For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాక్ ఇస్తున్న కాజల్ హనీమూన్ బడ్జెట్.. కార్యం కోసం కోట్ల రూపాయలు.. మొత్తం ఎంతంటే?

  |

  కాజల్ అగర్వాల్ ఎప్పుడైతే పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన వార్తలు ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. పెళ్లికి ముందు ఆమె భర్త గురించి ఎవరికి తెలియని విషయాలు హాట్ టాపిక్ అవ్వగా పెళ్లి తరువాత ఆమె ఖర్చులు చర్చనీయాంశంగా మారాయి. బిల్లులు చూసి సోషల్ మీడియాలో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. కాజల్ అదృష్టం ఏ రేంజ్ లో ఉందొ అక్కడే చాలా క్లియర్ గా అర్థమవుతోందనే కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఆమె హనీమూన్ బడ్జెట్ పై ఒక లుక్కేస్తే..

  సముద్రం అడుగున రొమాన్స్..

  సముద్రం అడుగున రొమాన్స్..

  కాజల్, గౌతమ్ ఇద్దరు కూడా పెళ్లి తరువాత హనీమూన్ ను చాలా కాస్ట్లీగానే ప్లాన్ చేసుకున్నారు. మొదట షూటింగ్స్ కారణంగా వాయిదా వేసుకుందామని అనుకుందట చందమామ. కానీ అనుకోకుండా గ్యాప్ దొరకడంతో జోష్ లో ఉండగానే రెడీ అయ్యి హనీమూన్ కోసం హిందూ మహాసముద్రంలోకి వెళ్లిపోయారు. సముద్ర మట్టానికి 16 అడుగుల దిగువన ఉన్నప్రపంచంలో ఇద్దరు రొమాంటిక్ గా ఎంజాయ్ చేశారు.

  అత్యంత ఖరీదైన అండర్ వాటర్ హోటల్ లో..

  అత్యంత ఖరీదైన అండర్ వాటర్ హోటల్ లో..

  ప్రపంచంలోని మొట్ట మొదట నిర్మించిన అత్యంత ఖరీదైన అండర్ వాటర్ హోటల్ మురాకాలో కాజల్, గౌతమ్ చాలానే ఎంజాయ్ చేశారు. కాజల్ తన భర్తతో నీటి అడుగున గాజుతో కప్పబడిన బెడ్ రూమ్ ఫోటోలను కూడా షేర్ చేసుకున్నారు. అందమైన వేలాది చేపల నడుమ కొన్నిరోజులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు.

  ఐదు కోట్లకు పైగా ఖర్చు..

  ఐదు కోట్లకు పైగా ఖర్చు..

  మురాకాలో ఒక రాత్రికి అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. దాని రెంట్ యాభై వేల డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు. పది రోజుల బసకు ఆహారం, ఇతర సందర్శనా ఖర్చులతో సహా ఐదు కోట్లకు పైగా ఖర్చయినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

  పెళ్లి మీడియం ఖర్చులో..

  పెళ్లి మీడియం ఖర్చులో..

  పెళ్లయిన తరువాత కాజల్ తన జీవితంలో మరపురాని ఒక రొమాంటిక్ డేస్ ని గడిపినట్లు అర్ధమవుతోంది. అసలైతే పెళ్లిని గ్రాండ్ గా చేసుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో ఒక హోటల్ లో మీడియం ఖర్చుతోనే చేసేసుకున్నారు. కానీ హనీమూన్ కి అంతకంటే ఎక్కువగా ఖర్చు చేశారు.

  ఆ ఒక్క డ్రెస్ కొసం 20మంది..

  ఆ ఒక్క డ్రెస్ కొసం 20మంది..

  కాజల్ పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే పెళ్లి డ్రెస్ రెడీ చేయడానికి సమయం చాలానే పట్టిందట. దాదాపు 20 మంది ఆ డ్రెస్ కోసం వర్క్ చేసినట్లు తెలుస్తోంది. వీటి ధర మినిమామ్ రెండు మూడు లక్షలకు తక్కువగా ఉండదు. ఇక కాజల్ డ్రెస్ కోసం దాదాపు నెలరోజుల పాటు 20మంది వర్క్ చేశారు కాబట్టి దాని విలువ 10లక్షలకు పైగానే ఉంటుందని సమాచారం.

  #kajalaggarwal : Kajal Aggarwal Reveals How Gautam Kitchlu Proposed To Her For Marriage
   మరో స్పెషల్ పార్టీ కోసం ప్లానింగ్..

  మరో స్పెషల్ పార్టీ కోసం ప్లానింగ్..

  ఇక నెక్స్ట్ ఆచార్య, ఇండియన్ 2 వంటి సినిమాలతో బిజీ కానున్న కాజల్ బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేయడానికి ఒప్పుకుంది. పెళ్లి తరువాత మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే కెరీర్ ని కూడా ఒక ట్రాక్ లో కొనసాగించాలని అనుకుంటున్నట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చింది. ఇక కోవిడ్ ప్రభావం తగ్గిన తరువాత సినీ తారల కోసం స్పెషల్ గా ఒక పార్టీ ఇవ్వాలని కాజల్ దంపతులు ప్లాన్ చేసుకుంటున్నారు.

  English summary
  Kajal Aggarwal Latest Love symbol post create row, Buzz Is That Kajal Aggarwal Getting Married Gautam Kitchlu, Kajal’s beau’s correct name is Gautam Kitchlu, and he’s a design enthusiast and entrepreneur who runs Discern Living – an ecommerce venture for interior design and home decor solutions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X