For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  రక్తంలోనే ఉంది.. కౌశల్ ఆర్మీకి అదే స్పూర్తి.. దారి చూపించారు.. కౌశల్, పూరీ మనం సైతం

  |

  కాదంబరి ఆశ, శ్వాస మనం సైతం...సాటి వారికి సేవ చేసే మనిషిలోనే దైవం ఉన్నాడని మనం సైతం సేవా కార్యక్రమాల ద్వారా కాదంబరి కిరణ్ నిరూపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ లక్షలాది సైన్యంగా ఎదుగుతోంది. వందల మంది పేదలు ఆదుకోవాలంటూ ఈ సేవా సంస్థను ఆశ్రయిస్తున్నారు. మనం సైతం దగ్గరకు వచ్చే ఆర్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా మరికొందరు పేదలకు మనం సైతం ఆర్థిక సహాయాన్ని అందించింది. హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి జయలలిత, బిగ్ బాస్ విజేత కౌశల్, బుల్లితెర నటుడు అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

  ఆ ఇద్దరంటే నాకు నచ్చదు.. వాళ్లు తవ్వుకొన్న గోతిలో వాళ్లే పడ్డారు.. కౌశల్

   మనం సైతంకు కౌశల్ విరాళం

  మనం సైతంకు కౌశల్ విరాళం

  మనం సైతం కార్యక్రమానికి మణికంఠ, పి. రంగాచార్యులు, లక్కీ యాదవ్, గుమ్మోజి భరత్ కుమార్, అంజనాదేవి, టీఎన్వీ గాయత్రి, ఝాన్సీ, భాస్కర్, దిలీప్ తేజ లకు చెక్ లను అతిథుల చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న నటి జయలలిత లక్ష రూపాయలు, జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున ప్రెసిడెంట్ స్వామి గౌడ్, అనిల్, రవి లక్ష రూపాయలు, నిర్మాత బన్నీవాస్ 75 వేల రూపాయలు, కౌశల్ 25 వేల రూపాయల విరాళం ప్రకటించగా...దర్శకుడు పూరీ జగన్నాథ్ మనం సైతంకు ఒక ప్రత్యేకమైన యాప్ తయారు చేసి ఇస్తానని చెప్పారు.

  కాదంబరితో నా స్నేహం

  కాదంబరితో నా స్నేహం

  కాదంబరి కిరణ్ అన్నయ్యతో నాకున్న స్నేహం వయసు 30 ఏళ్లు. నేను సహాయ దర్శకుడిగా పని దొరక్క ఇబ్బంది పడుతున్న సమయంలో ఏదో ఒక పని చెప్పి వెయ్యి, రెండు వేలు చేతిలో పెడుతుండేవారు. ఏదైనా పని ఉందా అన్నా అని అడిగితే దూరదర్శన్ కార్యక్రమాలో ఏవో ఒకటి ఇస్తుండేవాడు. సేవా దృక్పథం అనేది కాదంబరి అన్న రక్తంలోనే ఉంది. ఇక్కడికొచ్చాకే ఆయన ఎంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తున్నాడో అర్థమయ్యింది. దేవుడు మనకు సాయం చేసినా చేయకున్నా మనకు అండగా ఉండేది సాటి మనిషే అని నేను నమ్ముతాను. అలాంటి సాయం చేసే మనిషి కాదంబరి. ఇందుకు ఒక యాప్ రూపొందించాలి అనుకుంటున్నాను పూరీ అన్నారు

  డబ్బుల కోసం కాదని కాదంబరి

  డబ్బుల కోసం కాదని కాదంబరి

  మన సైతం కార్యక్రమానికి రమ్మని పరిశ్రమకు చెందిన పెద్దలను అడుగుతున్నాను. ఇలా రమ్మనేది సంస్థకు డబ్బులు ఇవ్వమని కాదు. మీలాంటి పెద్దలు వస్తే మరింత మందికి మనం సైతం చేరువవుతుంది. అలా ఇంకా ఎక్కువ మందికి సేవ చేయగలుగుతాం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా 90 మంది పేదలకు ఆర్థిక సహాయం అందించాం. వివిధ ఆస్పత్రుల వైద్యులను అభ్యర్థించి పేదలకు 43 లక్షల రూపాయల ఫీజులు తగ్గించాం. పేదవాడి గురించి బతికున్నంత కాలం పరుగెత్తుతూనే ఉంటాను అని కాదంబరి కిరణ్ కుమార్ అన్నారు.

  కౌశల్ ఆర్మీకి దారి చూపించిన

  కౌశల్ ఆర్మీకి దారి చూపించిన

  మనం సైతంలో నేను సభ్యుడిని అవడం, కాదంబరి అన్నకు తమ్ముడు అవడం అదృష్టంగా భావిస్తున్నాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తర్వాత నాకు మరో అమ్మ మనం సైతం. కౌశల్ ఆర్మీని ఎలా నడిపించాలి అని ఆలోచిస్తున్న సమయంలో కాదంబరి గారు మనం సైతం ద్వారా నా అభిమానులకు దారి చూపించారు. మనం సైతం స్ఫూర్తితో కౌశల్ ఆర్మీ కూడా పనిచేస్తుంది. ఈ సేవా సంస్థకు అండగా నిలబడుతుంది. నా వంతుగా పాతిక వేల రూపాయలు విరాళం ఇస్తున్నాను అని బిగ్ బాస్ విజేత కౌశల్ అన్నారు.

   దేవుడు అన్ని చోట్లకు రాలేడనే మాట

  దేవుడు అన్ని చోట్లకు రాలేడనే మాట

  మనం సైతం కార్యక్రమం చూస్తుంటే దైవం మానవ రూపంలో ఉంటాడనే మాట గుర్తుకువస్తోంది. దేవుడు అన్నిచోట్లకు రాలేడు. తనకు బదులుగా కొందరు మనుషులను పెడతాడు. అలా దేవుడు తన రూపంలో అందించిన మనిషే కాదంబరి కిరణ్. ఆయన మనం సైతం ద్వారా పేదల ఆరోగ్యం, విద్య, వృద్ధులకు సహాయపడుతున్నారు. నా వంతుగా లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నాను. నాకు తెలిసిన విదేశీ మిత్రులకు మనం సైతం గురించి చెప్పి వారి దగ్గర నుంచి సాధ్యమైనంత విరాళాలు సేకరిస్తాను. ఎప్పుడూ సరదాగా ఉండే కాదంబరిలో ఇంత గొప్ప సేవాతత్వం ఉందని తెలిసి ఆశ్చర్యంగా ఉంది అని జయలలిత అన్నారు.

   పేదలను ఆదుకొంటున్న మనం సైతం

  పేదలను ఆదుకొంటున్న మనం సైతం

  ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, మనం సైతం ఉపాధ్యక్షుడు బందరు బాబీ మాట్లాడుతూ...కాదంబరి అన్న ఎంతో మంది పేదలను ఆదుకుంటున్నారు. ఆయన చేస్తున్న ఈ కార్యక్రమంలో చివరిదాకా తోడుగా ఉంటాం. పూరీ గారు మా కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో మనం సైతం సభ్యులు సురేష్, వర్మ, అనిల్ కుమార్, వినోద్ బాలా తదితరులు పాల్గొన్నారు.

  English summary
  Actor, director Kadambari Kiran's Manam Saitham getting good response. Puri Jagannadh, Kaushal attended for This week Mana Saitham. Both are donated some amount for noble cause.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more