Just In
- 12 min ago
RRR రిలీజ్ డేట్ వల్ల మరో తలనొప్పి.. అసలైన వాళ్లే వద్దంటే డేట్ తప్పకుండా మార్చాల్సిందే..
- 1 hr ago
మహేష్ చేయాల్సిన పవర్ఫుల్ కథలో పవన్ కళ్యాణ్.. పదేళ్ల తరువాత సెట్స్ పైకి..
- 1 hr ago
క్రాక్ హిట్టు కాదు.. అంతకు మించి.. రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ కలెక్షన్స్
- 2 hrs ago
బుట్టబొమ్మ ఫుల్ బిజీ.. కుదరకపోయినా మెగా హీరో కోసం ఒప్పుకుందట
Don't Miss!
- Finance
రూ.5, రూ.10, రూ.100 నోట్ల రద్దు: RBI ఏం చెప్పిందంటే?
- News
Bigg Boss కంటెస్టెంట్ నటి ఆత్మహత్య , కారణం ఇదే..!
- Automobiles
సరికొత్త 2021 కెటిఎమ్ 890 డ్యూక్ ఆవిష్కరణ; ఇది భారత్‌కు వస్తుందా..?
- Sports
India vs England: వారికి ఐదు రోజులు.. వీరికి మాత్రం మూడు రోజులే!!
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Happy Birthday Gunasekhar: మహేష్‌కు స్టార్ స్టేటస్.. చిరంజీవికి బ్లాక్‌బస్టర్.. ఎన్టీఆర్, అనుష్కతో
టాలీవుడ్‌లో సృజనాత్మకత ఉన్న నేటితరం దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. 1992లో లాఠీ చిత్రంతో సినిమా పరిశ్రమలో ప్రవేశించిన గుణశేఖర్ ఆ తర్వాత తెలుగు తెరకు అద్భుతమైన చిత్రాలను అందించారు. పలువురు హీరోలకు స్టార్ స్టేటస్ అందించారు. అంతేకాకుండా అవార్డులు, రివార్డులను సొంతం చేసుకొన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు విజయాలను అందించిన గుణశేఖర్ జన్మదినం జూన్ 2వ తేది. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ..

గుణశేఖర్ రూపొందించిన చిత్రాలు
ఇప్పటి వరకు గుణశేఖర్ తన కెరీర్‌లో లాఠీ, సొగసు చూడ తరమా? రామాయణం, చూడాలని ఉంది. మనోహరం, మృగరాజు, ఒక్కడు, అర్జున్, సైనికుడు, వరుడు, నిప్పు, రుద్రమదేవి చిత్రాలను తెరకెక్కించారు. తాను రూపొందించిన చిత్రాల్లో అత్యధికంగా ఘన విజయాలు, రికార్డు కలెక్షన్లు సాధించినవి రికార్డులు సృష్టించాయి.

మహేష్‌ను కమర్షియల్ బాట పట్టించి
సూపర్‌స్టార్ మహేష్ బాబును కమర్షియల్ హీరోగా, స్టార్ స్టేటస్ ఇచ్చిన దర్శకుడిగా గుణశేఖర్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. గుణ శేఖర్ రూపొందించిన ఒక్కడు చిత్రం అప్పట్లో రికార్డు కలెక్షన్లను వసూలు చేసింది. ఆ సినిమాతోనే మహేష్ కమర్షియల్ హీరోగా నిలదొక్కుకున్నారు. ఇక చిరంజీవితో చూడాలని ఉంది మూవీ తీసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నారు.

అవార్డులు, రివార్డులు
మహేష్ నటించిన ఒక్కడు చిత్రానికి 2003లో నంది అవార్డుల పంట పండించారు. మొత్తం ఎనిమిది కేటగిరిలో ఎనిమిది నందులు, ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో నాలుగు అందుకొన్నారు. ఒక్కడు చిత్రానికి బెస్ట్ డైరెక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకొన్న సంగతి తెలిసిందే. ఇక తన కెరీర్‌లో అనుష్మతో చారిత్రాత్మక చిత్రం రుద్రమదేవిని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి ప్రేక్షకులను మెప్పించారు.

జూనియర్ ఎన్టీఆర్‌తో
ఇక జూనియర్ ఎన్టీఆర్‌తో తీసిన బాల రామాయణం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. ఈ చిత్రానికి బెస్ట్ చిల్డ్రన్ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అలాగే నంది అవార్డులను కూడా సొంతం చేసుకొన్నది. ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించారు. ఇలాంటి ప్రతిభావంతుడైన దర్శకుడు గుణశేఖర్ మరిన్నీ విజయాలను అందుకోవాలని ఫిల్మ్ బీట్ తెలుగు ఆశిస్తున్నది.