For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలంగాణ బతుకమ్మపై మెగాస్టార్ స్పెషల్ ట్వీట్.. ఆడపడుచుల కోసం ప్రత్యేకంగా..

  |

  టాలీవుడ్ మెగాస్టార్ సోషల్ మీడియాలో అడుగుపెట్టిన తర్వాత అభిమానులకు చాలా దగ్గరవుతున్నారు అనే చెప్పాలి. ఎన్నో మంచి విషయాలపై స్పందిస్తూ అన్ని వర్గాల వారిని కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. సమాజంలో జరిగే మంచి చెడుల పై కూడా తన భావాన్ని తెలియజేసి మంచి దారిలో వెళ్లాలని అభిమానులకు తనదైన శైలిలో సూచనలు ఇస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేసినా కూడా పది నిమిషాల్లోనే వైరల్ అవుతాయి. ముఖ్యంగా ట్విట్టర్లో మెగాస్టార్ చాలా చురుగ్గా కనిపిస్తున్నారు. విషయం ఏదైనా సరే చాలా వేగంగా స్పందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మన తెలుగుకు సంబంధించిన పండగలపై కూడా ఆయన ప్రత్యేకంగా పోస్టులు పెట్టడం కూడా వైరల్ అవుతోంది. నేడు తెలంగాణ బతుకమ్మ సందర్భంగా మెగాస్టార్ చేసిన ఒక ట్వీట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది.

  'ఆశ్వయుజ మాసంలో 9 రోజుల బొద్దెమ్మ తర్వాత వచ్చే తెలంగాణ ఆడపడుచు ' బతుకమ్మ' కు స్వాగతం. 9 రోజుల పాటు సాయంత్రం కాగానే వివిధ పుష్పాలతో తీరుగా తీర్చిదిద్దే బతుకమ్మను కీర్తిస్తూ ఆడపడుచులు చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడే దృశ్యం ఓ అద్భుతం.ఆడపడుచులు అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు' అని మెగాస్టార్ తనదైన శైలిలో ఆప్యాయంగా వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఇక మెగాస్టార్ సినిమాల విషయానికి వస్తే వరుసగా ఆయన నాలుగు సినిమాలను లైన్ లో పెట్టారు. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో చేసినటువంటి ఆచార్య సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోంది. మరి కొన్ని రోజుల్లో విడుదల తేదీపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సినిమాలో రామ్ చరణ్ సిద్దా అనే పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

  Megastar chiranjeevi special tweet on telangana festival

  ఇక ఆ తర్వాత వీలైతే వచ్చే ఏడాది రెండు సినిమాలను విడుదల చేయాలని ఒక ప్లాన్ అయితే సెట్ చేసుకున్నారు. ఇప్పటికే లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదళం కూడా మొదలు పెట్టేశారు. ఇక బాబీ దర్శకత్వంలో మరొక మూవీని స్టార్ట్ చేయాల్సి ఉంది. వరుసగా ఈ సినిమాలతో మెగాస్టార్ చాలా బిజీగా మారుతున్నారు. ఇక అందరి ఫోకస్ అయితే ఎక్కువగా ఆచార్య సినిమా పైనే ఉంది. మొదటిసారి రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి నటిస్తుండటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

  తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. సినిమాకు సంబంధించిన టీజర్ సాంగ్స్ కూడా భారీ స్థాయిలో బజ్ క్రియేట్ చేశాయి. అలాగే మెగాస్టార్ మరో ఇద్దరు దర్శకులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా కామెడీ డైరెక్టర్ మారుతి తో కూడా ఒక కాన్సెప్ట్ పై చర్చలు జరిపినట్లు టాక్ అయితే వస్తోంది. అలాగే గోపీచంద్ మలినేని సంపత్ నంది వంటి మాస్ కమర్షియల్ దర్శకులు కూడా లైన్ లో ఉన్నట్లు మరొక కొత్త టాక్ వినిపిస్తోంది.

  English summary
  Megastar chiranjeevi special tweet on telangana festival,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X