For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Puneeth Rajkumar: బాలకృష్ణకు పునీత్ సహాయం.. స్టార్ అయినా ఆయన కోసం చిన్న పిల్లాడిలా.. వీడియో వైరల్

  |

  దేశ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీలు అన్నింట్లోనూ కొంత కాలంగా వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలు కారణాలతో సినీ కుటుంబాలకు చెందిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో బడా హీరోగా వెలుగొందుతోన్న పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మరణించాడు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులంతా సంతాపం తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే నందమూరి అభిమానులు కూడా పునీత్ రాజ్‌కుమార్ గురించి ఎమోషనల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో నందమూరి బాలకృష్ణతో పునీత్ ఉన్న వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తున్నారు. అదేంటో మీరూ చూడండి!

  గుండెపోటుతో పునీత్ కన్నుమూత

  గుండెపోటుతో పునీత్ కన్నుమూత

  శుక్రవారం ఉదయం జిమ్‌లో వర్కౌట్లు చేసే సమయంలో గుండెపోటుకు గురయ్యాడు పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్. దీంతో అతడిని అక్కడి సిబ్బంది బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడి వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. కానీ, అవేమీ ఫలించకపోవడంతో పునీత్ రాజ్‌కుమార్ ఆ వెంటనే తుది శ్వాస విడిచాడు.

  Puneeth Rajkumar No More: గుండెపోటుతో పునీత్ కన్నుమూత.. బయటకొచ్చిన ఫొటో.. అప్పుడే అధికారిక ప్రకటన

  లేటుగా ప్రకటన.. జాగ్రత్త తీసుకుని

  లేటుగా ప్రకటన.. జాగ్రత్త తీసుకుని

  బెంగళూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకొచ్చిన కొద్ది సేపటికే పునీత్ రాజ్‌కుమార్ మరణించాడు. అయితే, దీనికి సంబంధించిన ప్రకటన మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది. అప్పటి వరకూ కర్నాటక ప్రభుత్వం రాష్ట్రంలో హైఅలెర్ట్ ప్రకటించడంతో పాటు సినిమా హాళ్లను మూసివేసింది. దీంతో పాటు మరిన్ని జాగ్రత్తలు తీసుకుని పునీత్ మరణ వార్తను బయటకు వదిలారు.

  విషాదంతో సినీ ప్రముఖుల పోస్టు

  విషాదంతో సినీ ప్రముఖుల పోస్టు

  పునీత్ రాజ్‌కుమార్ మరణ వార్తతో దేశ వ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమలు అన్నింట్లోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. దీంతో దక్షిణాదికి సంబంధించిన హీరోలు, హీరోయిన్లు మాత్రమే కాదు.. మిగిలిన పరిశ్రమల వాళ్లు కూడా పునీత్‌కు సంతాపం తెలుపుతున్నారు. తమ గుండె ముక్కలైందని చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అలాగే, అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు.

  Bigg Boss Unseen: శృతి మించిన ప్రియాంక రొమాన్స్.. బయటే అతడితో పడుకుని.. వామ్మో మరీ దారుణం

  నందమూరి ఫ్యామిలీతో క్లోజ్‌గానే

  రాజ్‌కుమార్ ఫ్యామిలీకి నందమూరి కుటుంబానికి మధ్య సత్సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్.. రాజ్‌కుమార్ మొదలుకొని ఆ తర్వాత వారసులు కూడా దీన్ని కంటిన్యూ చేశారు. శివ రాజ్‌కుమార్.. బాలకృష్ణ నటించిన 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత పునీత్ 'చక్రవ్యూహా' సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఓ పాటను కూడా పాడాడు.

  బాలకృష్ణతో కలిసి ఒక ఫంక్షన్‌లో

  బాలకృష్ణతో కలిసి ఒక ఫంక్షన్‌లో

  కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ఓ సినిమా ఫంక్షన్ జరిగింది. దీనికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వెళ్లారు. అందులో కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులంతా పాల్గొన్నారు. ఈ వేడుకలో పునీత్ రాజ్‌కుమార్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇందులో బాలయ్య వెళ్లి వచ్చే వరకూ స్వయంగా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. అప్పట్లో ఇది బాగా హైలైట్ అయింది.

  Disha Patani: బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన దిశా పటానీ.. అసలే తడిచిన అందాలు.. అలా పడుకోవడంతో!

  Recommended Video

  Akash Puri 'Romantic' Movie Team Interview
  బాలయ్యకు పునీత్ సహాయం చేసి

  బాలయ్యకు పునీత్ సహాయం చేసి

  ఆ ఫంక్షన్‌లో పునీత్ రాజ్‌కుమార్.. నందమూరి బాలకృష్ణ పక్కనే కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. బాలయ్య బుగ్గకు ఏదో అంటుకుంది. దీంతో పునీత్ అది పోయేంత వరకూ తన చేతితో స్వయంగా తుడిచాడు. దానికి సంబంధించిన వీడియోను నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అతడికి సంతాపం తెలుపుతున్నారు.

  English summary
  Kannada Power Star Puneeth Rajkumar Is No More, Dies At The Age Of 46 At Vikram Hospital Bengaluru. Recently Nandamuri Balakrishna Fans Shared a Video.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X