twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆన్‌లైన్ క్లాస్‌లపై రచ్చ.. టాలీవుడ్ సెలెబ్రిటీల రియాక్షన్.. వ్యతిరేకంగా ట్విట్టర్‌లో ట్రెండ్

    |

    ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని మార్చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న జీవన శైలిని పూర్తిగా రూపాంతరం చెందేలా చేస్తోంది. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంలోగానీ, ఉద్యోగ విషయంలో గానీ, విద్యా వ్యవస్థలోగానీ మార్పులు తీసుకొచ్చేలా చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని కల్పించాయి. ఇక విద్యా వ్యవస్థలోనూ సమూలమైన మార్పులు వచ్చేందుకు రెడీగా ఉంది. అందులో భాగంగా ఆన్ లైన్ విద్యా విధానం ముందుకు వచ్చింది.

    ఆన్‌లైన్‌కు వ్యతిరేకం..

    ఆన్‌లైన్‌కు వ్యతిరేకం..

    ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మునుపటిలా విద్యా సంస్థలు పనిచేసే అవకాశమే లేదు. గుంపులు గుంపులుగా లెక్కకు మించి అడ్మిషన్స్, సామూహిక కార్యక్రమాలు వంటివి చేయలేము. దీంతో పలు విద్యా సంస్థలు ఆన్ లైన్ బాట పట్టాయి. ఇందులో విచిత్రమేటింటే.. ఎల్‌కేజీ, ఒకటి రెండో తరగతులు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. అయితే వీటిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

    అనసూయ ఫైర్..

    అనసూయ ఫైర్..

    చిన్నపిల్లలకు కూడా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించడంపై అనసూయ స్పందించింది. చిన్న వయసు వారు గంటల తరబడి ఫోన్‌లు, ల్యాప్‌ట్యాప్‌లు చూస్తుంటే వారి కళ్లు పాడైపోతాయి. చిన్న పిల్లల విద్యావిధానంలో ఆన్ లైన్ కాకుండా వేరే పద్దతి ఏదైనా ఆలోచించండని ప్రభుత్వానికి సూచించింది. తాజాగా ఇదే విషయమై మంచు లక్ష్మీ, క్రిష్ మధ్య వార్ నడుస్తోంది.

    జాతీయ విధానం అవుతుందా?

    జాతీయ విధానం అవుతుందా?

    చిన్ని పిల్లలకు కూడా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించడంపై డైరెక్టర్ క్రిష్ స్పందిస్తూ.. ‘గొప్ప వార్త.. త్వరలో ఇది జాతీయ విధానం అవుతుందా? రెండో తరగతి చదివే పిల్లాడికి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని, దీనికి పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నారని కొన్ని రోజుల క్రితం నేను విని ఆందోళనకు గురయ్యాన'ని తెలిపాడు.

    నువ్వొచ్చి చెప్పు..

    నువ్వొచ్చి చెప్పు..

    క్రిష్ వ్యాఖ్యలపై మంచు లక్ష్మి ఫైర్ అయింది. ‘నువ్వొచ్చి పాఠాలు చెప్పు ఇప్పుడు. కనీసం ఆన్‌లైన్ క్లాసుల ద్వారా అయినా వాళ్లు కొన్ని గంటలపాటు అలా ఉంటారేమో' అని ఘాటుగా స్పందించింది. అయితే క్రిష్ వెంటనే స్పందిస్తూ.. ‘ఆన్‌లైన్ తరగతులు తప్పనిసరి చేయడానికి నేను వ్యతిరేకం. తల్లిదండ్రులు తమ వెసులుబాటును బట్టి ఎంపిక చేసుకోగలగాలి' అని చెప్పుకొచ్చాడు.

    హృదయం బద్దలవుతోంది..

    హృదయం బద్దలవుతోంది..


    క్రిష్ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ.. ‘‘పిల్లాడు ఆన్‌లైన్ క్లాసుల్లో కూర్చోవాలని ఎవ్వరూ బలవంతం చేయడం లేదు. మనకున్న అవకాశం ఇదొక్కటే. అయితే తీసుకోవాలి లేదంటే వదిలేయాలి. ఈ కొత్త పద్ధతిని అమలు చేయడానికి స్కూళ్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి. వారి చేతుల్లో గంటల తరబడి ఐపాడ్ ఉంటే నా హృదయం బద్దలైపోతోంద'ని తెలిపింది.

    నెటిజన్స్ సెటైర్స్..

    నెటిజన్స్ సెటైర్స్..

    మంచు లక్ష్మీ చేసిన ఈ ట్వీట్లపై నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు. వారికి స్కూల్స్ ఉన్నాయి కాబట్టే ఇలా అంటోందని కామెంట్స్ చేస్తున్నారు. వారి బిజినెస్ దెబ్బ తింటుంది కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తోందని కొందరు ట్వీట్స్ చేస్తున్నారు.

    Recommended Video

    Anasuya Bharadwaj Likely To Out From Jabardasth Show
    నేషనల్ వైడ్ ట్రెండ్..

    నేషనల్ వైడ్ ట్రెండ్..

    అయితే ఈ విషయాలు ఎలా ఉన్నా.. ఆన్ లైన్ క్లాసులను వ్యతిరేకించే వారు చాలా మందే ఉన్నారు. ఈ రోజంతా ట్విట్టర్‌లో #StopOnlineClass అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఆన్ లైన్ విద్యా విధానాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. మరి వీటిపై ప్రభుత్వాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.

    English summary
    Manch Lakshmi And Krish War About Online Class To Children. He says that I'm against making it mandatory... and parents can always choose according to their convenience.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X