For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తెలుగు సినీ చరిత్రలో సంచలనం: వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రికార్డు.. హిస్టరీ క్రియేట్ చేసిన పవన్

  |

  తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకే కాదు.. సినిమాను అభిమానించే ఎంతో మందికి అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ప్రవేశించినా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడాయన. అంతేకాదు, కొన్ని కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. అలా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లి.. 'వకీల్ సాబ్'తో ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఈ మూవీ ఫంక్షన్ జరిగింది. ఇది టాలీవుడ్‌లో సరికొత్త చరిత్రను రాసింది. ఆ వివరాలు మీకోసం!

  ‘వకీల్ సాబ్’గా రీఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్

  ‘వకీల్ సాబ్’గా రీఎంట్రీ ఇస్తున్న పవన్ కల్యాణ్

  సుదీర్ఘ విరామం తర్వాత ‘వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. టాలెంటెడ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన ‘పింక్'కు ఇది రీమేక్‌గా వస్తోంది.

  ముగ్గురు అమ్మాయిల కోసం పోరాడే లాయర్‌గా

  ముగ్గురు అమ్మాయిల కోసం పోరాడే లాయర్‌గా

  ‘వకీల్ సాబ్' మూవీ ఆడవాళ్ల కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించే ఒక ప్రయత్నం. ఇందులో మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలకు అనుకోని విధంగా ఓ కష్టం వస్తుంది. ఇందులో భాగంగానే వాళ్లంతా ఓ కేసులో ఇరుక్కుంటారు. వాళ్లకు కాపాడేందుకు లాయరైన హీరో పోరాటం చేస్తాడు. బాధిత యువతులుగా అంజలి, నివేదా థామస్, అనన్యలు నటించారు.

  వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ ఫ్యాన్స్ హంగామా... ఆకట్టుకొన్న డ్రమ్మర్ శివమణి

  పవన్‌ను హైలైట్ చేస్తున్నారు.. అందుకే మార్పు

  పవన్‌ను హైలైట్ చేస్తున్నారు.. అందుకే మార్పు

  పవన్ కల్యాణ్ కమ్‌బ్యాక్ మూవీ కావడంతో ‘వకీల్ సాబ్'పై భారీ బజ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఇప్పటి వరకూ వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలకు ఊహించని స్పందన వచ్చింది. ఇక, రెండు భాషలకు భిన్నంగా ఈ సినిమాలోనూ పవన్ క్యారెక్టర్‌ను బాగా ఎలివేట్ చేశారన్న విషయం తెలిసిందే. రీఎంట్రీ మూవీ కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారన్న టాక్ జోరుగా వినిపిస్తోంది.

  భారీగా అంచనాలు.. అందుకు తగ్గట్లుగా రెస్పాన్స్

  భారీగా అంచనాలు.. అందుకు తగ్గట్లుగా రెస్పాన్స్

  లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడంతో ‘వకీల్ సాబ్'పై భారీ బజ్ ఏర్పడింది. దీని కోసం మెగా అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ మొత్తం పెట్టి దీన్ని కొనుగోలు చేశారు. అదే సమయంలో అభిమానులు కూడా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు.

  అంగరంగ వైభవంగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

  అంగరంగ వైభవంగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్

  ‘వకీల్ సాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. కరోనా నేపథ్యంలో పరిమిత జనాభా మధ్యలో జరిగిన ఈ వేడుకకు మంచి స్పందన వచ్చింది. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, సన్నిహితులు హాజరయ్యారు. ఇందులో పవన్ కల్యాణ్ స్పీచ్ ఆకట్టుకుంది. అలాగే, అభిమానులు కూడా ఈ వేడుకలో తెగ ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

  సంచలనం: ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రికార్డు

  సంచలనం: ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ రికార్డు

  ఆదివారం సాయంత్రం జరిగిన ‘వకీల్ సాబ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సినీ ఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన ఈ ఫంక్షన్‌ను ఏక కాలంలో 1.30 లక్షల మంది లైవ్ ద్వారా తిలకించారు. ఇప్పటి వరకూ ఏ సినిమా ఈవెంట్‌కూ ఇంత రెస్పాన్స్ రాలేదు. దీంతో పవన్ కల్యాణ్ పేరిట మరో అరుదైన రికార్డు నమోదైంది. దీనిపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.

  రెండో స్థానంలోనూ అదే.. ఆ రికార్డు మళ్లీ అతడే

  రెండో స్థానంలోనూ అదే.. ఆ రికార్డు మళ్లీ అతడే

  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటించిన ‘అజ్ఞాత‌వాసి' సినిమా ఈవెంట్‌కు టీవీలో భారీ స్పందన వచ్చింది. దీన్ని ఏకకాలంలో 1.28 లక్షల మంది లైవ్‌ ద్వారా వీక్షించారు. ఇప్పుడా రికార్డును పవన్ కల్యాణే స్వయంగా బద్దలు కొట్టుకున్నాడు. దీంతో ‘ట్రెండ్ సెట్ చేయాలన్నా.. దాన్ని తిరగ రాయాలన్నా నేనే' అని మరోసారి నిరూపించుకున్నాడీ మెగా హీరో.

  English summary
  Sri Venkateswara Creations, Bay View Projects's Vakeel Saab is set release on April 9th. Dil Raju and Shirish Reddy are the producers and Boney Kapoor is the presenter. Before this movie release, unit organised Pre release event in Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X