Don't Miss!
- Sports
Team India : ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- News
Republic Day 2023: ప్రగతి భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- Finance
IBM Layoffs: ఉద్యోగుల తొలగించనున్న 110 ఏళ్ల టెక్ కంపెనీ.. కానీ కొత్త జాబ్స్ ఉన్నాయ్..
- Lifestyle
ఇంట్లో నైరుతి మూల వాస్తు చిట్కాలు, దోష నివారణలు
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
HBD Ravi Teja: రవితేజకు కోట్ల ఆస్తులు.. రెమ్యూనరేషన్‌తో రికార్డు.. ఆ ప్రాపర్టీలన్నీ ఆమె పేరు మీదనే!
ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ప్రయాణాన్ని మొదలు పెట్టాడు రవితేజ. తనదైన చిత్రాలతో బీ, సీ సెంటర్ల ఆడియెన్స్‌ను ఓ రేంజ్‌లో అలరించిన అతడు.. మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోన్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే రవితేజ వరుసగా రెండు భారీ విజయవంతమైన చిత్రాలతో సందడి చేశాడు. ఇప్పుడు కూడా పలు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా అతడి రెమ్యూనరేషన్, ఆస్తుల గురించి తెలుసుకుందాం పదండి!

అలా పరిచయం.. ఎన్నో చిత్రాలు
సినిమాల మీద ఉన్న పిచ్చితో హైదరాబాద్‌లో అడుగు పెట్టిన రవితేజ.. మొదట్లో పలువురు డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలను పోషించాడు. ఈ క్రమంలోనే 'సింధూరం' అనే చిత్రంలో అదిరిపోయే పాత్రతో హైలైట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా సహాయ నటుడిగా నటించాడు. దీంతో రవితేజకు మంచి గుర్తింపు వచ్చింది.
ఒంటిపై బట్టలు లేకుండా శృతి హాసన్: హీరోయిన్ హాట్ మసాజ్ ఫొటో వైరల్

హీరోగా సక్సెస్.. వరుస విజయాలు
ఎన్నో చిత్రాల్లో నటించిన తర్వాత 'నీకోసం' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కూడా చాలా చిత్రాల్లో మంచి పాత్రలు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' చిత్రంతో భారీ సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్నాడు. ఇక, 'ఇడియట్'తో స్టార్‌గా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి దూసుకుపోతోన్నాడు.

మధ్యలో ఫ్లాపులు ఎదురొచ్చేసినా
హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో హిట్లను ఖాతాలో వేసుకున్న మాస్ మహారాజా రవితేజ.. చాలా కాలం పాటు వరుసగా ఫ్లాపులను చవి చూశాడు. దీంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మాస్ హీరో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తోన్నాడు. తద్వారా ఫ్యాన్స్‌కు మజాను పంచుతోన్నాడు.
మళ్లీ మొదలెట్టిన యాంకర్ స్రవంతి: క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయిందిగా!

ధమాకా, వీరయ్య.. 200 కోట్లు రచ్చ
'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వరుస ఫ్లాపులను చవి చూసిన రవితేజ.. గత ఏడాది చివర్లో 'ధమాకా'తో వచ్చాడు. ఇది వంద కోట్ల రూపాయలను వసూలు చేసి అతడి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు, ఈ సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' ఏకంగా రూ. 200 కోట్లు వసూలు చేసింది. దీంతో రవితేజకు వరుసగా రెండు భారీ విజయాలు వచ్చినట్లు అయింది.

వరుస చిత్రాలతో ఫుల్ బిజీగానే
వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న మాస్ మహారాజా ఇప్పటికే ఎన్నో సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వర్రావు' వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు రవితేజ ఎన్నో భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోన్నాడు.
పైన ఏమీ లేకుండా అనుష్క హాట్ షో: కోహ్లీ వైఫ్ ఎద అందాల ట్రీట్

అన్ని కోట్ల ఆస్తులు.. ఆమె పేరిట
రవితేజకు ప్రస్తుతం రూ. 150 కోట్లు నికర విలువ ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు, ఈ స్టార్ హీరోకు హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో రూ. 30 కోట్ల విలువ చేసే ఇళ్లు ఉన్నాయట. అలాగే, దాదాపు రూ. 6 కోట్లు విలువైన కార్లు, రూ. 2 కోట్ల విలువైన యాక్ససిరీస్‌లు, రూ. 50 కోట్లు విలువైన ఫ్లాట్లు ఉన్నాయని తెలిసింది. వీటిలో ఆయన భార్య కల్యాణీ పేరిటే సగానికి పైగా రాసినట్లు సమాచారం.

రెమ్యూనరేషన్ పెంచేసిన స్టార్
కెరీర్ ఆరంభంలో తక్కువ మొత్తాన్నే రెమ్యూనరేషన్‌గా తీసుకున్న రవితేజ.. నిన్న మొన్నటి వరకూ రూ. 10 - 12 కోట్లు చార్జ్ చేసేవాడు. కానీ, 'క్రాక్' తర్వాత దాన్ని రూ. 15 కోట్లకు పెంచాడని తెలిసింది. ఇక, ఇప్పుడు 'ధమాకా' హిట్ తర్వాత రవితేజ ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 20 కోట్లు చార్జ్ చేస్తున్నాడని ఓ న్యూస్ లీకైంది. ఇది బాలయ్య, వెంకటేష్, నాగార్జున కంటే ఎక్కువని టాక్.
మాస్ మహారాజా రవితేజ మరెన్నో విజయాలను చూడాలని.. ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఫిల్మీబీట్ తరపున ఈ స్టార్ హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు.