For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  HBD Pawan Kalyan: 51వ పడిలోకి పవన్​ కల్యాణ్​.. ఫిట్​నెస్​ సీక్రెట్​ ఇదే..

  |

  మెగాస్టార్​ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు పవన్​ కల్యాణ్. ఇప్పటికి భీమ్లానాయక్​ చిత్రంతో కలుపుకుని మొత్తంగా 27 సినిమాలు చేశాడు. హిట్​లు ఫట్​లు అంటూ తేడా లేకుండా, ఏమాత్రం క్రేజ్ తగ్గని పవర్​ స్టార్​గా ఎదిగాడు పవన్ కల్యాణ్. నటుడిగా, రాజకీయ నాయకుడిగా అశేష అభిమానులను సంపాందించుకున్నాడు. అంతేకాకుండా గబ్బర్ సింగ్​ సినిమాలో చెప్పినట్లుగా ట్రెండ్​ను ఫాలో కాకుండా ట్రెండ్ సెట్ చేసే వ్యక్తిగా నిలిచాడు. నేడు అంటే సెప్టెంబర్​ 2న ఆయన 51 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పవన్​ కల్యాణ్ ఫిట్​నెస్​ సీక్రేట్​ ఏంటో తెలుసుకుందామా!

  ఎంతో ఫిట్​గా..

  ఎంతో ఫిట్​గా..

  అభిమానులు, ప్రేక్షకులతో పవర్​ స్టార్​ అనిపించుకున్నాడు పవన్​ కల్యాణ్. సెప్టెంబర్​ 2న ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సూపర్​ హిట్​ మూవీస్​ జల్సా, తమ్ముడు చిత్రాలను మళ్లీ ప్రదర్శిస్తున్నారు. టికెట్స్​ పెట్టిన వెంటనే అతి త్వరగా అమ్ముడుపోయాయి. హిట్​ల కంటే ఎక్కువ ఫ్లాప్​లు ఇచ్చినా సరే.. ఆయన మీద ఉన్న క్రేజ్ ఏమాత్రం ఇప్పటికీ తగ్గలేదు. ఇదిలా ఉంటే నటుడిగా, రాజకీయ నాయకుడిగా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పవన్​ కల్యాణ్​ 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికీ ఆయన ఎంతో ఫిట్​గా కనిపిస్తారు. మరి 51 ఏళ్ల వయసులో పవన్ కల్యాణ్ ఫిట్​గా కనిపించేందుకు గల రహస్యాలు ఓసారి చూద్దాం.

  షావులిన్​ కుంగ్​ ఫూ..

  షావులిన్​ కుంగ్​ ఫూ..

  పవన్​ కల్యాణ్​ మార్షల్​ ఆర్ట్స్​లో శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. కరాటే బ్లాక్ బెల్ట్ సాధించిన పవన్​ కల్యాణ్​ తన మొదటి సినిమాలోని యాక్షన్​ సీన్లో బయటపెట్టారు. సినిమాల్లోని యాక్షన్​, ఫైట్ సీన్లలో ఎలాంటి డూపు లేకుండా చేస్తారని టాక్​ కూడా ఉంది. ఇక తమ్ముడు సినిమాలో పవన్ చేతుల మీదుగా కార్లు వెళ్లే సీన్లు, ఖుషీలో కత్తితో చేసే విన్యాసాలు అందుకు ఉదాహరణలుగా చెబుతారు. అంతేకాకుండా ప్రస్తుతం క్రిష్​ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న హర హర వీర మల్లు సినిమా కోసం షావులిన్​ కుంగ్​ఫూ వెపన్స్​లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్​ అయ్యాయి.

  కురుసోవా అంటే అభిమానం..

  కురుసోవా అంటే అభిమానం..

  ఇక జపనీస్​ చిత్ర నిర్మాత అకిరా కురుసోవా, చేగువేరా అంటే పవన్​ కల్యాణ్​కు అమితమైన ఇష్టం. వారికి అభిమానని అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. మార్షల్​ ఆర్ట్స్​, ఫిట్​నెస్​ పట్ల తనకున్న ప్రేమకు అకిరా కురుసోవా ప్రేరణ అని తెలిపారు. అందుకే ఆయన కొడుకు పేరులో అకిరా ఉండే విధంగా చూసుకున్నారు. చేగువేరా రాసిన పుస్తకాలు చదువుతూ అనేక సందర్భాల్లో పవన్​ కల్యాణ్​ దర్శనమిచ్చాడు. ఇక వీటన్నింటికి మించి పవన్​ కల్యాణ్​ ఆహార నియమాలు ప్రత్యేకం.

  ఆయుర్వేదంలో చెప్పినట్లుగా..

  ఆయుర్వేదంలో చెప్పినట్లుగా..

  మానసికంగా సంతోషాన్ని పెంచుకోవడానికి సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాడు పవన్​ కల్యాణ్​. శక్తి, సంతోషం, ప్రశాంతత, మానసిక ఆరోగ్యం ఇచ్చే ఆహారాన్ని తినాలని ఆయుర్వేదం చెబుతుందని, పవన్​ కల్యాణ్​ దాన్నే ఫాలో అవుతారని సమాచారం. సాత్విక భోజనం అంటే ఆయుర్వేదంలో చెప్పినట్లుగా తీసుకునే ఆహారం. ఇది తినేవారి ఆలోచన స్వభావం, వారి శ్రేయస్సుపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇది స్వచ్ఛమైన శాఖాహారం. తాజా కూరగాయలు, కాలానుగుణంగా వచ్చే పండ్లు, తృణధాన్యాలు, మొలకలు, పప్పులు, తేనే, విత్తనాలు తీసుకుంటాడు పవన్ కల్యాణ్​. ఇది శరీరాన్ని సమతుల్యంగా ఉంచి మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

  ప్రకృతి ప్రేమికుడు..

  ప్రకృతి ప్రేమికుడు..

  అంతేకాకుండా పవన్ కల్యాణ్​ ప్రకృతి ప్రేమికుడు. సినిమా షూటింగ్స్​ నుంచి విరామం దొరికినప్పుడల్లా తన ఫామ్ హౌస్​కు వెళ్లి అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతాడు. ఎన్నోసార్లు ఆయన స్వయంగా సేద్యం చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. చాలా నిరాడంబరంగా తెల్లని దుస్తులు ధరిస్తాడు.

  English summary
  Power Star Pawan Kalyan Eats Sathvik Food And Expert In Martial Arts. These Are His Fitness Secrets.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X