For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ సినిమాతో 14 కోట్లు నష్టం.. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మూవీతో 16కోట్లు లాభం: ఎంఎస్ రాజు ఎమోషనల్

  |

  ఒక సినిమా విజయం వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. సక్సెస్ వస్తే అందరికి లాభమే. అయితే నష్టం వస్తే అంధరికంటే ఎక్కువగా నష్టపోయేది నిర్మాత మాత్రమే. సినిమా ఇండస్ట్రీలో సినిమాలపై పెట్టిబడి పెట్టి నష్టపోయిన నిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఇక కష్టపడి నష్టాలను ఎదుర్కొని మళ్ళీ పైకొచ్చిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో నిర్మాత ఎంఎస్.రాజు ఒకరు. శత్రువు, దేవి, మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు వంటి సినిమాలతో ఒకప్పుడు ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్న ఆయన ఇటీవల మరచిపోలేని జ్ఞాపకాల గురించి చెప్పారు.

  మనసంతా నువ్వేపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  మనసంతా నువ్వేపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  మనసంతా నువ్వే సినిమా విడుదలై నేటికి 19 సంవత్సరాలు అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాజు ఆ సినిమాకు సంబంధించిన విషయాలను తెలిపారు. ఆ సినిమా ఎలా మొదలైంది? మొదలవ్వకముంది ఎలా ఉన్నారు? సినిమా విడుదల తరువాత ఎలాంటి రిజల్ట్ ని అందుకున్నారు అనే విషయాలపై చాలా క్లోయర్ గా వివరణ ఇచ్చారు.

  ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం బాధగా ఉంది

  ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం బాధగా ఉంది

  ఆయన ఈ విధంగా వివరించారు. " మనసంతా నువ్వే నా సినిమాల్లో చాలా ప్రత్యేకమైనది. సూపర్ టీమ్ వర్క్ తో బ్లాక్ బస్టర్ సినిమా తీయగలిగాం. ఈ సక్సెస్ లో నాకు సహకరించిన అందరికీ థాంక్స్. ఉదయ్ కిరణ్ ని మిస్ అవ్వడం మాత్రం చాలా బాధగా ఉంది. అయితే ఈ సినిమా చేయడానికి ముందు ఒక భారీ నష్టాన్ని ఎదుర్కొన్నాను.

  ఆ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది

  ఆ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది

  అప్పట్లో మా సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ లో ఎక్కువ సినిమాలకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించేవారు. అయితే శతృవు, దేవి లాంటి బాక్సాఫీస్ హిట్స్ అనంతరం ఆయనతో మరో బిగ్ బడ్జెట్ సినిమా చేయాలని దేవి పుత్రుడు నిర్మించాం. కానీ ఆ సినిమా దారుణంగా దెబ్బ కొట్టింది. దాదాపు 14కోట్లు బూడిదలో పోసిన పన్నీరులా అయిపోయాయి. నేను పడిన కష్టం, పెట్టుకున్న ఆశలు అన్ని కూడా ఆ సినిమాతో ఆవిరైపోయాయి.

  మనసంతా నువ్వే అలా పుట్టింది

  మనసంతా నువ్వే అలా పుట్టింది

  ఫెయిల్యూర్స్ నాకు కొత్త కాదు. ఆ ఒక్క సినిమాతో వచ్చిన డబ్బు, కీర్తి పోవడమే కాకుండా ఆ సినిమాకు అన్ని కోట్లు ఖర్చు చేయడం అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఆ తరువాత పెద్ద బడ్జెట్ లో కాకుండా చిన్న బడ్జెట్ లోనే మంచి సినిమా తీయాలని అనుకున్నాను. ఒక పాత సినిమాతో ఐడియా వచ్చింది. వెంటనే కథను రాయడం జరిగింది. దానికి పరుచూరి బ్రదర్స్ కూడా సహాయం చేశారు. వీరుపోట్ల కామెడీ డైలాగ్స్ కూడా బాగా కుదిరాయి. అదే మనసంతా నువ్వే.

  ఉదయ్ కిరణ్ అలా సెట్టయ్యాడు

  ఉదయ్ కిరణ్ అలా సెట్టయ్యాడు

  విఎన్. ఆదిత్య దర్శకత్వంలో జూన్ 1న మొదలైన ఆ సినిమా ఎలాంటి బ్రేకులు లేకుండా పూర్తయ్యింది. మొదట హీరో కోసం వెతికే పనిలో ఉన్నప్పుడు తేజ ద్వారా ఉదయ్ కిరణ్ ని చూశాము. అప్పటికే కొంచెం నువ్వు నేను సినిమా చేశారు. అప్పుడు అతని నటన బాగా నచ్చింది. కథకు సెట్టవుతాడాని అనుకున్నాం. ఆ తరువాత హీరోయిన్ రిమా సేన్, సునీల్ .. అలా అందరి పాత్రలు ఫైనల్ అయ్యాయి.

   దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వాల్సింది

  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇవ్వాల్సింది

  మొదట ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నాం. కానీ కుదరక ఆ తరువాత RP. పట్నాయక్ ని తీసుకున్నాం. ఒక్కరోజులోనే అతను ట్యూన్స్ అన్ని రెడీ చేశాడు. సిరివెన్నెల అందించిన పాటలు కూడా అద్బుతమనే చెప్పాలి. ఆ సినిమాకు అన్ని కలిసొచ్చాయి. చెప్పవే ప్రేమ పాటను వర్షంలో షూట్ చేయాలని అనుకున్నాం. కానీ ఆ అవసరం లేకుండానే వర్షం పడింది.

  మనసంతా నువ్వే బాక్సాఫీస్ కలెక్షన్స్

  మనసంతా నువ్వే బాక్సాఫీస్ కలెక్షన్స్

  సినిమా మొత్తానికి అనుకున్నట్లుగా పూర్తి చేశాము. అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదలయ్యింది. ఆ రోజు నేను అనుకున్న అద్బుతమే జరిగింది. సినిమాకు మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. 1కోటి 30లక్షల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా 16కోట్ల దాకా వసూలు చేసింది. మే 1న నా పుట్టినరోజున మొలకెత్తిన ఒక చిన్న మొక్క నాలుగున్నర నెలల్లో అద్భుతానికి దారి తీసింది. నిజంగా ఆ సినిమా నాకు జీవితాన్ని ఇవ్వడమే కాకుండా ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది".. అంటూ ఏంఎస్.రాజు వివరణ ఇచ్చారు.

  English summary
  There is a lot of hard work behind the success of a film. Success is good for everyone. However, the producer was the only one who suffered more than the others when it came to damage. There are a lot of producers in the film industry who have lost money by investing in movies. There are also those who work harder and face losses and rise again. Producer MS Raju is one of them. He talks about his recent unforgettable memories of receiving many box office hits at one time with movies like Shatruvu, Devi, Manasanta Nuvve, Varsham, Okkadu
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X