes about his work without going to the sidelines. Gopichand is well liked by any star hero in the industry. Everyone knows that Prabhas is a good friend to him. Gopichand worked very hard to grow into a hero. He first became a villain and then a hero.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X