తమన్‌ హ్యాట్సాఫ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు.. నీ కొట్టుడు, ఉతుకుడు స్పీడ్ వేరే లెవెల్!

భారతీయ సినిమా రంగంలోను, సంగీత ప్రపంచంలోను సునామీ మాదిరిగా తన ప్రతిభను చాటుకొంటున్న తమన్ ఎస్ఎస్‌కు అరుదైన అనుభవం ఎదురైంది. గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్‌తో కొంత సమయాన్ని ఏకాంతంగా కలిసే అవకాశం కలిగింది. అయితే క్రికెట్ దేవుడితో గడిపిన క్షణాలను, తన గురించి ఆయన చెప్పిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. అయితే తమన్ గురించి సచిన్ ఏమన్నారంటే..

దక్షిణాదిలోనే కాకుండా ఇండియాలో కూడా థమన్ మ్యూజిక్‌కు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారనేది కొత్తగా చెప్పనక్కర్లేదు. వృత్తిగా మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న తమన్.. ప్రవృత్తిగా క్రికెట్‌ ఆడటాన్ని కూడా సీరియస్‌గా తీసుకొన్నాడు. అయితే సినీ స్టార్స్‌గా ఆడే క్రికెట్ లీగ్‌లో తెలుగు వారియర్స్ తరఫున తమన్ అత్యుత్తమ ప్రదర్శనతో జట్టుకు అత్యంత బలంగా నిలవడం పలు సందర్భాల్లో స్పష్టమైంది. ఎన్నో సందర్భాల్లో తన వీరోచిత ఆడి, మెరుపు ఇన్నింగ్స్, బంతిని బౌండరీ లైన్ దాటించిన విధానం క్రీడాభిమానులను, సంగీతాభిమానులను ఆకట్టుకొన్న విషయాన్ని కళ్లారా చూశాం.

Sachin Tendulkar applauds Thaman SS Batting

అయితే తాజాగా తమన్ మ్యూజిక్ అందించిన OG చిత్రం భారీ విజయం సాధించింది. మ్యూజిక్ పరంగా కూడా చార్ట్‌బస్టర్స్‌లో టాప్‌లో నిలిచింది. ఆయన అందించిన పాటలు తెలుగు వాళ్లనే కాకుండా విదేశాల్లో పరభాషల వారిని ఆకట్టుకొంటున్నాయి. ఇక ఓజీ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. సినిమాను రెండితలు హైప్ క్రియేట్ చేసింది. అయితే ఆ సినిమా విజయోత్సవాలను అమెరికాలో దర్శకుడు సుజిత్‌తో కలిసి జరుపుకొన్నారు. అక్కడి ప్రేక్షకులు, సంగీత అభిమానులు, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమాను ఎంజాయ్ చేశారు.

అయితే అమెరికా నుంచి దుబాయ్‌కి తిరుగు ప్రయాణం చేపట్టిన సమయంలో లెజెండరీ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ను తమన్ కలుసుకొన్నారు. ఫ్లయిట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో కలిసిన సందర్భాల్లో తమన్ గురించి ప్రశంసలు గుప్పించారు. సచిన్ వెల్లడించిన విషయాలను తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా పంచుకొని తన ఆనందాన్ని తన ఫాలోవర్స్, అభిమానులతో పంచుకొన్నారు.

సచిన్‌ టెండూల్కర్‌ను కలిసిన అనుభూతిని వెల్లడిస్తూ.. లెజెండరీ క్రికెటర్, గాడ్ ఆఫ్ క్రికెట్‌తో కలిసి ప్రయాణం చేశాను. డల్లాస్ నుంచి దుబాయ్‌కి ప్రయాణిస్తున్న సమయంలో అద్బుతమైన సమయాన్ని గడిపే అవకాశం దక్కింది. ఆ సమయంలో సచిన్ స్వయంగా నా క్రికెట్ షాట్స్‌ గురించి ప్రస్తావించారు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో నేను కొట్టిన షాట్స్‌ను నాకు చూపిస్తూ. బంతిని ఉతకడంలో, బౌలర్లను బాదడంలో నీ స్పీడే వేరు. షాట్ కొట్టేటప్పుడు నీ బ్యాట్ స్పీడ్ అమోఘంగా ఉంటుంది అని మాస్టర్ బ్లాస్టర్ చెప్పాడు. దాంతో నా జీవితం ధన్యమైంది. ఆయనతో కలిసి క్రికెట్ ఆడే సమయం, అవకాశం కోసి ఎదురు చూస్తున్నాను అంటూ తమన్ ట్వీట్ చేశాడు.

తమన్ కెరీర్ విషయానికి వస్తే.. అఖండ చిత్రంతో తమన్ టాలెంట్ దేశవ్యాప్తంగా మార్మోగింది. తాజాగా ఓజీతో ఆయన పాపులారిటీ ఎన్నో రెట్లు పెరిగింది. తాజాగా జరిగిన సక్సెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుంటే.. ఓజీ సినిమా లేదు. ఈ సినిమాను తన మ్యూజిక్‌తో ఎక్కడికో తీసుకెళ్లాడు అని కితాబిచ్చారు. ఇక తమన్ త్వరలోనే అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. త్వరలోనే గాడ్ ఆఫ్ క్రికెట్‌తో కలిసి తమన్ క్రికెట్ వినోదాన్ని పంచాలని ఆశిద్దాం.

More from Filmibeat

Read more about: og thaman ss sachin tendulkar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X