twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇండస్ట్రీలో నాకంటే మేధావులున్నారు, అది మాత్రం వదలను: బోయపాటి శ్రీను

    |

    రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన 'వినయ విధేయ రామ' చిత్రం జనవరి 11న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియో విడుదల చేసింది. ఈ సందర్భంగా బోయపాటి, రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు చెప్పుకొచ్చారు.

    రామ్ చరణ్ మాట్లాడుతూ మూడేళ్ల క్రితమే బోయపాటిగారు కథ చెప్పారు. అయితే తొందరపడి తీయకుండా నాకు అంతా సెట్టయ్యాకే వస్తానని చెప్పి వెళ్లారు. కథ చెప్పినపుడే నా పాత్ర ఎలా ఉంటుంది టాటూతో సహా వివరించారని తెలిపారు.

    ఇండస్ట్రీలో నాకంటే మేధావులు ఉన్నారు: బోయపాటి

    ఇండస్ట్రీలో నాకంటే మేధావులు ఉన్నారు: బోయపాటి

    ఈ రోజు ఇండస్ట్రీలో నాకంటే మేధావులు చాలా మంది ఉన్నారు. అద్భుతంగా స్క్రిప్టు చెప్పేవారు ఉన్నారు, కానీ భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చారు. దీన్ని నిలబెట్టుకోవాలి. అలా అని పరుగెడితే కాదు. జాగ్రత్తగా చేయాలి. నమ్ముకున్నవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకు ఎట్టి పరిస్థితులోనూ ఇబ్బంది జరుగకూడదు. అందుకే సమయం తీసుకున్నాను.

    కథలో మార్పులో చేసే ఛాన్స్ ఇవ్వలేదు: రామ్ చరణ్

    కథలో మార్పులో చేసే ఛాన్స్ ఇవ్వలేదు: రామ్ చరణ్

    సబ్జెక్టులో మార్పు చేసే అవకాశం బోయపాటిగారు ఇవ్వలేదు. ఎలాంటి మార్పులు లేకుండానే చేశారు. ఆయన ఎమోషన్స్ పండించడంలో నెం.1 డైరెక్టర్. యాక్షన్ ఆయనకు గోలీకాయల ఆటలాంటిది. నాకు బాగా నచ్చింది ఆయన కథలోని ఎమోషనల్ కంటెంట్, డ్రామా.

    దాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదలను: బోయపాటి

    దాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదలను: బోయపాటి

    నేను ఒకటే నమ్ముతాను. మన తెలుగువారి బ్లడ్ లో ఉన్న హ్యూమన్ ఎమోషన్ ఎన్ని తరాలు మారినా, ఎంత వెస్ట్రన్ కల్చర్ వచ్చినా డ్యామినేట్ చేయలేదు. దాన్ని నేను నమ్ముతాను. నాకు చేతనైంది సమాజానికి మంచి చేయడం, మంచి చేయక పోయినా పర్లేదు చెడు మాత్రం చేయను. అందుకే హ్యూమన్ ఎమోషన్ వదిలిపెట్టను.

    నెలరోజుల్లో బాడీ బిల్డ్ చేయమన్నారు: రామ్ చరణ్

    నెలరోజుల్లో బాడీ బిల్డ్ చేయమన్నారు: రామ్ చరణ్

    చాలా డిజైన్డ్‌గా నా పాత్రను తయారు చేశారు. తనకు ఏం కావాలో ముందే చెప్పారు. రంగస్థలం సినిమా కోసం నేను సన్నగా అయితే నెల రోజుల్లో బాడీ పెంచాలని చెప్పారు. నెల రోజుల్లో ఇది ఎలా సాధ్యం అంటే..? మీరు చేస్తారు.. మీరు చేస్తారు.. అంటూ నాతో చేయించారు.

    350 మందితో విదేశాల్లో షూటింగ్ అంటే మాటలు కాదు

    350 మందితో విదేశాల్లో షూటింగ్ అంటే మాటలు కాదు

    నిర్మాత దానయ్య గురించి బోయపాటి మాట్లాడుతూ... జ్యూస్ నాదైనా గ్లాసు ఆయనదే. ఈ సినిమాకు ఎంత న్యాయం చేయాలో అంతకంటే ఎక్కువే చేశారు. అందుకే ఇంత గ్రాండ్ గా సినిమా చేయగలిగామని తెలిపారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. మాకు ఏం కావాలంటే అది ఇచ్చారు. ఆయన సపోర్టు వల్లే అజర్‌బైజాన్ లొకేషన్లో దాదాపు 350 మందితో షూటింగ్ చేయగలిగాం. అంత మందితో షూటింగ్ చేస్తూ అందరూ కంఫర్టబుల్‌గా ఉండేలా చూసుకున్నారని తెలిపారు.

    English summary
    Ram Charan and Boyapati Srinu Special Interview About Vinaya Vidheya Rama. Vinaya Vidheya Rama is an upcoming 2019 Indian Telugu-language action film written and directed by Boyapati Srinu. The film features Ram Charan and Kiara Advani.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X